Working on Scooter రాపిడో స్కూటర్‌పై ల్యాప్ ట్యాప్‌తో వర్కింగ్.. బెంగళూరు యువతి వీడియో హల్ చల్..
మెట్రో పాలిటన్ నగరాల్లో ప్రత్యేకంగా బెంగళూరులో వాహనాల సంఖ్య రెండింతలు పెరగడంతో ట్రాఫిక్‌ను అధిగమించడం వాహనదారులకు రోజూ ఓ పరీక్షగా మారింది. ఐటీ కారిడార్ మార్గాల్లో ఆ ట్రాఫిక్ తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓ వైపు ట్రాఫిక్, మరో వైపు ఆఫీసులో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు.. వెరసి ఉద్యోగులకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆఫీస్‌కు ఆలస్యమవుతున్న క్రమంలో ఓ యువతి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల, ఒక మహిళా ఐటీ ప్రొఫెషనల్ ర్యాపిడో స్కూటర్‌పై ఆఫీస్‌కు వెళ్తూ తన పర్సనల్ కంప్యూటర్‌లో పనిచేసుకుంటోంది. ఆ దృశ్యాన్ని కారులోంచి ఫొటో తీసిన యువకుడు బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితిని క్లుప్తంగా వివరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మహిళా ఐటీ ప్రొఫెషనల్ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పరిస్థితిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో ట్రాఫిక్ జామ్‌లో కూరుకుపోయి, సమయానికి ఆఫీసుకు చేరుకోలేక ఆమె పడుతున్న కష్టాల గురించి ఈ ఫొటో స్పష్టంగా తెలుపుతోంది. ఈ ఫోటో షేర్ చేసిన తేదీని చూస్తే అది మే 16 అని అర్థమవుతోంది. ఆ రోజు బెంగళూరులోని ఐటీ కారిడార్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇబ్బలూరు సమీపంలోని సర్వీస్ రోడ్డులోని మిలటరీ గేటు సమీపంలో చెట్టును ఢీకొని బోల్తా పడి ట్రాఫిక్ జామ్ అయింది.
ఉద్యోగులు కార్లు, బస్సులు, ట్రైన్స్‌లో వెళ్తూ ఇలా వర్క్ చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూసి ఉండం. ఆ రోజు బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమె ఇలా రోడ్డుపై పనిచేసుకోక తప్పలేదు. ఈ పరిస్థితి రాకుండా నగరంలోని రోడ్ల పరిస్థితి ముందే తెలుసు కాబట్టి కాస్త ముందుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం మంచిది.
అదృష్టవశాత్తు ఈ మహిళ రద్దీగా ఉండే రోడ్డుపై పనిచేస్తుండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. రద్దీ తక్కువగా ఉన్నప్పుడు ఇలా పని చేసుకుంటూ ఉంటే ప్రమాదకరంగా ఉండేది. స్కూటర్‌పై డ్రైవర్ వెనుక కూర్చొని గ్రిప్‌పై పని చేస్తున్నప్పుడు, కార్లలో మాదిరిగా సీటు బెల్టులతో సహా ఇతర భద్రతా పరికరాలు ఉండవు. దీంతో సడెన్ బ్రేక్ వేసినప్పుడు, టర్నింగ్‌ల వద్ద కింద పడే అవకాశాలు ఉండేవి.
జాగ్రత్తలు తప్పనిసరి : స్కూటర్లలో సీట్‌బెల్ట్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రీయిన్‌ఫోర్స్‌డ్ స్ట్రక్చర్‌లు వంటి కార్లలో ఉండే భద్రతా లక్షణాలు సాధారణంగా ఉండవు. దేనినైనా ఢీకొన్నప్పుడు లేదా ఆకస్మికంగా ఆగిపోయినప్పుడు, ఈ భద్రతా చర్యలు లేనందున స్కూటర్ ప్రమాదాలు జరిగి గాయాలపాలయ్యే అవకాశం ఉంటుంది.
స్కూటర్లు సహజంగా కార్లు లేదా మోటార్ సైకిళ్ల కంటే తక్కువ స్థిరంగా ఉంటాయి. స్కూటర్లపై ప్రయాణించేవారు తరచుగా హెల్మెట్లు, చేతి తొడుగులు లేదా రక్షణ దుస్తులు వంటి తగిన రక్షణ గేర్‌లను ధరించడంలో విఫలమవుతారు. ఈ భద్రతా చర్యలు లేకుండా, ప్రమాదం జరిగినప్పుడు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫొటోలో మహిళ హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ తగినంత రక్షణ లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








