Woman Theft Car: హ్యాండ్‌బ్యాగ్‌తో వచ్చి కారు ఎత్తుకెళ్లిన యువతి.. వీడియో చూసి ఆందోళనలో కార్ల యజమానులు.!!
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మంచితో పాటు చెడు కూడా విస్తరిస్తోంది. అందుకు ఉదాహరణే హైటెక్‌గా కార్లను దొంగతనం చేయడం. టెక్నాలజీ రోజురోజుకీ పెరుగుతుండటంతో తాళం చెవి లేకున్నా సులభంగా కార్లను చోరీ చేయగలుగుతున్నారు. తాజాగా యూపీలో ఓ మహిళ ల్యాప్‌టాప్ సాయంతో సునాయాసంగా టయోటా ఫార్చ్యూనర్‌ను దొంగిలించింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ మహిళ(Woman Theft Toyota Fortuner Using Software Technology) హైటెక్ దొంగతనానికి పాల్పడింది. నిమిషాల్లోనే ఖరీదైన కారును చోరీ చేసింది. ఈ వీడియో చూస్తే కార్ల యజమానులు.. తమ కార్లను ఇంకెంత భద్రంగా చూసుకోవాలా అని ఆందోళన పడక తప్పదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఘటన జరిగిన రోజు ఇంటి బయట టయోటా ఫార్చ్యూనర్ కారు ఆగి ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఇది తెల్లటి Toyota Fortuner. కాసేపటి తర్వాత ఓ మహిళ హ్యాండ్‌బ్యాగ్‌తో వచ్చింది. ఆ హ్యాండ్‌బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ ఉంది. కారు వద్దకు రాగానే ఆ మహిళ మొదటగా కారు అద్దాన్ని పగలగొట్టింది.
టయోటా ఫార్చ్యూనర్ అద్దం పగలగొట్టిన అనంతరం యువతి.. కారు లోపలికి వెళ్లింది. ఆమె అనంతరం తన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి టయోటా ఫార్చ్యూనర్‌ను ప్రారంభించాలని యత్నించింది. కొన్ని ప్రయత్నాల తర్వాత, టయోటా ఫార్చ్యూనర్ స్టార్ట్ అయింది. దీంతో వెంటనే ఆ యువతి అక్కడి నుంచి కారులో పరారైంది.
ఈ దృశ్యాలన్నీ ఆ వీధిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీని యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో కారు యజమానులను షాక్‌కు గురి చేసింది. ఇలాంటి చోరీలకు గురి కాకుండా తమ కారును ఎలా భద్రంగా చూసుకోవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) కారు ప్రారంభ ధర రూ. 33.43 లక్షలుగా ఉంది. అదే సమయంలో, ఈ కారు యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 51.44 లక్షలు పలుకుతోంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు కాగా ఆన్-రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుందని గమనించాలి.
ఇంతటి ఖరీదైన కారును ఓ మహిళ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ద్వారా చాలా సునాయాసంగా దొంగిలించడం కారు యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ద్వారా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఎంతగా అప్‌డేట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి హై ఎండ్ కార్లు దొంగతనానికి గురికాకుండా కాపాడుకోవడానికి అత్యాధునిక సాంకేతికత సరిపోదు.
కార్లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసేలా యజమానులు జాగ్రత్తలు తీసుకుకోవాలి. ప్రత్యేకమైన గ్యారేజ్ లేదంటే ఇంటికి గేటు ఉంటుంది కాబట్టి ఇంటి లోపల పార్కింగ్‌లో కార్లను పార్క్ చేసుకోవాలి. ఇంటి బయట పార్క్ చేయడం ద్వారా గోరఖ్‌పూర్(Woman Theft Car In Gorakhpur) లాంటి సంఘటనలు ఎదురవుతాయి.
కాబట్టి కార్ల యజమానులందరూ తమ వాహనాలను పార్క్ చేయడానికి సురక్షితమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు సురక్షితమైన పార్కింగ్ స్థలం దొరికిన తర్వాత కార్లను కొనుగోలు చేయడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారని గమనించాలి.
అయితే గోరఖ్‌పూర్‌లో జరిగిన కారు దొంగతనం కేసులో ఓ మహిళ ప్రమేయం ఉండటం నెటిజన్లను మరింత షాక్‌కు గురిచేసింది. ఈ టెక్నాలజీపై ఎక్కువగా పురుషులే అప్‌డేట్ అవుతారని మనకు తెలిసిందే. కానీ ఇలా అత్యాధునిక టెక్నాలజీల సాయంతో మహిళలు దోపిడీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications








