బస్సు ఆపలేదని రాయి విసిరిన మహిళ.. సైలెంట్‌గా పోలీస్ స్టేషన్‌కి బస్సు తీసుకెళ్లిన డ్రైవర్.. చివరకు!

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్‌లో బస్టాప్‌లో ఆగలేదని ఓ మహిళ బస్సుపై రాయి విసిరిన ఘటన చోటుచేసుకుంది. గంటల తరబడి వేచి చూసినా బస్సు ఎక్కడా ఆగలేదని.. దీంతో బస్సుపై రాయి విసిరినట్లు సదరు మహిళ పేర్కొన్నారు. అనంతరం ఏం జరిగింది పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

జూన్ 11న కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం శక్తి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Woman-Throw-a-Stone-On-Bus

రాష్ట్రంలో శక్తి యోజన అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బస్సులు గతంలో కంటే ఎక్కువగా తిరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ నాలుగు గంటల పాటు వేచి చూసినా బస్సు ఆగకపోవడంతో బస్సుపై రాయితో దాడి చేసింది. ఈ ఘటన కొప్పల్ తాలూకాలోని మునీరాబాద్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం నాన్ స్టాప్ బస్సుపై మహిళ రాయి విసిరినట్లు తెలుస్తోంది. ఇది కొప్పల్ నుంచి హోసాపేటకు వెళ్లే నాన్ స్టాప్ బస్సు అని సమాచారం. నాలుగు గంటలపాటు బస్సు కోసం వేచి చూసి విసిగిపోయి రాయి రువ్వినట్లు సదరు మహిళ తెలిపింది.

మహిళ రాయి విసరడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అవాక్కయిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. బస్సుపై రాళ్లు రువ్వుతున్న మహిళను బస్సు ఎక్కమని చెప్పాడు. ఆమెతో డ్రైవర్‌ వాగ్వాదానికి దిగకుండా బస్సును గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా డైరెక్టుగా మునీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పాపినాయకహళ్లికి చెందిన లక్ష్మి, రాళ్లు రువ్విన మరో మహిళ ఆదివారం హులిగిలోని హులిగెమ్మ దేవి దర్శనానికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. లక్ష్మి స్వగ్రామం ఇలాకల్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆమె హోసలింగాపూర్ బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. దాదాపు నాలుగు గంటలపాటు నిరీక్షించినా బస్సులు ఆగలేదు. దీంతో ఆగ్రహించిన లక్ష్మి బస్సుపై రాళ్లు రువ్వింది.

KA35 అనేది కళ్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన హోస్‌పేట్ డిపోకు చెందిన F252 నంబర్ గల బస్సు. మహిళను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే డిపో మేనేజర్ అక్కడికి వచ్చారు. అప్పుడు బస్ డిపో మేనేజర్ బస్సు గ్లాస్ ధ్వంసం కావడంతో రూ.5వేలు జరిమానా చెల్లించమని అడిగారు. క్షమాపణ చెప్పిన ఆమె అనంతరం 5,000 జరిమానా చెల్లించారు.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'శక్తి' పథకం కారణంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ చూసినా మహిళలే కనిపించారు. అయితే బస్సుల రద్దీ క్రమంగా తగ్గుతోంది. గత వారాంతంతో పోలిస్తే, నిన్న ఆలయాల్లో రద్దీ తక్కువగా ఉంది.

ఇటీవల గత కొన్ని రోజుల క్రితం బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు తన దుపట్టాతో ఓ మహిళ సీటు రిజర్వ్‌ చేసుకుని అనంతరం బస్సు ఎక్కింది. అప్పటికే ఓ మహిళ ఆ దుపట్టా తీసివేసి ఆ సీట్లో కూర్చుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. కండక్టర్‌ జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

More from DriveSpark

Article Published On: Monday, June 26, 2023, 19:15 [IST]
English summary
Woman throw a stone on bus for not stopping at busstop video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+