లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ కారణంగా భారతదేశంలో మొత్తం వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ కారణంగా చాలామంది వారి ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఇతర ప్రాంతాల ప్రజలు వారి కుటుంబాలకు రాలేక చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక తల్లి తన కొడుకును సుదూర గ్రామం నుండి తిరిగి తీసుకురావడానికి స్కూటర్‌లో వెళ్ళిన ఒక సంఘటన ఇక్కడ చూద్దాం.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రజియా బేగం అనే 50 ఏళ్ల మహిళ తన కొడుకును తీసుకురావడానికి చాలా దూరం ప్రయాణించింది. లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో చిక్కుకున్న తన కొడుకును తీసుకెళ్లేందుకు తన స్కూటర్‌లో 1400 కిలోమీటర్లు ప్రయాణించింది.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

ఈ ప్రయాణం పూర్తి చేయడానికి ఆ తల్లికి 3 రోజులు పట్టింది. ఆమె సోమవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించి మంగళవారం మధ్యాహ్నం 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు చేరుకున్నారు.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

బుధవారం సాయంత్రం కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది. మొత్తం మూడు రోజుల్లో దాదాపు 1400 కి.మీ. ప్రయాణించిన తనకి తన కొడుకు ఇద్దరికీ ప్రయాణించడానికి పోలీసులు సహాయం చేశారు.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

ఆ తల్లి తన కుమారుడిని తిరిగి తీసుకురావడంలో బోడియాన్ అసిస్టెంట్ కమిషనర్ విద్యా జైపాల్ రెడ్డి రజియా బేగంకు సహాయం చేసినట్లు తెలిసింది.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

లాక్‌డౌన్ కారణంగా రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయని, అంతే కాకుండా గ్రామాలు కూడా ఖాళీగా ఉన్నాయని రజియా బేగం చెప్పారు. అంతరాష్ట్ర సరిహద్దు వద్ద కూడా తమకు ఎలాంటి నిషేధం లేదని, పోలీసులు తమకు పూర్తిగా సహకరించారని వారు చెప్పారు.

భారతదేశంలో ఈ లాక్ డౌన్ కారణంగా, చాలా మంది ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఇతర ప్రదేశాలలో చిక్కుకుంటారు. వారు తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సంబంధిత రాష్ట్రాల పోలీసులకు సహాయం చేస్తున్నారు. కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడం వల్ల ఈ విధమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది.

లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

భారతదేశంలో రాను రాను కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా మరియు రాష్ట్రాల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగించే దిశగా ఆలోచనలను కొనసాగిస్తోంది. ఎట్టకేలకు భారతదేశంలో కూడా లాక్ డౌన్ పొడిగింపు మరి కొని రోజులు ముందుకు సాగనుంది. కాకపోతే ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు పొడిగిస్తారని మాత్రం కచ్చితంగా తెలియదు.

Most Read Articles

English summary
Women rides 1400km on scooty to bring her son home from Andhra Pradesh during lockdown. Read in Telugu.
Story first published: Friday, April 10, 2020, 18:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X