Woman Peels Vegetables బెంగళూరు ట్రాఫిక్‌లో ఇలా.. కారులోనే పచ్చి బఠాణీలు ఒలిచిన మహిళ, వైరల్ అవుతున్న వీడియో
దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఇక సిలికాన్ సిటీ బెంగళూరులో అయితే అక్కడి ట్రాఫిక్ చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. అక్కడ కాసింత దూరానికే గంటలపాటు ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో బెంగళూరు ట్రాఫిక్(Woman Peels Vegetables In Bengaluru Traffic)గురించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బెంగళూరు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది మొట్టమొదటిగా ట్రాఫిక్ జామ్( Bengaluru Traffic Jam). గత కొంత కాలంగా బెంగళూరు ట్రాఫిక్ జామ్‌పై తెగ ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్రాఫిక్‌లోనే చాలా మంది వరకు తమ పనులను ముగించుకుంటున్నారు. ఓ సారి బీఎంటీఎస్ డ్రైవర్ బస్సులోనే లంచ్ ముగించిన.. మరో సంఘటనలో ఓ ఐటీ ఉద్యోగిని ఆఫీస్ వర్క్ చేసుకోవడం చూశాం.

అయితే ఇటీవల ఓ మహిళ X(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియో వైరల్(Woman Peels Vegetables In Traffic) అయి తెగ హల్‌చల్ చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అంత సేపు కిచెన్ పనులు అయినా పూర్తవుతాయనే ఉద్దేశంతో ఓ పని చేపట్టింది. కారులో కిచెన్ పనులు ఏంటని అనుకుంటున్నారా.. అదేనండీ ఇంటికెళ్లాక వంట చేయాలి కదా.. వంట చేయాలంటే ముందుగా కూరగాయలు ఒలవాలి కదా..
అందుకే టైమ్ వేస్ట్ కాకుండా కారులోనే పచ్చి బఠానీలు(Woman Peels Vegetables) ఒలుస్తూ ట్రాఫిక్ రద్దీని ఇలా ఉపయోగించుకున్నారు. "పీక్ ట్రాఫిక్ సమయంలో ప్రొడక్టివిటీగా ఉండటం" అంటూ ఈ వీడియోను X లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. "క్వైట్ ప్రొడక్టివిటీ" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఒకరు, ఇది మా బాస్‌కు పంపిస్తానని మరొకరు ఇలా ఫన్నీగా స్పందించారు.

ఈ సంఘటనల ద్వారా బెంగళూరు ట్రాఫిక్(Woman Peels Vegetables Video Viral)లో ప్రయాణికులు, వాహనదారులు ఎంతగా అలసిపోతున్నారో అర్థమవుతుంది. ఈ ట్రాఫిక్‌లోనే సమయం గడిచిపోతుండటంతో ఇంటికి వెళ్లాక టైమ్ ఉండటం లేదని.. కొన్ని పనులు ట్రాఫిక్‌లోనే పూర్తి చేసుకుంటున్నారు. కారు, బస్సుల్లో ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం పడుతుండటంతో అందరూ అందుకే ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు.
ఈ క్రమంలో బెంగళూరులో ద్విచక్ర వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. వాటి ద్వారా ట్రాఫిక్‌లో సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఇటీవల, ప్రఖ్యాత ట్రాఫిక్ మరియు మొబిలిటీ నిపుణుడు MN శ్రీహరి టీమ్.. ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ మరియు సిగ్నల్ ప్రాబ్లమ్స్, ఫ్యూయెల్ లాస్ ఇలా తదితర అంశాలపై విశ్లేషించింది. బెంగళూరు ట్రాఫిక్ ద్వారా వాహనదారులు ఏటా రూ.19,725 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నారని అంచనా వేసింది.
కాగా నగరంలో 60 ఫ్లై ఓవర్లు ఉన్నప్పటికీ ఐటీ హబ్ రోడ్డు వినియోగదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు శ్రీహరి టీమ్ గణాంకాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఐటీ రంగంలో పెరిగిన ఉపాధి వృద్ధి, గృహ నిర్మాణం, విద్య వంటి అన్ని సంబంధిత సౌకర్యాలలో డెవలప్‌మెంట్‌కు దారితీసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








