రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

భారతదేశంతో సహా అన్ని దేశాల్లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్రతి నెలా మిలియన్ల కొత్త వాహనాలు అమ్ముడవుతున్నాయి. వీటిలో అన్ని రకాల బైక్‌లు, కార్లు, బస్సులు మరియు ట్రక్కులు వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రజా రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

వాహనాల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆ వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలాల కొరత కూడా ఉంది. ఇళ్లలో పార్కింగ్ స్థలం లేని వారు తమ వాహనాలను ఇంటి బయట పార్క్ చేస్తారు. ఈ విధంగా బయట పాక్ చేసినప్పుడు ఆ వాహనాలు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

వాహన దొంగతనాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కావున వాహనాలను తగిన సురక్షితమైన స్థలంలో పార్క్ చేయాలి. పార్కింగ్ స్థలాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న నగరాల్లో హాంకాంగ్‌ ఒకటి. హాంకాంగ్‌లో పార్కింగ్ ప్రదేశాలకు అధిక డిమాండ్ ఉంది.

MOST READ:హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన జిప్ ఎలక్ట్రిక్; పూర్తి వివరాలు

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

ఈ విధంగా డిమాండ్ ఉన్న కారణంగా ఇటీవల కాలంలో ఒక పార్కింగ్ స్థలం ఏకంగా 10 మిలియన్లకు అమ్ముడైంది. దీని విలువ అమెరికా డాలర్‌లలో దాదాపు 1.3 మిలియన్లు. అంతే భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 9.43 కోట్లు. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన పార్కింగ్ ప్లేస్.

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

జనసాంద్రత అత్యధికంగా ఉన్న హాంకాంగ్‌లోని మౌంట్ నికల్సన్ డెవలప్‌మెంట్ అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లలో అనేక పార్కింగ్ స్థలాలు అమ్ముడయ్యాయి. నిర్మాణ సంస్థలు వార్ఫ్ హోల్డింగ్స్ మరియు నాన్ ఫంగ్ గ్రూప్ అపార్ట్మెంట్లలో లెవల్ 2 మరియు 3 వద్ద 29 పార్కింగ్ స్థలాలను విక్రయించాయి.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

గత నెలలో టెండర్ ప్రక్రియ ద్వారా పార్కింగ్ స్థలాలను ఇంటి యజమానులకు విక్రయించారు. వీటిలో ఒక పార్కింగ్ స్థలం మాత్రమే రూ. 9.43 కోట్లకు అమ్ముడైంది. దీని విస్తీర్ణం 134.5 చదరపు అడుగులు. ఈ పార్కింగ్ స్థలం మౌంట్ నికల్సన్ డెవలప్‌మెంట్ అపార్ట్‌మెంట్స్ యొక్క అండర్ గ్రౌండ్ లో ఉంది.

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

హాంగ్ కాంగ్, ప్రపంచంలోని హాటెస్ట్ ప్రాంతాల్లో ఒకటి. అక్కడ నివసించడానికి, లేదా వాహనాలను పార్క్ చేయడానికి, ఎక్కువ డబ్బు అవసరం. అందువల్ల హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటి. కారుతో సహా ఇతర వాహనాలను పార్క్ చేయడానికి ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కొందరు పార్కింగ్ స్థలంలో పెట్టుబడులు పెట్టనున్నారు.

MOST READ:సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. షాక్‌లో అరబ్ దేశాలు

రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్కింగ్ స్థలం హాంకాంగ్‌లో విక్రయించబడింది. 2019 లో, ఒక హాంగ్ కాంగ్ వ్యక్తి కార్ పార్క్ కొనడానికి 7.6 మిలియన్లు చెల్లించాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ .7.16 కోట్లు రూపాయలు. హాంకాంగ్‌లోనే కాకుండా ఇంగ్లాండ్‌లో కూడా ఖరీదైన పార్కింగ్ ప్రాంతాలు ఉండటం గమనార్హం.

Note: Images Are Only For Representational Purpose Only

Most Read Articles

English summary
World's Most Expensive Parking Area Sold For Rs.9.43 Crore. Read in Telugu.
Story first published: Monday, June 7, 2021, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X