మనిషే కాదు మనసు కూడా అందమే!.. యువతి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా (వీడియో)

సోషల్ మీడియాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన సంఘటనలను మన కంట పడుతూనే ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు చాలా ప్రత్యేకం, అలాంటివి తప్పకుండా మనసును తాకుతాయి. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారిలో చాలా మంది ఓ యువతి చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ యువతి చేసిన పని ఏంటి? ఎందుకు చేసింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ రిక్షా తొక్కే వ్యక్తి ఫ్లైఓవర్ మీద తన రిక్షాలో ఎయిర్ కూలర్ కార్ట్‌ను పెట్టుకుని తొక్కుకుంటూ వెళ్తున్నారు. అంతలో ఓ యువతి ఆ రిక్షా తొక్కే వ్యక్తికి సహాయపడాలని.. రిక్షాను వెనుక నుంచి ముందుకు నెట్టడం ప్రారంభించింది. వెనుక యువతి నెడుతున్న సంగతి రిక్షా తొక్కే వ్యక్తికి తెలియదు. కొంత సేపటి తరువాత యువతిని గమనించారు.

Women Helped The Rickshaw Puller

అసలే రోజురోజుకి భయంకరంగా పెరుగుతున్న ఎండలు.. అలాంటి సమయంలో రిక్షా తొక్కడం అంటే వర్ణనాతీతం అనే చెప్పాలి. అలంటి వారికి ఎవరైనా తమకు వీలైనంత సహాయం చేయాలి. వీడియోలో కనిపించే యువతి చేసింది కూడా అదే. రోడ్డుపైన కష్టపడుతున్న వ్యక్తికి పరుగెత్తుకుంటూ వచ్చి సాయం చేసింది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వారు ఆ యువతిని తెగ ప్రశంసించేస్తున్నారు.

యువతి ఆ రిక్షా తొక్కే వ్యక్తికి సహాయం చేయడం మాత్రమే కాకుండా.. ఫుడ్, వాటర్ బాటిల్ వంటివి కూడా అందిస్తుంది. మొత్తం మీద ఆ యువతి చేసిన పని.. రిక్షా తొక్కే వ్యక్తికి కూడా కొంత ఉపశమనం కలిగించింది. నిజానికి ఎదుటివారికి సహాయం చేయడం అనే ఆలోచనే ప్రశంసనీయం. సహాయం చేయాలి అనుకున్నప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా సహాయం చేయాలి. దాన్నే మానవత్వం అంటారు.

Women Helped The Rickshaw Puller

చాలామంది ఈ రోజుల్లో రీల్స్ చేసి పాపులర్ అవ్వాలనుకుంటారు. దీనికోసం అనేక ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇది కేవలం రీల్స్ చేసేవారికి మాత్రమే కాకుండా.. ఇతరులకు కూడా ప్రమాదమే. ముఖ్యంగా హైవే మీద వాహనాలు వేగంగా వస్తూ.. పోతున్న సమయంలో కూడా రీల్స్ చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది.

యువత ఏదైనా ఓ పని చేస్తే.. అది పది మందికి ఆదర్శమవ్వాలి. ఆలా కాకుండా ఒక పని పదిమందికి తెప్పుదోవ పట్టించేలా ఉండకూడదు. కాబట్టి వీడియోలో కనిపించే యువతి మాదిరిగా సహాయర్థులకు వీలైనంత సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అది మీ మంచితనాన్ని కొందరికైనా తెలిసేలా చేస్తుంది. దాన్ని పలువురు ఆదర్శంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

సోషల్ మీడియా ఈ రోజు ప్రజల మీద బాగా ప్రభావం చూపుతోంది. కాబట్టి సోషల్ మీడియాలో వివిధ కార్యకలాపాలు నిర్వహించేవారు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం చాలా అవసరం. ఇవన్నీ ప్రజలను మంచి మార్గంలో నడవటానికి ఉపయోగపడతాయి. కానీ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ఇష్టం వచ్చినట్లు చేయడం దయచేసి ఆపేయడం మంచిది. అది వారికే శ్రేయస్కరం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 8, 2024, 11:30 [IST]
English summary
Women helped the rickshaw puller who was struggling on the flyover viral video
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+