మెట్రో ట్రైన్‌ను ఇలా కూడా వాడొచ్చా.. రైలులో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకున్న యువతి.. వీడియో వైరల్
ఇటీవల మెట్రో రైళ్లలో తరచూ వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నా పట్టించుకోకుండా రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి చేసిన పని వైరల్‌గా మారింది.
మెట్రో రైళ్లలో ఇటీవల పలు సంఘటనలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రీల్స్ చేయడం, మెట్రో ట్రైన్ డోర్లు మూసివేయబడకుండా కాళ్లు అడ్డం పెట్టడం, ఇలా పలు సంఘటనలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఇద్దరు యువతులు కొట్టుకున్న వీడియో కూడా మనకు తెలిసిందే. ఈ తరహా ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి.

ఢిల్లీ మెట్రో ఈ మధ్య ప్రయాణికుల వింత చేష్టలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ట్రైన్‌లో డ్యాన్స్ చేయడం దగ్గర్నుంచి రీల్స్ చేయడం వరకు రకరకాల పనులకు పాల్పడుతున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు.
తాజా ఢిల్లీ మెట్రోలో తీసిన మరో వీడియో వైరల్ అవుతోంది. మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ యువతి తన జుట్టుకు హెయిర్ స్ట్రెయిట్‌నర్ చేస్తున్న వీడియో హల్‌చల్ చేస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయడానికి మెట్రోలో సీటు పైన ఉన్న సాకెట్‌కు మెషీన్‌ను ప్లగ్ చేసి మహిళ తన జుట్టును స్ట్రెయిట్ చేసుకుంటోంది. జుట్టు ఆమె ముఖాన్ని కప్పడంతో వీడియో ముఖం కనిపించదు.

ట్రైన్‌లో ఈ సంఘటనను చూసిన ఇతర ప్రయాణీకులు ఆమె చేస్తున్న పనిని చూసి అవాక్కయ్యారు. జూన్ 17న హస్నా జరూరీ హై (@హస్నాజరూరిహై) అనే మీమ్ పేజీలో ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 1.69 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ఆమె చేసిన పనికి నెటిజన్లను వివిధ రకాలుగా స్పందించారు. హాస్యాస్పదంగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. సమయం ఆదా చేస్తూ పనులు పూర్తి చేసుకుంటున్నారని ఒకరు, ఇంట్లో కరెంట్ బిల్లు సేవ్ చూస్తూ రైలులో విద్యుత్‌ను వాడుకుంటున్నారని మరొకరు ట్వీట్ చేశారు.
మరికొందరు ఆమె చేసిన పనిని సమర్థించారు. బిజీ పనుల కారణంగా ఇలా చేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంట్లో రెడీ అవుతున్న సమయంలో కరెంట్ లేకపోవడం కారణంగా ఇలా పబ్లిక్ ప్లేస్‌లో జుట్టు స్ట్రెయినింగ్ చేసుకుంటున్నారేమో అని మరికొందరు కామెంట్ చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని వినియోగించుకుంటున్నందుకు ఆమె పన్ను చెల్లించాలని ఇలా రకరకాలుగా స్పందించారు.
ఏదేమైనా ఢిల్లీ లాంటి మహానగరంలో ట్రాఫిక్ మధ్య హడావుడి జీవితంలో ఉన్న సమయంలో అన్ని పనులను అందరూ పూర్తి చేసుకోలేరు. అటు ఉద్యోగాన్ని, ఇటు ఇంట్లో విధులను సక్రమంగా నిర్వహించాలంటే ఏ మహిళకు అయినా సవాలు లాంటిదే. అందుకే సదరు మహిళ.. ఇలా ట్రైన్‌లో ఈ పని చేసి ఉండవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








