మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

మన నిత్య జీవితంలో నిత్యం మద్యానికి బానిసైన వ్యక్తులను చూస్తూనే ఉంటాము. మద్యపానానికి బానిసలైన వ్యక్తులు బాగా తాగి చేసే వెకిలి చేష్టలు అసలు మాటల్లో వర్ణించలేము. వీరికి ఇంటా బయట అనే తేడా ఏమాత్రం ఉండదు. ఎక్కడైనా వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటీవల ఒక వీడియో బయటపడింది. ఇందులో ఒక మహిళ బాగా తాగి రోడ్డుపై వీరంగమే సృష్టించింది.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

సాధారణంగా ఎక్కువ భాగం పురుషులే తాగి ఇలాంటి సంఘటనలకు కారకులవుతారు. అయితే ఇక్కడ ఒక మహిళ మద్యం తాగి పబ్లిక్ రోడ్డుపై అటు ఇటు దొర్లుతూ హల్ చల్ చేసింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన పూణేలో జరిగింది. ఈ ఘటనలో, తాగుడుకు బానిసైన ఒక మహిళ పుణెలోని తిలక్ రోడ్డులో ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేసింది.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

మద్యం తాగిన ఈ మహిళ రోడ్డుపై కూర్చుని వచ్చి పోయే వాహనాలను అడ్డుకుంటూ ట్రాఫిక్ కి కారణమవుతోంది. ఈ మహిళ రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో ఆడియో లేదు. అయినప్పటికీ మనకు అక్కడ ఏమి జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

రోడ్డుపై రద్దీగా ఉన్న సమయంలో ఈ మహిళా ఈ విధంగా చేయడం వల్ల ట్రాఫి కి అంతరాయం కలుగుతుంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో ఈ మహిళకు మరియు రోడ్డుపై వుండే ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రాణాంతకం కూడా.

అక్కడ ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఈలోగా ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. పబ్లిక్ రోడ్డులో అనుచితంగా ప్రవర్తించిన మహిళ కోసం పోలీసులు ట్రాక్ చేసి, ఆమెపై చర్యలు తీసుకున్నారు.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

ఈ వీడియో చూసిన చాలామంది ప్రేక్షకులు, ఆ మహిళపై అనేక రకాలుగా కామెంట్స్ చేశారు. ఇక్కడ వీడియోలో కనిపించే మహిళ గురించి మరియు అక్కడ జరిగిన సంఘటన గురించి ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

పూణేలోని పోలీస్ స్టేషన్ చీఫ్ అందించిన సమాచారం ప్రకారం, ఆ మహిళ కొన్ని నిమిషాలు రోడ్డు మధ్యలో కూర్చుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కొంతమంది వాహనదారులు మాకు ఫోన్ చేసి ట్రాఫిక్ రద్దీ గురించి ఫిర్యాదు చేశారు. ఆ కాల్ ఆధారంగా, మా పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. మేము ఆ ప్రదేశానికి చేరుకునే సరికి ఆ మహిళ అక్కడ లేదని నిర్దారించబడింది.

ఇక్కడ జరిగిన సంఘటనకు కారణం ఏమిటో ఖచ్చితంగా పోలీసులకు తెలియదు. బహుశా ఆమె పోలీసులకు చిక్కితే, ఆమె వైద్య పరీక్ష చేయించుకుని, ఆమె తాగి ఉందో లేదో తెలుసుకోవలసి ఉంది. వీడియో ఆధారంగా పోలీసులు ఆమెను ట్రాప్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన తరువాత, ఆమెకు చట్టపరమైన శిక్ష విధించబడింది.

మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించిన మహిళ; వీడియో

వీడియోలో ఈ మహిళ చేసిన విధంగా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. అయితే ఇక్కడ వీడియోలో మహిళ ఈ పని ఎందుకు చేసింది అనే విషయం గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ ఒక వీడియో ఆధారంగా మీరు మహిళపై కేసు పెట్టలేరు. ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Most Read Articles

English summary
Woman sits on mid road and tries to block vehicles video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X