బైక్‌లు, కార్లపై గర్బా డ్యాన్సులు, కత్తి సాములతో అదరగొట్టిన మహిళలు.. వైరల్‌ అవుతున్న వీడియో.!!

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఒంటి చేత్తో బైక్‌లను నడిపారు. అంతే కాకుండా ఓ మహిళ కత్తిసాము చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

దేవీ నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మహిళలు ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్‌తో అదరగొట్టారు. అది కూడా బైకులు, ఓపెన్‌ టాప్‌ కారులో.. కాగా ఉత్సవాల మూడో రోజైన మంగళవారం రాత్రి గుజరాత్‌ రాజ్‌కోట్‌లో మహిళలు చేసిన గర్బా డ్యాన్స్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

Women-Perform-Garba-Dance-On-Bikes

రాజ్‌కోట్‌లోని రాజ్వీ ప్యాలెస్‌లో జరిగిన సాంస్కృతిక(Garba Dance) కార్యక్రమాల్లో మహిళలు ఖడ్గ ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించారు. బైక్‌లను ఒంటిచేత్తో నడిపారు. అంతే కాకుండా ఓ మహిళ కత్తిసాము చేస్తూ ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు మహిళలు బైక్‌లు, ఓపెన్‌ టాప్‌ కారును నడుపగా.. మరికొందరు మహిళలు వాటిపై నిలబడి తల్వార్లతో విన్యాసాలు చేయడం ఆకట్టుకుంటుంది. ఈ స్టంట్స్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు.

ఈ విన్యాసాల్లో మహిళలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ల్యాండ్ రోవర్‌ ఓపెన్‌ టాప్‌ కారు డ్రైవ్‌ చేస్తూ కత్తులు పట్టుకుని గాల్లో తిప్పుతూ చుట్టూయ తిరిగారు. ఇంకా హోండా యాక్టివా స్కూటర్‌లను కూడా నడిపారు. స్కూటర్‌ వెనుక కూర్చున్న మరో మహిళ కత్తి సాము చేస్తుండగా.. మరో మహిళ యాక్టివా నడుపుతోంది.

Women-Perform-Garba-Dance-On-Bikes

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు గత 80 ఏళ్లుగా దేశీయ మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వివిధ మోడళ్లలో ఆకర్షణీయమైన బైక్‌లను ప్రవేశపెడుతోంది. వీటిలో ప్రత్యేకత వాటి రాయల్‌ లుక్‌, సౌండ్‌.. ఈ ఫీచర్లతో తరతరాలుగా కుర్రకారుకు హాట్‌ ఫేవరెట్‌గా మారాయి.

క్లాసిక్‌ 350, Meteor 350, Interceptor 650 ఇలా వివిధ రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లోకి ఎన్ని కొత్త బైక్‌లు వచ్చినా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులకు ఉండే రాజసమే వేరు అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే వరల్డ్‌ వైడ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు భారీ అభిమానులు ఉన్నారు.

Women-Perform-Garba-Dance-On-Bikes

వేడుకల్లో భాగంగా వాహనాలన్నింటినీ పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. గర్బా డ్యాన్సులతో అదరగొట్టారు. X (గతంలో ట్విట్టర్‌)లో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 3,00,000 కు పైగా వీక్షించారు. వీడియో పట్ల నెటిజన్లు తమ కామెంట్లతో ప్రశంసల జల్లు కురిపించారు.

ఇది మహిళా సాధికారత అని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. బుల్లెట్‌ రైడ్‌ ఆకర్షించిందని మరో నెటిజన్‌ ప్రశంసించారు. ఇన్‌క్రెడిబుల్‌ అండ్‌ ఇంప్రెసివ్‌ అంటూ మరో నెటిజన్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి.

Women-Perform-Garba-Dance-On-Bikes

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2023, 15:28 [IST]
English summary
Women performing unique garba on bikes and car during navaratri celebrations video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+