2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్లా కంపెనీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ కార్లను తయారుచేసి విక్రయించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. టెస్లా అంటే పనితీరు మరియు టెక్నాలజీ పరంగా ఇతర బ్రాండ్ల కంటే ముందంజలో ఉన్నాయి.

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఆటో మొబైల్ పరిశ్రమలోనే ఒక విప్లవాత్మకమైన గుర్తింపు పొందింది. అయితే ఇటీవలకాలంలో టెస్లా కార్ల యొక్క ప్రమాదాలు ఎక్కువవుతున్న తరుణంలో చాలామంది ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. టెస్లా యొక్క కొన్ని ఎలక్ట్రిక్ కార్లు పదేపదే క్రాష్ అవ్వడమే దీనికి కారణం.

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

టెస్లా కార్లలో ఆటోపైలట్ అనే డ్రైవర్‌లెస్ టెక్నాలజీ వల్ల ఈ ప్రమాదాలు సంభవించవచ్చని అనుమానిస్తున్నారు. దీని కారణంగా షాంఘై ఆటో షోలో టెస్లా మోడల్ ఎస్ కారుపై ఒక యువతి నిరసన తెలిపింది.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

ఆమె టెస్లా బ్రేక్ లాస్ట్ కంట్రోల్ అని అరవడం మీరు వీడియోలో చూడవచ్చు. ఆమె ధరించిన టీ షర్టుపై కూడా "బ్రేక్ లాస్ట్ కంట్రోల్" అనే పదాలతో వ్రాయబడింది. ఆ యువతి కారుపై నిలబడి అరుస్తూ కేకలు వేయడంతో ఆ ప్రాంతంలో కొంత సందిగ్ధ వాతావరణం ఏర్పడింది.

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

ఆటో షోకు హాజరైన వారు ఒక్క క్షణం ఈ యువతి చేసిన చర్య చూసి షాక్ అయ్యారు. ఆ యువతి టెస్లా కారు పైకప్పుపై నిలబడి అరుస్తుంది. ఈ కార్యక్రమంలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఆమెను క్రిందికి లాగడానికి ప్రయత్నించారు, కాని ఆమె వారిని దూరంగా నెట్టగలిగింది.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

మరికొందరు యువతి టీ షర్టుపై ఉన్న పదాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. దీనితో ఆగ్రహించిన యువతి మళ్ళీ గట్టిగా అరవడం ప్రారంభించింది. పదేపదే ప్రయత్నించిన తరువాత, సెక్యూరిటీ గార్డులు ఆమెను బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు.

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

నివేదికల ప్రకారం, నిరసన తెలిపిన యువతికి టెస్లా మోడల్ ఎస్ కారు ఉంది. అయితే కారు ప్రమాదంలో ఆమె కుటుంబంలో నలుగురు మరణించారు. ఈ కారణంగా టెస్లా మోడల్ ఎస్ కార్ బ్రేక్ సిస్టమ్‌ క్రాష్ కారణమైందని యువతి ఆరోపించింది. ఈ కారణంగానే ఈమె ఆటో షోలో తన నిరసనను వ్యక్తం చేసింది.

MOST READ:అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

టెస్లా కార్లలో ఆటోపైలట్ ఫీచర్ వైఫల్యం కారణంగా అనేక ప్రమాదాలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల, అమెరికాలోని టెక్సాస్‌లో ఆటోపైలట్ మోడ్‌లోని కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ సీటుపై ఎవరూ కూర్చోలేదని లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

2021 షాంఘై ఆటో షోలో టెస్లా కంపెనీపై విరుచుకుపడ్డ యువతి [వీడియో]

అమెరికాలో టెస్లాపై ఇటీవల కాలంలో 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, ఆటోపైలట్ ఫీచర్ కారును పూర్తిగా ఆటోమేటిక్ చేయదని మరియు స్టీరింగ్‌ను నిర్వహించడానికి డ్రైవర్ అవసరం అని టెస్లా తన వినియోగదారులకు అనేకసార్లు తెలియజేసింది. కొద్ది రోజుల క్రితం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ టెస్లా ఆటోపైలట్ కార్లు మిగిలిన వాటికంటే దాదాపు 10 రెట్లు తక్కువ ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

Most Read Articles

English summary
Women Jumps On Tesla Model 3 Rooftop At Shanghai Auto Show. Read in Telugu.
Story first published: Tuesday, April 20, 2021, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X