Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా
ఒక మహిళ ట్రాఫిక్ పోలీసు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ పోలీస్ తన కంటే చాలా పెద్దవాడైనప్పటికీ, ఆ మహిళ నడిరోడ్డులో ప్రజల ముందు చెంపదెబ్బ కొట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ట్రాఫిక్ పోలీసులు అశ్లీలమైన మాటలతో తనని అవమానించినందుకు తాను అలా చేస్తున్నానని ఆ మహిళ తన పొరుగువారికి తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళపై మాత్రమే కేసు నమోదు చేశారు. అశ్లీలమైన భాషను ఉపయోగించినందుకు పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటన అక్టోబర్ 23 న ముంబైలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా ఉంది మరియు ఈ సంఘటన గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తుంది. వీడియోలో పోలీసులను కొట్టిన మహిళ ముంబైలోని మసీదు బందర్‌కు చెందిన 30 ఏళ్ల సాత్విక తివారీగా గుర్తించబడింది.
MOST READ:ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు

అక్టోబర్ 23 న, సాత్విక తివారీ హెల్మెట్ మరియు ఫేస్ మాస్క్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ పోలీసు ఏక్నాథ్ బర్డే ఆమెను ఆపాడు. ఏక్నాథ్ బార్డే మరియు సాత్విక తివారీల మధ్య మాటల వాగ్వాదం జరిగింది. ఏక్నాథ్ బార్డే వాగ్వివాదం సమయంలో ఆ మహిళను అశ్లీల పదాలతో వేధించాడు.

దీనితో ఆగ్రహించిన సాత్విక తివారీ, పోలీసు అని కూడా చూడకుండా ఏక్నాథ్ బర్డేపై చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటనను అక్కడికక్కడే ప్రజలు మొబైల్లో రికార్డ్ చేశారు.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

ఈ సంఘటన గురించి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్నప్పటికీ ఆమె కోపాన్ని తగ్గించడానికి ప్రజలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కూడా ఆమె కోపం తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సాత్విక తివారీ ఆ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది.

ఈ సంఘటన వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఏక్నాథ్ బర్డే, సాత్విక తివారీలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుపై సాత్విక తివారీపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
MOST READ:6,413 టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేయనున్న జగన్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
అయితే మహిళను నిర్లక్ష్యంగా వేధించిన ట్రాఫిక్ పోలీసులపై కేసు నమోదు చేయలేదు. ఈ కారణంగా, సాత్విక తివారీ కూడా పోలీస్ స్టేషన్లో గొడవపడింది. సాత్విక తివారీపై ఐపిసి సెక్షన్ 571/2020, 353, 332, 504, 506, 34 కింద కేసు నమోదైంది. ఇవి చాలా తీవ్రమైన కేసులు. ఈ నేరాలకు పాల్పడినట్లయితే, ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించవచ్చు. కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఈ సంఘటనలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని తెలిసింది. ముంబై కోర్టు ఇటీవల ఒక మహిళా జోమాటో ఉద్యోగికి ఇలాంటి శిక్ష విధించింది. మరో మహిళను ఇప్పుడు ముంబైలో అరెస్టు చేశారు. ఈ రెండు సంఘటనలు ముంబైలో గత రెండు నెలలుగా జరిగాయి.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే