మనసున్న మహిళపై ప్రశంసల వర్షం.. విషయం తెలిస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

సాధారణంగా పుట్టిన రోజుకో, పెళ్లి రోజుకో గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. కానీ చిన్నప్పుడు కలిసిన మనుషులకు లేదా మనతో ఉన్న మనుషులకు గిఫ్ట్స్ ఇవ్వడం అరుదు అనే చెప్పాలి. ఇటీవల నెట్టింట్లో వైరల్ అయిన ఘటన ఎంతోమందిని ఫిదా చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. ఒక ఆటోలో ఓ మహిళ ఉండటం చూడవచ్చు. ఆమె ఆటో నడుపుతున్న డ్రైవర్ నీరు తాగడానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉపయోగిస్తుండటం గమనిస్తుంది. ఆయనకు ఓ మంచి వాటర్ బాటిల్ ఇవ్వాలని నిరణయించుకుని, ఒక వాటర్ బాటిల్ కొని దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి అతనికి అందిస్తుంది. గిఫ్ట్ తీసుకున్న డ్రైవర్ చాలా ఆనందపడతారు.

Woman Surprise Gift To Autorickshaw Driver

నిజానికి ఆ మహిళ చప్పుడు చదువుకునే రోజుల్లో తనను ప్రతి రోజూ ఆటోలో స్కూలుకు తీసుకెళ్లి తీసుకువచ్చేవారిని పేర్కొంది. చిన్నప్పుడు స్కూలుకు తీసుకెళ్తున్న అతనికి మంచి గిఫ్ట్ ఇచ్చి ఆయన కళ్ళల్లో ఆనందం చూసింది. ఈ వీడియోకు ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూస్ వచ్చాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో ఆ మహిళ చేసిన పనిని అభినందిస్తున్నారు. మహిళ చేసిన పని నిజంగా అభినందనీయం.

ఎండా కాలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీటిని వేడి చేస్తుంది. చల్లగా ఉండాలంటే కాపర్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్ వంటివి ఉపయోగించాలి. కానీ అలంటి వాటర్ బాటిల్స్ కొంత ఎక్కువ ఖరీదు కావడం వల్ల కొందరు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అయితే ఆ మహిళ ఆటో డ్రైవర్ ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ బాటిల్ చూసి.. దాని స్థానంలో మంచి బాటిల్ ఉంటే బాగుంటుందని.. బాటిల్ గిఫ్ట్ ఇచ్చింది.

Woman Surprise Gift To Autorickshaw Driver

గతంలో మనం తెలుసుకున్న చాలా సంఘటనల్లో తల్లిదండ్రులు పిల్లలకు లేదా పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటారు. కానీ మనకు సంబంధం లేని వ్యక్తులకు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది దాదాపు చాలా అరుదు. కానీ కొందరు మాత్రమే మనకు సంబంధం లేని వారు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తారు. అలాంటి వారు వారికి తోచిన సాయం చేస్తారు. ఇక్కడ వీడియోలో కనిపించే మహిళ కూడా ఆ కోవకు చెందినట్లు తెలుస్తోంది.

మహిళ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పది లక్షల మంది కంటే ఎక్కువ యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఎంతోమంది ఆదర్శమని, మీరు చేసిన పని చాలా గొప్పదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఎంతోమంది హృదయాలను ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే మనం చేసే చిన్నపని ఎంతోమందికి ఆదర్శం అవుతుందని అర్థమవుతోంది.

సహాయం చేయాలనే మనసు ఉంటే, ఎదుటి వారి అవసరాలు కూడా తప్పకుండా మనకు కనిపిస్తాయి. అప్పుడు మనకు తోచినంత సాయం చేయడానికి ముందడుగు వేయాలి. అలా కాకుండా మనం మాత్రమే సమాజం అనుకుంటే పొరపాటు. మనిషి తన జీవిత కాలంలో కనీసం ఒక్కరికైనా సహాయం చేయాలి. సహాయం చేయడానికి ముందుకు రావాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. అందరిలోనూ సహాయం చేయాలనే భావన పెరుగుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 10, 2024, 15:00 [IST]
English summary
Woman surprise gift to autorickshaw driver
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+