సంప్రదాయ దుస్తుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను నడిపిన మహిళ.. వీడియో వైరల్..!
సోషల్ మీడియా ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన సాధనంగా ఉంది. కొద్ది కాలంలోనే సెలబ్రిటీలను చేయగల సత్తా సోషల్ మీడియాకు ఉంది. తాజాగా ఇద్దరు మహిళలు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal enfield classic 350) వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. పది సెకన్లపాటు ఉన్న వీడియోలో ఎటువంటి తడబాటు లేకుండా మహిళ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది.
సాంప్రదాయ వస్త్రాదరణతో ఉన్న మహిళ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను ఎంతో ఆత్మవిశ్వాసంతో నడపడం ఆకట్టుకుంది. ఈ వీడియో రాత్రి వేళలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే సరిగా లైటింగ్ లేని రోడ్లపై వాహనాన్ని నడపడాన్ని గమనించవచ్చు. ఈ వీడియోను 1.2 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. మరియు 76000 మంది లైక్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియలేదు.

ఆందోళ కలిగిస్తున్న వీడియో.. ! : అయితే ఈ వీడియోను పూర్తిగా గమనిస్తే.. రాయల్ ఎన్‌ఫీల్ట్ క్లాసిక్ 350 బైక్‌ను డ్రైవింగ్ చేస్తున్న మరియు వెనుక సీట్లు కూర్చున్న మహిళలు ఎటువంటి హెల్మెట్ ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయాన్ని నివారించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించే అవకాశం ఉంది.
ఇలాంటి సమయాల్లో అప్రమత్తత ఎంతో ముఖ్యం : దీంతోపాటు చీరలు ధరించి ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే సందర్భంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చీరలు.. బైక్ చైన్ లేదా చక్రాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి కారణాలతో గతంలోనూ అనే ప్రమాదాలు జరిగాయి. అందువల్ల ఇటువంటి సాంప్రదాయ దుస్తులతో డైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.

రాయల్ ఎన్‌ఫీల్ట్ క్లాసిక్ 350 ధర : భారత్ మార్కెట్‌లో ప్రజాధరణ పొందిన వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్ట్ ఒకటిగా ఉంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.93 లక్షల (ఎక్స్‌షోరూం) అదే సమయంలో హైఎండ్ మోడల్ రూ.2.26 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఈ బైక్ 6 వేరియంట్లు, 15 రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్ట్ క్లాసిక్ 350 ఇంజిన్, పనితీరు : ఈ బైక్ 349.34 cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 20.21 ps శక్తి, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 41.55 kmpl గా ఉంది. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అనలాగ్ స్పీడో మీటర్ మరియు వేరియంట్లను బట్టి సింగిల్ లేదా డ్యూయల్ ఛానల్ ABS లను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








