మిస్టర్ బీన్ కారు రిపేరు ఖర్చు రూ.7.44 కోట్లు
మీ అందరికీ మిస్టర్ బీన్ గుర్తుండే ఉంటాడు. కేవలం హావభావాలతో, అమాయకత్వంతో హస్యాన్ని పలికించి వీక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే హాలీవుడ్ హాస్యనడుడు 'రోవన్ అట్కిన్సన్' ('మిస్టర్ బీన్' కామిక్ పాత్ర పోషించే నటుడు) దాదాపు ఏడాదిన్నర క్రితం, తన కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగి కోట్ల ఖరీదైన తన మెక్‌లారెన్ ఎఫ్1 కారు నుజ్జు నుజ్జు అయిన సంగతి తెలిసిందే. బీన్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలోని కేంబ్రిడ్జ్‌షైర్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
వేగంగా వెళ్తున్న ఈ కారు అదుపుతప్పి రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో బీన్‌కు చిన్నపాటి గాయం కూడా కాలేదు. యాక్సిడెంట్ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు మెక్‌లారెన్ గ్యారేజ్‌లో ఉన్న మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్ కారు ఇప్పుడు పూర్థిస్థాయిలో సిద్ధమైన మళ్లీ బీన్ చెంతకు చేరింది. మరి ఈ కారు రిపేరుకు అయిన ఖర్చు ఎంతో తెల్సా..? జస్ట్ 9 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.44 కోట్లు. ఇది ఈ కారు ఒరిజినల్ రేటు కన్నా దాదాపు రెండు రెట్లు అధికం. దాదాపు దశాబ్ధం క్రితం బీన్ ఈ కారును 6.5 లక్షల బ్రిటీష్ పౌండ్లు వెచ్చించి (అప్పట్లో సుమారు రూ.4.75 కోట్లు) ఈ కారును కొనుగోలు చేశాడు.
ప్రమాదంలో ఈ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ప్రస్తుతం ఈ కారు రిపేరు కోసం యూకేలోని ఇన్సూరెన్స్ కంపెనీ 9 లక్షల బ్రిటీష్ పౌండ్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. మిస్టర్ బీన్‌కు కార్లంటే మహా సరదా, అందులోనూ సూపర్‌కార్స్ అంటే చాలా ఇష్టం. ఈయన గ్యారేజ్‌లో రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ మొదలుకొని అనేక కార్లను గమనించవచ్చు. వీటిలో రేస్ కార్లే అధికం. మెక్‌లారెన్ ఎఫ్1 విడుదలైనప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 370 కిలోమీటర్లు.

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
ప్రమాదం తర్వాత మిస్టర్ బీన్ మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
ప్రమాద స్థలంలో మిస్టర్ బీన్ మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
రిపేరు చేసిన తర్వాత మిస్టర్ బీన్ మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు

రోవన్ ఆట్కిన్‌సన్ మెక్‌లారెన్ ఎఫ్1
మెక్‌లారెన్ ఎఫ్1 కారు


Click it and Unblock the Notifications








