వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

క్రూయిజ్ షిప్స్ అనేవి సముద్రంపై తేలియాడే మహా నగరాలను తలపిస్తాయి. భారీ అంతస్తులు, విలావసవంతమైన వసతులతో కూడిన ఓడలు కొన్ని రోజులపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా నీటిపైనే అన్ని సౌకర్యాలను అందింస్తూ ప్రయాణీకులను అలరిస్తుంటాయి. తాజాగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ కొత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. రాయల్ కరీబియన్ ఆధ్వర్యంలో ఈ కొత్త క్రూయిజ్ షిప్ రాబోతోంది. దీని పేరు వండర్ ఆఫ్ ది సీస్ (Wonder Of The Seas).

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ గా మొదటి స్థానంలో ఉన్న సింఫనీ ఆఫ్ ది సీస్ (Symphony of the Seas) రికార్డును ఈ వండర్ ఆఫ్ ది సీస్ బ్రేక్ చేయనుంది. సింఫనీ ఆఫ్ ది సీస్ మొత్తం బరువు 2,28,081 టన్నులు మరియు ఇది 2018లో ప్రారంభించబడింది. కాగా, 236,857 టన్నుల బరువుతో వండర్ ఆఫ్ ది సీస్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌకగా రికార్డు స్థాపించనుంది. అంతేకాకుండా, ఇది ఐదవ అతిపెద్ద ఒయాసిస్ క్లాస్ క్రూయిజ్ షిప్ గా కూడా పేరు దక్కించుకోనుంది.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

వండర్ ఆఫ్ ది సీస్ 1,188 అడుగుల పొడవు మరియు 2,300 మంది సిబ్బందితో పాటు గరిష్టంగా 6,988 మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాగా, సింఫనీ ఆఫ్ ది సీస్ 1184 అడుగుల పొడవుతో మొత్తం 6,680 మందికి చోటు కల్పించగలదు. నిజానికి, వండర్ ఆఫ్ ది సీస్ సింఫనీ ఆఫ్ ది సీస్ కంటే 100 ఎక్కువ క్యాబిన్‌లను కలిగి ఉంటుంది. వండర్ ఆఫ్ ది సీస్ దాని సిస్టర్ ఒయాసిస్ క్లాస్ షిప్‌ల కంటే పెద్దదిగా ఉండటమే కాకుండా, అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన అదనపు పొరుగు ప్రాంతం (నైబర్‌హుడ్ ప్లేస్)ని కూడా కలిగి ఉంటుంది.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

ఎనిమిదవ నైబర్‌హుడ్ రాయల్ సూట్ క్లాస్ గెస్ట్‌లకు దాని స్వంత వ్యక్తిగత పూల్, బార్ మరియు పుష్కలంగా ఉండే సన్ లాంజర్‌లతో కూడిన ప్రత్యేకమైన డెక్ వంటి ప్రైవేట్ స్థలాలను కలిగి ఉంటుంది. అలాగే, నూక్స్ టు లాంజ్ ను కూడా కలిగి ఉంటుంది. నిజానికి, వండర్ ఆఫ్ ది సీస్ చివరి ఒయాసిస్ క్లాస్ షిప్ కాదు. ఇంకా పేరు పెట్టని ఆరవ ఒయాసిస్ క్లాస్ షిప్ 2024 రెండవ త్రైమాసికంలో దాని ప్రారంభ క్రూయిజ్‌ను స్టార్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

వండర్ ఆఫ్ ది సీస్ ప్రారంభోత్సవం మార్చి 4, 2022న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌లోని పోర్ట్ ఎవర్‌గ్లేడ్స్ నుండి షెడ్యూల్ చేయబడింది. ఈ కొత్త నౌకను జనవరి 27న డెలివరీ చేయనున్నట్టు రాయల్ కరీబియన్‌కు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిక్ వీర్ బుధవారం నాడు ట్వీట్ చేశారు. నిక్ వీర్ సగర్వంగా తన ట్వీట్‌లో "అద్భుతమైన #WonderoftheSeas, రాయల్ కరీబియన్‌ను రేపు అందజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

రాయల్ కరీబియన్ తన సరికొత్త క్రూయిజ్ షిప్ వండర్ యాజమాన్యాన్ని తీసుకోబోతోంది. వండర్ ఆఫ్ ది సీస్ ఐదవ ఒయాసిస్ క్లాస్ క్రూయిజ్ షిప్ మరియు దాని చివరి టచ్‌అప్ కోసం నవంబర్ 2021 నుండి ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో ఉంది. ఇప్పుడు రాయల్ కరేబియన్ తన క్రూయిజ్ షిప్ వండర్‌ను తయారీదారు నుండి డెలివరీ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఓడ యొక్క యాజమాన్యం షిప్‌యార్డ్ నుండి కొనుగోలుదారు, రాయల్ కరేబియన్‌కు బదిలీ చేయబడినప్పుడు క్రూయిజ్ షిప్ డెలివరీ జరుగుతుంది.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిక్ వీర్, ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో వండర్ ఆఫ్ ది సీస్ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. సమాచారం ప్రకారం, నిక్ వీర్ ఇటీవలే ఓడలో పని చేయడానికి ఫ్రాన్స్‌కు కూడా వెళ్లాడు మరియు అతని విమానం కొత్త ఓడ మీదుగా వెళ్లినట్లు క్లిప్‌ను పోస్ట్ చేశాడు. అతను కొత్త ఓడలో ఆక్వా థియేటర్ గుండా వెళుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్‌ రికార్డును కలిగి ఉన్న సింఫనీ ఆఫ్ ది సీస్ గత నెలలో కరోనా ప్రభావంతో వార్తల్లో కనిపిచింది. ఈ క్రూయిజ్ షిప్‌లో దాదాపు 48 మంది ప్రయాణికులకు కొవిడ్ సోకడం కలకలం రేపింది. రాయల్ కరేబియన్స్ సింఫనీ ఆఫ్ ది సీస్ అనే క్రూయిజ్ షిప్ లో కరోనాను అరికట్టడానికి కంపెనీ యాజమాన్యం అన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ 48 మందికి ఒకేసారి కోవిడ్ సోకడం సంచలనం రేపింది

వండర్ ఆఫ్ ది సీస్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, త్వరలో సముద్రంలోకి దిగనుంది !

ఈ ఓడలో దాదాపు 6,000 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సుమారు 48 మందికి కరోనా సోకడంతో ఓడను మయామిలో నిలిపివేశారు. క్రూయిజ్ షిప్ లో కాంటాక్ట్ ట్రేసింగులో ఓ ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఓడలో ఉన్న ప్రయాణికుల్లో 95 శాతం మందికి పూర్తిగా రెండు డోసుల టీకాలు వేసినట్లు గుర్తించారు.

Most Read Articles

English summary
Wonder of the seas all you need to know about the world s largest cruise ship details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X