ఈ మహిళ చేసిన పనికి చిర్రెత్తుకొచ్చి.. మంచి గుణపాఠం చెప్పిన కారు డ్రైవర్..! వైరల్ అవుతున్న వీడియో
ఇండియాలో జరుగుతున్న చాలా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే. ఇంటి నుంచి వాహనాలను బయటికి తీసినప్పటి నుంచి కూడా తిరిగి వచ్చే వరకు రూల్స్ పాటించడం తప్పనిసరి. టూవీలర్ అయితే హెల్మెట్ ధరించడం, అదే ఫోర్ వీలర్ అయితే సీటు బెల్ట్ ధరించాల్సిందే. అదే విధంగా రోడ్లపై వాహనాలను నడిపే సమయంలో చట్ట ప్రకారం రోడ్డు నిబంధనలను పాటించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, అలాగే, ఇతర వాహనాలకు దారి ఇచ్చే సమయంలో, వాహనం స్పీడ్ వంటి విషయంలో రూల్స్ మేరకు నడుచుకోవాలి. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో మాత్రం అస్సలు వెళ్లకూడదు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మరణిస్తున్నారు. వీటిలో అధిక భాగం వాహనాలు అతివేగంగా నడపడం అలాగే ఇతర వాహనాలకు అడ్డుగా రాంగ్ రూట్‌లో వెళ్లడమే ప్రధాన కారణంగా ఉన్నాయి.
ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఏ చిన్న విషయం జరిగిన కూడా అది క్షణాల్లో ప్రపంచం అంతా చేరుతుంది. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానిలో ఉన్న దాని ప్రకారం, ఒక మహిళ తన స్కూటర్‌తో రాంగ్ రూట్‌లో రావడం కనిపించింది. పైగా ఆమె హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో బాగా షేర్ అవుతుంది.

కర్ణాటక రాష్ట్రంలో యాక్టివా స్కూటర్‌ను నడుపుతున్న మహిళ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తుంది. అది రెండు లైన్ల రోడ్డు. చాలా వాహనాలతో రోడ్డు నిండిపోయింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన వాహనాలు ఒకదాని వెనుక మరోటి నెమ్మదిగా వెళ్తున్నాయి. యాక్టివాను నడుపుతున్న మహిళ వాహనాలకు ఎదురుగా వస్తున్నారు. ఆ సమయంలో ఒక కారుకు ఆమె అడ్డంగా వచ్చారు. కారు ముందుకు వెళ్లడానికి ఎలాంటి దారి లేదు.
స్కూటర్‌కు వెళ్లడానికి దారి లేకపోవడంతో రెండు వాహనాలు కూడా కాసేపు అలాగే ఉండిపోయాయి. యాక్టివాను నడుపుతున్న మహిళ కారును ప్రక్క లైన్ నుంచి రమ్మని కోరింది. కానీ కారు డ్రైవర్, తప్పు నాది కాదు, మీరే రాంగ్ రూట్‌లో వస్తున్నారు. మీరే ప్రక్కనుంచి వెళ్లండి అన్నట్లుగా కారును అలాగే కాసేపు నిలిపి ఉంచాడు. ఈ తతంగం మొత్తం కూడా కారు డాష్‌బోర్డులో ఉన్నటువంటి కెమెరాలో రికార్డు అయింది.

స్కూటర్ నడుపుతున్న మహిళ తన రక్షణ కోసం ఉపయోగపడే హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడమే. వీడియోను చూసినట్లయితే ఆ మహిళ మొహంలో తప్పు చేసినట్లుగా ఎలాంటి పశ్చాతాపం కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వీడియోను చూసిన కొంత మంది నెటిజన్లు అహంకారంగా రాంగ్ రూట్‌లో వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. కారు డ్రైవర్ తన వాహనాన్ని అడ్డుగా నిలపడంలో ఎలాంటి తప్పు లేదు.
అతను రూల్స్ ప్రకారం వెళ్లాడని వీడియోను చూసిన నెటిజన్లు అంటున్నారు. ప్రమాదకరమైన రీతిలో డ్రైవింగ్ చేయడం ఆ మహిళ తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మహిళ స్కూటర్‌కు అడ్డుగా ఉన్న కారును, కాసేపటి తరువాత కొంచెం ప్రక్కకు తీయడంతో చిన్న గ్యాప్‌లో నుంచి మహిళ వెళ్లిపోయింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఉండటం వలన పక్కన వచ్చే వారికి కాస్త ఇబ్బంది అయింది.

అయితే కారును డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్కూటర్ నడుపుతున్న మహిళకు బుద్ధి చెప్పాలనే ఇలా చేసినట్లు వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఇలా రాంగ్ రూట్‌లో హెల్మెట్ లేకుండా ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం వలన మహిళకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పనుల వల్ల అవతలి వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.


Click it and Unblock the Notifications








