టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ మౌలిక సదుపాయాలను మాత్రం డెవలప్ చేయడంలో మాత్రం ఆలస్యం చూపిస్తుంది. పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడానికి ఎక్కువ టోల్ ప్లాజాలు వున్నా వాటిని మాత్రం అప్‌గ్రేడ్ చేయడం లేదు. ఈ విధంగా అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ మరియు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం ఎక్కువవుతోంది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర ఎక్కువ సమయం వేచి ఉండటం వల్ల సహనంకోల్పోయి టోల్ ప్లాజా అధికారులపైకి వాదనకు దిగిన సంఘటనలు మనం ఇది వరకే చాలా చూసాము. ఇప్పుడు అదే రీతిలో కేరళలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

కేరళలోని పాలియక్కర టోల్ గేట్ వద్ద తరచుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో విసుగు చెందిన ఒక స్త్రీ తానే స్వయంగా వెళ్లి టోల్ గేట్ ని ఎత్తి వాహనాలను పంపించినట్టు మనకు వీడియోలో కనిపిస్తుంది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

ఎక్కువ ట్రాఫిక్ లో చిక్కుకున్న మహిళ ట్రాఫిక్ ని చాలా సేపు గమనించింది. కొంతసేపు తరువాత ఆ మహిళా డ్రైవర్ ధైర్యంగా టోల్ గేట్ వద్దకి వెళ్ళింది. టోల్ గేట్ వద్దకి వెళ్లిన ఆ మహిళ తానే టోల్ గేట్ ని ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తుంది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

దాదాపు ఆమె 20 నిముషాల పాటు వాహనాలను ఎటువంటి టోల్ చార్జెస్ చెల్లించకుండా టోల్ గేట్ ద్వారా పంపించినట్లు వీడియోలో రికార్డు అయింది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

టోల్ గేట్ లో బూత్ ఆపరేటర్ ఆమెపై అరుస్తూనే ఉన్నాడు. కానీ ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోకుండా వాహనాలు ఫ్రీగా వెళ్ళడానికి అనుమతించింది. ఈ విధంగా జరగడంతో టోల్ బూత్ ఆపరేటర్ ఆమెతో గొడవపడటం మనం ఈ వీడియోలో క్లారిటీగా చూడవచ్చు. మహిళా డ్రైవర్ మరియు టోల్ బూత్ ఆపరేటర్ కి మధ్య చాలా సేపు గొడవ జరిగింది.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

ఈ ఉద్రిక్తమైన గొడవను ఆపడానికి అక్కడికి పుత్తుక్కాడ్ పోలీసులు చేరుకొని ఇద్దరి మధ్య గొడవను ఆపారు. పోలీసులు ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కానీ గొడవను మొత్తం ఆపివేసి ఆమెను వెళ్ళడానికి అనుమతించారు.

టోల్ ప్లాజా ఆపరేటర్ తో గొడవపడిన మహిళ.. ఎందుకో తెలుసా!

సాధారణంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం టోల్ ప్లాజాలకు కొన్ని నియమాలను పాటించాలని ఆదేశిస్తుంది. ఈ నియమాల ప్రకారం టోల్ ప్లాజాల దగ్గర వాహనాదారులు వేచి ఉండాల్సిన సమయం 3 నిముషాలు మాత్రమే. అంతకన్నా ఎక్కువ సమయం వేచి ఉండాల్సివస్తే వాహనదారులు టోల్ గేట్ చార్జెస్ చెల్లించకుండా వెళ్ళడానికి అనుమతించబడుతుంది.

ఇప్పుడు ఇండియాలో చాలా టోల్ గేట్ లలో టోల్ గేట్ ఆపరేటర్లు ఈ నియమాలను అనుసరించడం లేదు. చాలా మంది వాహనదారులకు కూడా ఈ నియమం తెలియదు. వాహనదారులు ఎప్పుడైనా టోల్ గేట్ వద్ద 3 నిముషాలకంటే ఎక్కువ సమయం వేచి ఉన్నట్లయితే దానికి ఋజువుగా వీడియో తీసి టోల్ గేట్ ఆపరేటర్ కి చూపించండి. ఇకపై టోల్ గేట్ నియమాలను తెలుసుకోండి.

Most Read Articles

English summary
Woman loses patience, opens toll plaza after waiting too long [VIDEO]. Read in Telugu.
Story first published: Tuesday, February 4, 2020, 13:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X