ప్రపంచంలో కెల్లా అతిపొడవైన, వెడల్పైన కేబుల్ బ్రిడ్జ్

By Ravi

చైనాలో నిర్మితమవుతున్న ప్రపంచంలో కెల్లా అతిపొడవైన మరియు వెడల్పైన మల్టీ-పైలన్ కేబుల్-స్టేయిడ్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ పేరు 'జియాక్సింగ్-షావోక్సింగ్ సీ బ్రిడ్జ్'. తీగల (కేబుళ్ల) సాయంతో దీనిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 6.2 మైళ్లు (10 కిలోమీటర్లు) గత ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జూన్ 17న ముగిసింది.

జియాక్సింగ్-షావోక్సింగ్ సీ బ్రిడ్జ్ కేవలం రెండు కేబుల్ టవర్లను మాత్రమే ఆసరగా చేసుకొని ఉంటుంది. ఇవి 745 అడుగుల పొడవును, 2560 అడుగుల వెడల్పును కలిగి ఉంటుంది. ఆరు లైన్లు కలిగిన ఈ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను మే 28వ తేదీనే ప్రారంభించారు. అయితే గడచిన సోమవారం పూర్తిస్థాయిలో దీనిపై ట్రాఫిక్‌ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌పై గంటకు 60 మైళ్ల (90 కిలోమీటర్ల) వేగంతో వెళ్లే వాహనాలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇంతకు తక్కువ స్పీడ్ కలిగిన కార్లు, మోటార్‌సైకిళ్లకు ఈ బ్రిడ్జ్‌పై ప్రవేశం లేదు.

ఈ బ్రిడ్జ్ జియామెన్‌‌లోని హాయ్‌కాంగ్ జిల్లాలో ఉన్న మాక్వింగ్ రోడ్డు ముందు భాగంలో ప్రారంభమైన ఝాంగ్జౌలోని లోంఘై వద్ద ఉన్న హోజై వద్ద ముగుస్తుంది. కేబుళ్ల సాయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ చూడటానికి సస్పెన్షన్ బ్రిడ్జ్‌‌లా కనిపిస్తుంది. కానీ నిర్మాణంలో ఇవి రెండు వేర్వేరుగా ఉంటాయి. ఈ జియాక్సింగ్-షావోక్సింగ్ సీ బ్రిడ్జ్ నిర్మించడానికి ముందే చైనాలో ప్రపంచంలోని టాప్ 10 కేబుల్ బ్రిడ్జ్‌లలో మూడు బ్రిడ్జ్‌లు ఉన్నాయి.

Worlds Longest And Widest Cable Bridge In China

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2013, 13:33 [IST]
English summary
China gets the world’s longest and widest multi-pylon cable-stayed bridge. It has opened in China after seven years of construction work. The Jiaxing-Shaoxing Sea Bridge stretches 6.2miles (10 kilometres) over the Hangzhou Bay, in Shaoxing, China.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+