ఇదెక్కడి పిచ్చి రా బాబు.. టీవీ సీరియల్ చూస్తూ కారు నడుపుతున్న యువతి, పోలీసులు చూస్తే అంతే సంగతి.!!
టీవీ సీరియల్ చూస్తూ ఓ యువతి కారు నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుల్ ట్రాఫిక్‌లో ఇలా చేయడం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా వాటిని కొందరు బేఖాతరు చేయడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
లాంగ్ జర్నీస్ చేయడమంటే చాలా మందికి సరదా.. కారు నడుపుతూ స్థిరమైన వేగం మెయింటైన్ చేస్తూ.. ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఫ్రెండ్స్‌తో లేదంటే ఫ్యామిలీతో చాలా మంది లాంగ్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఇది కొంతవరకూ సరైనదే. ఎందుకంటే కారులో డ్రైవర్లకు, ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఇన్ఫోటైన్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ అంటూ రకరకాల ఫీచర్లను ఆటో మేకర్లు ప్రవేశపెట్టాయి.

కానీ హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఉన్న నగరంలో ప్రయాణం చేయడమంటే చిరాకుతో కూడుకున్న పనే.. ఎందుకంటే నిత్యం ట్రాఫిక్ రద్దీతో మహానగరం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి, ప్రయాణం చేసేవారికి ఊరటనిచ్చేది మ్యూజిక్ మాత్రమే. కానీ కొందరు దానిని దుర్వినియోగం చేస్తున్నారు.
సాధారణంగా కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు(Woman Watching TV Series While Driving) మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసుకుని.. మీరు ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం అందుకు విరుద్ధంగా ఓ చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో స్టీరింగ్‌పై ఫోన్ పెట్టి.. అందులో తనకు నచ్చిన టీవీ సీరియల్ చూస్తోంది.

ఈ సంఘటనను కారు వెనుక వస్తున్న ఓ బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీడియోను పరిశీలించినట్లయితే.. యువతి కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో కాకుండా ఫోన్‌లో సీరియల్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి యువతి డ్రైవింగ్ మీద అంత ఫోకస్ చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కారు ECU లేదా హ్యాండ్‌బ్రేక్‌కి కనెక్ట్ చేయబడిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (OEM) పరికరాలు వాహనం కదులుతున్నప్పుడు వీడియోలను ప్లే చేయకుండా రూపొందించారు. ఉదాహరణకు ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, చాటింగ్ చేయడం, తినడం, త్రాగడం, ప్రయాణీకులతో సంభాషించడం, స్టీరియో అడ్జస్టబుల్ లేదంటే ఇతర పనులు చేయకూడదు.

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాటింగ్ చేయడం చాలా ప్రమాదకరం. మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు లేదంటే.. వీడియోను చూస్తున్నప్పుడు మీరు రోడ్డుపై దృష్టి కేంద్రీకరించలేరు. దీంతో కారు ముందుకు ఇతర వాహనం ఏదైనా అడ్డంగా వచ్చినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రోడ్డుపై సురక్షితంగా డ్రైవింగ్ కోసం చాలా శ్రద్ధ వహించాలి. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఇతర పనులపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా యాక్సిడెంట్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లోని రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో పోలీసుల దృష్టికి వెళ్లినట్లయితే జరిమానా తప్పదు.

ముఖ్యంగా దేశంలో రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎక్కువగా జంతువులు అడ్డం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో సడెన్ బ్రేక్ వేస్తే రిస్క్ తప్పదు. కాబట్టి లిమిట్ స్పీడ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంతే కాకుండా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కేవలం రోడ్డుపైనే దృష్టి సారించాలి.
లేదంటే ఒత్తిడికి గురవతారు. ఈ సమస్యను అధిగమించేందుకు ముఖ్యంగా కరెక్ట్ డైట్ ఫుడ్ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు వాటిల్లుతాయి. వ్యాయామం ద్వారా మీ రోజువారీ డ్రైవింగ్‌లో ప్రశాంతంగా ఉంటారు. అంతే కాకుండా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేటప్పుడు కొద్ది నిమిషాలు యోగా లేదంటే ఎక్సర్‌సైజ్ చేయడం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








