చెక్కతో తయారు చేసిన వర్కింగ్ మోటార్‌సైకిల్, కారు

By Ravi

మనం ఇప్పటి వరకు చెక్క (ఉడ్)తో తయారు చేసిన వివిధ కళాఖండాలను చూసుంటాం. చెక్కతో తయారు చేసిన ఓ రన్నింగ్ మోటార్‌సైకిల్‌ను మీరెప్పుడైనా చూశారా..? వినడానికే విచిత్రంగా ఉంది కదూ..! ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయేది ఆ చెక్క మోటార్‌సైకిల్ గురించే.

ఈ క్రింది ఫొటోలో కనిపిస్తున్నదే చెక్కమోటార్‌సైకిల్, దాని పక్కనే హుందాగా నిలుచుకున్నది ఇస్ట్‌వాన్ పుస్కాస్ (చెక్క బైక్ సృష్టికర్త). హంగేరీలోని బుడాపెస్ట్ నగరానికి తూర్పుదిశగా 161 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిస్జారాస్ ప్రాంతానికి చెందిన పుస్కాస్ రెండేళ్లపాటు శ్రమించి ఈ ఉడెన్ మోటార్‌సైకిల్‌ను రూపొందించాడు.

కేవలం చెక్క మోటార్‌సైకిల్‌నే కాకుండా ఆ తర్వాత మరికొంత కాలం శ్రమించి ఓ చెక్క కారును కూడా (ఇది కూడా రన్నింగ్ కండిషన్‌లో ఉండేదే) సృష్టించాడు ఇస్ట్‌వాన్ పుస్కాస్ (51 ఏళ్లు). మరి ఈయన సృష్టించిన ఈ అద్భుతమైన చెక్క బైక్, కారు గురించి మరిన్ని విషయాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

90 శాతం చెక్కే..

90 శాతం చెక్కే..

ఈ చెక్క మోటార్‌సైకిల్‌లో దాదాపు 90 శాతం మెటీరియల్ చెక్కనే ఉపయోగించారు. ఇంజన్, టైర్లు వంటి కొన్ని రకాల విడిభాగాలను మాత్రం మెటల్‌ వాటినే ఉపయోగించారు.

రెండేళ్ల సమయం..

రెండేళ్ల సమయం..

ఈ చెక్క బైక్‌ను సృష్టించడానికి ఇస్ట్‌వాన్‌ పుస్కాస్‌కు రెండేళ్ల సమయం పట్టింది. ఇందులో ఉపయోగించిన ఫ్యూయెల్ ట్యాంక్, చక్రాలు కూడా చెక్కతో చేసినవే.

ఆల్-వెథర్ ఉడ్..

ఆల్-వెథర్ ఉడ్..

ఈ బైక్ తయారీలో ఉపయోగించిన చెక్క ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఉంటుంది.

రైడ్ సౌకర్యం లేదు..

రైడ్ సౌకర్యం లేదు..

ఈ చెక్క బైక్‌ను సాధారణ బైక్‌ల మాదిరిగానే రోడ్డుపై నడపుకోవచ్చు. అయితే, ఇది వాటంత రైడ్ కంఫర్ట్‌ను ఇవ్వదు. ఎందుకంటే, ఈ చెక్కబైక్‌ హెవీగా ఉంటుంది, దీనికి తోడు ఇందులో సస్పెన్షన్లు కూడా లేవు. (గతుకుల రోడ్లపై నడిపితే గోవిందా.. గోవిందా..)

ఇంజన్..

ఇంజన్..

ఈ చెక్క మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన ఇంజన్ పురాతన ఫియట్ కారు నుంచి గ్రహించారు.

ఆవు కొమ్ములతో హ్యాండిల్..

ఆవు కొమ్ములతో హ్యాండిల్..

ఈ చెక్క మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన హ్యాండిల్‌ను ఆవు కొమ్ములతో తయారు చేశారు.

ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్..

ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్..

ఇస్ట్‌వాన్ పుస్కాస్ ఓ ట్రాక్టర్ డ్రైవర్, అంతేకాదు ఈయన ఓ చేయితిరిగిన మెకానిక్ కూడా.

చెక్కతో కారు

చెక్కతో కారు

ఇస్ట్‌వాన్ పుస్కాస్ చెక్కతో కేవలం మోటార్‌సైకిల్‌ను మాత్రమే కాకుండా, ఓ వర్కింగ్ కారును కూడా రూపొందించాడు.

ఇది కూడా చెక్కతోనే..

ఇది కూడా చెక్కతోనే..

చెక్క మోటార్‌సైకిల్ మాదిరిగానే ఈ చెక్క కారు బాడీ, స్టీరింగ్, గేర్ రాడ్ తదితర భాగాలన్నింటినీ దాదాపుగా చెక్కతోనే తయారు చేశారు.

చెక్కతో తయారు చేయబడిన మరికొన్ని కార్లు, స్కూటర్లు, బోట్లను ఈ తర్వాతి స్లైడ్‌లలో పరిశీలిద్దాం రండి.
తడికెల కారు

తడికెల కారు

తడికెల మాదిరిగా చేతి అల్లికలతో తయారు చేసిన కారు.

స్ప్లింటర్

స్ప్లింటర్

చెక్కతో తయారు చేసిన స్పోర్ట్స్ కారు స్ప్లింటర్.

ఉడెన్ క్లాసిక్ కారు

ఉడెన్ క్లాసిక్ కారు

అమెరికన్ డిజైనర్ మైక్ మోరిస్ రూపొందించిన ఉడెన్ కన్వర్టిబల్ రెట్రో.

టూ ఇన్ వన్..

టూ ఇన్ వన్..

రెండు విభిన్న కార్లను ఒకే కారులో రూపొందించిన వైనం. దీని పేరు వాసిలీ లజరెంకో.

ఉడెన్ మోటార్ హోమ్

ఉడెన్ మోటార్ హోమ్

హోమ్ ఆన్ వీల్స్.. చెక్కతో తయారు చేసిన ఉడెన్ మోటార్ హోమ్.

ఫెరారీ స్టైల్ ఉడెన్ బోట్

ఫెరారీ స్టైల్ ఉడెన్ బోట్

చెక్కతో తయారు చేసిన ఫెరారీ లివియో డి మార్చి స్టైల్‌లో రూపొందింటిన ఉడెన్ బోట్.

చెక్క వెస్పా స్కూటర్

చెక్క వెస్పా స్కూటర్

చెక్కతో తయారు చేసిన వెస్పా డానీలా కార్లోస్ ఆల్బెర్టో స్కూటర్.

ఉడెన్ సైకిల్

ఉడెన్ సైకిల్

యోజిరో ఓషిమా ఉడెన్ సైకిల్. చెక్కతో తయారు చేసిన వర్కింగ్ సైకిల్.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2013, 11:07 [IST]
English summary
Ever wondered about some of the weirdest or wildest custom automobiles made out of wood in the world? In our thirst to figure this out, we stumbled on Istvan Puskas a wood enthusiast who has created a working car and motorcycle out of wood.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+