మహిళ చేసిన పనికి నెట్టింట్లో ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?
కోడళ్లంటే ఎప్పుడూ పుట్టినింటి వారి బాగోగులు మాత్రమే చూస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం పుట్టింటింటిని, అత్తగారింటికి సమానంగా చూస్తూ.. తండ్రికి, మామకు కొత్త కార్లను గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ మహిళ తన తండ్రికి, మామకు కొత్త కార్లను గిఫ్ట్ ఇచ్చింది. వీడియోలో గమనించినట్లయితే టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ కార్లను వారికి గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోడలు ఇచ్చిన గిఫ్ట్ చూసి మామ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కుటుంబం మొత్తం కలిసి కేక్ కట్ చేయడం.. ఆనందంలో మునిగిపోవడం వంటివి చూడవచ్చు.

వీడియోను రీంపీ వెరోనికా అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. నా తండ్రి, మామగారి కలలను నిజం చేసాను. వారు ఆనందంతో ఆనందబాష్పాలు కార్చారు. ఇప్పటివరకు ఇదే సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోపై టాటా మోటార్స్ కామెంట్ చేస్తూ.. మీ నాన్నకు, మామకు కార్లను అందించడం చాలా గొప్పగా ఉంది. మీరు మరింత సంతోషంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ వీడియోలో ఆ మహిళ తండ్రి ఎవరు? మామ ఎవరు అనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇద్దరికీ సమానంగా కార్కను గిఫ్ట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. వీడియోలో ఆ మహిళ తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ డీలర్‌షిప్‌లో రెండు కార్ల కవర్లను తీయడం చూడవచ్చు. ఇందులో ఒకటి టాటా ఆల్ట్రోజ్, మరొకటి టాటా నెక్సాన్.

భారతదేశంలో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో టాటా నెక్సాన్ మాత్రమే కాకుండా.. టాటా ఆల్ట్రోజ్ కార్లు ఉన్నాయి. ఈ రెండూ దేశీయ విఫణిలో ఎక్కువ అమ్ముడవుతున్న కార్లు. ఇవి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. ఇవి రోజు వారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ రెండూ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
గతంలో మనం కొన్ని సందర్భాల్లో మనం తల్లిదండ్రులకు పిల్లలు బైకులు లేదా కార్లు గిఫ్ట్ ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. అయితే మామలు తమ కోడళ్ళకు గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా అక్కడక్కగా వెలుగులోకి వచ్చాయి. కానీ మామకు కోడలు కారు గిఫ్ట్ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ కారణంగానే చాలామంది నెటిజన్లు గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు.
తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు..
గత నెలలో ఒక యువతి తన తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350 బైక్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతోమంది నెటిజన్లను ఆకర్శించిన వీడియోపైన పలువురు నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపించారు. నిజానికి తల్లితండ్రులకు బైకులు, కార్లు గిఫ్ట్ ఇచ్చే పిల్లలు చాలా అరుదు అనే చెప్పాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








