బైక్ నడిపే స్త్రీలు, నడపని వారి కన్నా సంతోషంగా ఉన్నారు: స్టడీ

నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీలు పురుషలతో సమానంగా పోటీ పడుతూ అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు మోటార్‌సైకిల్ అంటే పురుషులు మాత్రమే వినియోగించే రవాణా సాధనం. గేర్లతో కూడిన భారీ మోటార్‌సైకిళ్లను నడపాలంటే మగవారికి మాత్రమే సాధ్యమవుతుందని భావించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మహిళలు కూడా ధైర్యంగా వీటిని నడిపేస్తున్నారు.

మహిళా రైడర్లపై హ్యార్లీ డేవిడ్‌సన్, కెల్టన్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఓ శాంపిల్ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో తమ స్వంత బైక్‌లను నడిపే మహిళలు బైక్‌లు నడపని మహిళల కన్నా సంతోషంగా ఉన్నట్లు తేలింది.

మహిళా రైడర్ల గురించి ఈ సర్వేలో వెల్లడైన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

హ్యార్లీ డేవిడ్‌సన్, కెల్టన్‌లు 1013 మంది బైక్‌లను నడిపే మహిళా రైడర్లను మరియు 1016 మంది బైక్‌లు నడపని మహిళా రైడర్లపై నిర్వహించిన ఈ సర్వేలో సగం మందికి పైగా తమ మోటార్‌సైకిళ్లే తమ సంతోషానికి కారణం అని తెలిపారు.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

ఈ సర్వే ప్రకారం, దాదాపు 74 శాతం మంది మహిళా రైడర్లు తాము మోటార్‌సైకిల్‌ను రైడ్‌ను ప్రారంభించిన తర్వాతి నుంచి తమ జీవితాలు మెరుగపడ్డాయని తెలిపారు.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

ఈ సర్వేలోని ఫలితాల ప్రకారం, 34 శాతం మంది మహిళా రైడర్లు తారు రైడింగ్ ప్రారంభించిన తర్వాతి ఒత్తి స్థాయి చాలా వరకు తగ్గిందని వెల్లడించగా, 50 శాతం మంది రైడర్లు తమ రిలేషన్‌షిప్స్‌తో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

ఇంకా ఇందులో.. 37 శాతం మహిళా రైడర్లు తాము రైడింగ్ చేస్తున్న ప్రతిసారి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

అలాగే, 27 శాతం మంది మహిళా రైడర్లు తాము రైడింగ్ చేస్తున్నప్పుడు సెక్సీగా అనిపిస్తామని చెప్పారు.

బైక్ నడిపే స్త్రీలు హ్యాపీగా, సెక్సీగా..

కాగా.. 35 శాతం మంది మహిళా రైడర్లు తాము రైడింగ్ చేస్తున్న ధీమాగా ఉంటామని వ్యాఖ్యానించారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 6, 2014, 13:40 [IST]
English summary
A study commissioned by Harley-Davidson says that women who ride their own motorcycles are happier than women who don't ride.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+