ఖరీదైన BWM కారులో వచ్చి ఓ మహిళ ఏం చేసిందో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో!
ఒకప్పుడు ఏదైన వింత సంఘటన జరిగితే అది ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్‌మీడియా పుణ్యమా అని ప్రతీ ఒక్కటి క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పేద, ధనిక అనే తేడా లేకుండా ఇంటర్నెట్ ప్రపంచంలో జనాలు వింతగా ఏం చేసినా అది ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఒక ఆయుధంలా ఉంది. దాని ద్వారా వింత అనుభవాలు, పద్ధతులు బహిర్గతం అవుతున్నాయి. అంతే మొత్తంలో సీసీటీవీలు కూడా డేగ కన్నుతో వైరల్, సీక్రెట్ విషయాలను అందిస్తోంది.
అయితే ఇటీవల ఓ మహిళ ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో వచ్చి ఏం చేసిందో చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. సీసీటీవీలో రికార్డైన ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెపై చేసిన పనికి మండిపడుతున్నారు. ఖరీదైన కారులో వచ్చి అలాంటి చిల్లర పని చేయడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 18లో ఖరీదైన ఆరెంజ్ కలర్ బీఎండబ్ల్యూ కారులోంచి వచ్చిన ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న పూల కుండిని దొంగిలించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఓ సంపన్నురాలి వలె వచ్చిన ఆ మహిళ ఇలా ఎందుకు చేసింది అని ఈ వీడియో చూసిన వారిని షాక్‌కి గురిచేసింది. కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కానీ దొంగతనం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వీడియోను సచిన్ గుప్తా అనే వ్యక్తి ఖాతాలో ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. అయితే కారులో ఉంచడానికి అదే కారులో ఉన్న మరో వ్యక్తి మహిళకు సహాయం చేయడం గమనించవచ్చు. కారు లోపల పూల కుండీని మహిళ రోడ్డు పక్కన ఎవరితోనో మాట్లాడటం కూడా చూడవచ్చు. బహుశా ఆమె దొంగతానాన్ని ఎవరైనా స్థానికులు ప్రశ్నించి ఉండవచ్చు. అయితే ఈ వీడియో అక్కడితో ఎండ్ అవుతుంది.

ఆ తరువాత ఏమి జరిగిందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఈ మొత్తం తతంగం అంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఖరీదైన కారు ఉన్నవారు ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏమిటని నెటిజన్లు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఆమె దొంగతనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఇలాంటి పనులు చేస్తే వారిని వదిలేస్తారా అని మరికొందరు అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ కార్లలో వచ్చి ఇలాంటి దొంగతనాలు జరగడం చూశాం. కానీ ఇలాంటి ఖరీదైన కార్లలో వచ్చి పూల కుండీలు చోరీ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కార్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యక్తులు కేవలం రూ .500 నుంచి రూ .1,000 వరకు ఉండే కుండీని కొనలేరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు ఈ చర్యను సమర్థిస్తున్నారు. ఇలా దొంగతనం చేసే కొన్ని చెట్లు అదృష్టమని అంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాకు తెలియదు. ఇందులో కనిపించే వ్యక్తులను దొంగలుగా చిత్రీకరించాలని మా ఉద్దేశ్యం కాదు. అయితే ఈ వీడియోను చూస్తే పూర్తిగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే మీకు అందిస్తున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








