బహుశా ఇలాంటి వీడియో చూసుందరండోయ్.. చీరకట్టులో యువతుల బైక్ రైడ్
గతంలో పోలిస్తే.. ఆధునిక కాలంలో ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. నేడు బైకులు, కార్లు నడపడంలో కూడా మహిళల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల ఇద్దరు మహిళలు డర్ట్ బైకులు రైడ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు చీరలు కట్టుకుని, చెప్పులు ధరించి బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియోను సురక్ష కెసి మరియు జర్నా ఛంత్యాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీరు హోండా సీఆర్ఎఫ్ సిరీస్ డర్ట్ బైక్‌లను రైడ్ చేస్తుండటం చూడవచ్చు.

ఈ బైకులు భారతదేశంలో అందుబాటులో లేదు, కానీ నేపాల్‌లో అమ్మకానికి ఉన్నట్లు సమాచారం. ఈ మహిళలు కూడా నేపాల్ వీధుల్లోనే బైకులు రైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో చూసినట్లయితే వారు బైక్ రైడింగ్ కోసం ప్రత్యేకమైన డ్రెస్ కాకుండా చీర ధరించి, చెప్పులతో రైడ్ చేస్తున్నట్లు కన్పిస్తుంది. అయితే వీరు బైక్ రైడ్ చేయడంలో నిష్ణాతులని తెలుస్తోంది.
వీడియో కనిపించే ఇద్దరు యువతుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చెక్ చేస్తే.. అందులో బైక్‌లకు సంబంధించిన అనేక వీడియోలు ఉండటం చూడవచ్చు. రైడింగ్ చేస్తున్న సమయంలో వారు సేఫ్టీ కోసం హెల్మెట్స్ ధరించి ఉండటం కూడా చూడవచ్చు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది బైక్ రైడర్లను ఆకర్షిస్తోంది. నెటిజన్లు తమదైన రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరో వీడియోలో డర్ట్ బైకులపై రైడర్స్ వెళ్లడం చూడవచ్చు. ఇందులో అందరూ కూడా హెల్మెట్, రైడింగ్ గ్లౌస్ మరియు రైడింగ్ డ్రెస్ వంటి వాటిని ధరించి ఉన్నారు. వీరిలో కొందరు చిన్న స్టంట్స్ చేయడం కూడా చూడవచ్చు. బహుశా ఇది రైడింగ్ గురించి తెలియజేయడం కోసమన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వీడియాలు ఎంతోమంది నెటిజన్లు తెగ ముగ్దుల్ని చేస్తున్నాయి.
గత కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వన్ పీస్ డ్రెస్సులు, హీల్స్ ధరించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ రైడ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆ ఇద్దరమ్మాయిలూ ఎవరూ హెల్మెట్స్ ధరించలేదు. అంతే కాకుండా సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ మితిమీరిన వేగంతో వెళ్లడం చూడవచ్చు. అయితే నేపాల్ నుంచి వచ్చిన వీడియో దీనికి భిన్నంగా ఉంది.
నిజానికి ఆధునిక కాలంలో చాలామంది మహిళలు అవలీలగా బైక్స్, కార్స్ నడిపిస్తున్నారు. అంతే కాకుండా పురుషుల మాదిరిగా బైక్స్ స్టంట్స్ కూడా చేసేస్తూ.. సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోతున్నారు. కొన్ని సార్లు బైక్ స్టంట్స్ చేసి ఇబ్బందులను ఎదుర్కున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే మహిళలైన.. పురుషులైనా.. పబ్లిక్ రోడ్డుపైన బైక్ స్టంట్స్ చేయడం చట్టరీత్య నేరం.
పబ్లిక్ రోడ్డు మీద బైక్ స్టంట్స్ చేయడం కేవలం బైక్ రైడర్లకు మాత్రమే కాకుండా.. రోడ్డుపై ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తుంది. అనుకోని ప్రమాదం జరిగితే.. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే బైక్ రైడింగ్ చేయడంలో నిష్ణాతులు అయినప్పటికీ.. పబ్లిక్ రోడ్డు మీద కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిపుణుల సమక్షంలో స్టంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








