Viral Video బస్సులో బూట్లతో కొట్టుకున్న మహిళలు.. సీటు కోసం మాత్రం కాదు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!!
ఓ బస్సులో ఇద్దరు మహిళలు ఒకరినొకరు బూట్ల(Women Fight In Bus)తో కొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ రద్దీగా ఉన్న బస్సులో మహిళలు ఇలా తీవ్ర వాగ్వాదానికి పాల్పడటంతో.. ఇతర ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల ప్రభుత్వ బస్సుల్లో మహిళలు(Women Fight In Bus Viral Video) జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. పక్కన జనాలు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయి ఇష్టారీతిన కొట్టుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ప్రవేశపెట్టడంతో ఈ తరహా ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో గత మూడ్రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన మరో సంఘటన నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఫిబ్రవరి 8 న ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో రద్దీగా ఉండే బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు బూట్లతో కొట్టుకోవడంతో.. అదే బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవకు కారణమేంటనేది స్పష్టంగా తెలియరాలేదు. వాగ్వాదానికి పాల్పడిన వారిలో ఓ మహిళ బస్సు కిటికీ తీయగా.. మరో మహిళ దానిని నిరాకరించడంతో ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.

వీడియోను పరిశీలించినట్లయితే(Women Hit With Shoes Each Other).. ఓ మహిళ ముందు సీట్లో మరో మహిళ వెనుక సీట్లో కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్యా వాదన ఎక్కువ కావడంతో.. కండక్టర్ జోక్యం చేసుకోవాలని బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు కోరారు. గొడవను ఆపాలని కోరారు. దీంతో కలగజేసుకున్న కండక్టర్.. వారిద్దరినీ బస్సులో నుంచి దిగిపొమ్మని చెప్పారు.
బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు, పోరాటాన్ని ఆపాలని బస్సు కండక్టర్‌ను కోరారు. కలగజేసుకున్న కండక్టర్ వారిద్దరి మధ్య గొడవను ఆపి.. వారిని విడదీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు.

మహిళలు తాము పబ్లిక్ ప్లేస్‌ల్లో ఉన్న సంగతి మర్చిపోయి ఘర్షణకు పాల్పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా అనుచితంగా ప్రవర్తించడం వారికి అవమానకరమని వ్యాఖ్యానించారు. విండో జరిపితే కూడా మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకుంటూ ఘర్షణకు పాల్పడుతున్నారని.. ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారని కామెంట్స్‌లో పేర్కొంటున్నారు.
బస్సు ప్రయాణాల్లో ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులను(Bengaluru Women Fight In Bus) ఎదుర్కోవడంపై ఆందోళనలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలోనూ ఇటీవల ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. పబ్లిక్ ప్లేస్, అందరూ చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా వారిద్దరూ ఇలా గొడవకు పాల్పడ్డారు. బస్సులోని ఇతర ప్రయాణికులు వీడియో తీయడంతో అప్పుడు వైరల్‌గా మారింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








