భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందులోనూ రయ్.. రయ్.. మని దూసుకుపోయే స్పోర్ట్స్ కార్లంటే ఇష్టపడని వారెవరూ ఉండరేమో. సాధారణంగా, ఇలాంటి ఖరీదైన కార్లను ఎక్కువగా వ్యాపారవేత్తలు మరియు సెలబ్రిటీలు కొనుగోలు చేస్తుంటారు. నిజానికి, సూపర్ కార్లను ఎక్కువగా మగవారు ఇష్టపడుతుంటారని అనుకుంటుంటాం. కానీ, వీటిని ప్రేమించే మహిళలు కూడా ఉంటారు. మనదేశంలో కూడా సూపర్ కార్లను ఇష్టపడే మహిళలు ఉన్నారు. అంతేకాదు, వారు ఇలాంటి కార్లను కూడా కొనుగోలు చేసారు. భారతదేశంలో ఇలాంటి సూపర్ కార్లను కలిగిన టాప్ ఉమెన్ సెలబ్రిటీలు మరియు వారి కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

మమతా మోహన్ దాస్ - పోర్ష్ 911

గాయనిగా, నిర్మాతగా, నటిగా ఎన్నో పాత్రలు పోషించిన మలయాళ సినీ నటి మమతా మోహన్ దాస్ మన తెలుగు మరియు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఈ ఉమెన్ సెలబ్రిటీ రీసెంట్ గా పోర్ష్ 911 మోడల్ సూపర్ కారును కొనుగోలు చేసింది. భారత మార్కెట్లో ఈ స్పోర్ట్స్ కారు ధర సుమారు రూ. 1.84 కోట్లకు పైమాటే. బ్లాక్ అండ్ యల్లో కలర్ థీమ్ లో ఉన్న ఈ పోర్ష్ కారు చాలా స్పోర్టీగా ఉంటుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

మార్కెట్లో లభిస్తున్న అత్యంత శక్తివంతమైన కార్లలో పోర్ష్ 911 కూడా ఒకటి. ఈ కారులో పవర్‌ఫుల్ 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 450 బిహెచ్‌పిల శక్తిని మరియు 530 ఎన్ఎమ్‌ల టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ కారు కేవలం3.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారును ఇటీవలే మమత కొనుగోలు చేసింది. దీంతో ఆమె ఇప్పుడు భారతదేశంలో సూపర్ కార్లను ఉపయోగించే యువతుల్లో ఒకరుగా నిలిచారు.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

సుమన్ మెహతా - లంబోర్ఘిని హురాకాన్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన మరియు అందరూ కోరుకునే కార్లలో ఒకటి లాంబోర్గినీ. అలాంటి ఓ లాంబోర్గినీ కారును కొనుగోలు చేశారు సుమన్ మెహతా. ప్రముఖ రాజకీయవేత్త నరేంద్ర మెహతా భార్య సుమన్ మెహతా, వృత్తిరీత్యా ఆమె ఓ బిజినెస్ ఉమెన్. ఆమె తన ఖరీదైన లాంబోర్గినీ కారుతో ఓ ఆటోరిక్షాను ఢీకొట్టినందుకు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యారు. ఈమె ఉపయోగిస్తున్న కారు లాంబోర్గినీ హురాకన్, ఈ కారును ఆమెకు తన భర్త బహుమతిగా ఇచ్చారట.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

లాంబోర్ఘిని హురాకన్ సూపర్‌కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్‌కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు 9.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా ఉంటుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

మల్లికా షెరావత్ - లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్‌వి

ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌కు చెందిన అత్యంత ఖరీదైన కార్లలో లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్‌వి కూడా ఒకటి. ఆమె వద్ద ఉన్న కార్ కలెక్షన్ లో ఇదే అత్యంత శక్తివంతమైన సూపర్ కార్ మోడల్ కూడా. ఈ కారులో 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

ఈ ఇంజన్ గరిష్టంగా 740 బిహెచ్‌పి పవర్ ను మరియు 690 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సూపర్ కారు కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

శీతల్ డగ్గర్ - లంబోర్ఘిని హురాకాన్

భారతదేశంలో లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కారును కొనుగోలు అతికొద్ది సెలబ్రిటీలలో శీతల్ డగ్గర్ కూడా ఒకరు. ఆమె భర్త ఓ వ్యాపారవేత్త, ఈ కారును అమెకు కానుకగా ఇచ్చినట్లు సమాచారం. భారత మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 3 కోట్ల వరకూ ఉంటుంది. ఈ సూపర్ కారులో శక్తివంతమైన వి10 ఇంజన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 610 బిహెచ్‌పి పవర్ ను మరియు 560 ఎన్ఎమ్ టార్క్ ను విడుదల చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

హార్ట్ కౌర్ - ఫెరారీ 458 ఇటాలియా

హార్డ్ కౌర్ గా పిలువబడే ప్రముఖ భారతీయ రాపర్ తరణ్ కౌర్ డిల్లాన్ లేదా వద్ద ఓ ఖరీదైన ఫెరారీ 458 ఇటాలియా కారు ఉంది. ఆమె అప్పడప్పుడూ ఈ కారు ఉపయోగిస్తుంటారు. బిగ్ బాయ్స్ టాయ్స్ అనే ఓ ఇంపోర్టెడ్ కార్ డీలర్ నుండి ఆమె ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఇటాలియన్ కారులోని ఇంజన్ గరిష్టంగా 568 బిహెచ్‌పి పవర్ ను మరియు 540 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

స్వాతి బగ్గా - ఫెరారీ కాలిఫోర్నియా టి

భారతదేశంలో ఫెరారీ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలలో స్వాతి బగ్గా కూడా ఒకరు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఔత్సాహికురాలైన స్వాతి బగ్గా వద్ద ఓ ఖరీదైన ఫెరారీ కాలిఫోర్నియా టి సూపర్ కారు ఉంది. ఈ సూపర్ కారులో శక్తివంతమైన వి8 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 553 బిహెచ్‌పి పవర్ ను మరియు 755 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈమె కార్ కలెక్షన్ లో ఫెరారీ ఎఫ్430 స్పైడర్ మరియు ఫెరారీ 458 ఇటాలియా వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె వద్ద బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 మరియు జాగ్వార్ ఎఫ్-టైప్ వి6ఎస్ వంటి ఇతర స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో ఖరీదైన స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్న మహిళా సెలబ్రిటీలు!

శిల్పాశెట్టి - బిఎమ్‌డబ్ల్యూ ఐ8

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ స్పోర్ట్ కార్ మోడల్. ఇలాంటి ఓ అరుదైన కారు మ బాలీవుడ్ సెలబ్రిటీ శిల్పాశెట్టి కార్ కలెక్షన్ లో భాగంగా ఉంది. ఈ కారులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి గరిష్టంగా 357 బిహెచ్‌పి పవర్ ను మరియు 570 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఇది కేవలం 4.4 సెకన్లలో గంటకు సున్నా నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Most Read Articles

English summary
Women celebrities that owns supercars in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X