ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును చూడండి.. ఇది బొమ్మ కారు కాదు. నిజంగా నిజమైన కారు. అంతేకాదండోయ్, ఇది ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు కూడాను. ఓ ప్రముఖ కార్టూన్ షోలో 'పోస్ట్‌మ్యాన్ పాట్' క్యారెక్టర్ ఉపయోగించే కారు నుంచి స్ఫూర్తి పొంది ఈ చిన్న కారు తయారు చేశారు. ఈ బుల్లి కారు పేరు 'వైండ్-అప్'. యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన పెర్రీ వాట్కిన్స్ ఈ కారుకు రూపకల్పన చేశారు. ఈ వైండ్-అప్ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది.
సాధారణ కార్లలో ఉండే డోర్ మిర్రర్స్, లైట్లు, ఇండికేటర్ల మొదలైన అన్ని సదుపాయాలు కూడా ఈ బుజ్జి కారులో ఉంటాయి. ఇది పూర్తిగా రోడ్ లీగల్ కారు కాబట్టి, ఎలాంటి రోడ్లపై అయినా ఈ కారును నడుపుకోవచ్చు. పెర్రీ వాట్కిన్స్ ఈ కారు బాడీని ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేశాడు. అనంతరం ఈ బాడీని క్వాడ్ బైక్ ప్లాట్‌ఫామ్‌పై అమర్చారు. ఈ కారుకు డోర్లు ఉండవు, కారులోనికి ప్రవేశించాలంటే ముందు భాగాన్ని పూర్తిగా వెనక్కు ఎత్తివేయాలి (కారు బానెట్ లేపినట్లుగా).
ఈ వైండ్-అప్ చిన్న కారులో 150సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, మెరుగైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బుజ్జి కారు 104.14 సెం.మీ. (41 ఇంచ్‌లు) ఎత్తును, 66.04 సెం.మీ. (26 ఇంచ్‌లు) వెడల్పును మరియు 132.08 సెం.మీ. (52 ఇంచ్‌లు) పొడవును కలిగి ఉంటుంది. ఈ కారుకు ఫంక్షనల్ లైట్స్, విండ్‌షీల్డ్ వైపర్స్, ఇండికేటర్స్, ఫాక్స్ రేసింగ్ అగ్జాస్ట్ వంటి సదుపాయాలున్నాయి. మరి ఈ వైండ్-అప్ కారుపై ఓ కన్నేసొద్దాం రండి..!

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

ప్రపంచంలో కెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారు

Click it and Unblock the Notifications