ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్
సాధారణంగా వి12 ఇంజన్లను లగ్జరీ కార్లు, సూపర్‌కార్లు, స్పోర్ట్స్ కార్లలో మనం గమనిస్తుంటాం. ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉండి, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా అరచేతిలో ఇమిడిపోయే వి12 ఇంజన్‌ను చూశారా..? ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న వి12 ఇంజన్. 12 సిలిండర్లు కలిగిన ఈ ఇంజన్‌లో ఉపయోగించిన ఒక్కొక్క పిస్టన్ కేవలం మన చేతివేలి గోరు అంత పరిమాణం మాత్రమే ఉంటుంది.
ఈ అతిచిన్న ఇంజన్ సామర్థ్యం కేవలం 12సీసీ మాత్రమే. మరి ఇంత చిన్న ఏ కారులో ఉపయోగిస్తారా అని కదా మీ సందేహం. ఈ ఇంజన్‌ను ఏ కారులో ఉపయోగించరు. ఇది ఉదాహరణకు మాత్రమే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇంజన్ పనిచేస్తుంది కూడా. అయితే, ఇది పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో పనిచేయదు. మరి దేనితో పనిచేస్తుందని అనుకుంటున్నారా? ఈ అతిచిన్న ఇంజన్ కేవలం గాలితోనే నడుస్తుంది.
ఈ అతిచిన్న వి12 ఇంజన్‌ను స్పానిష్ ఇంజనీర్ పాటెలో తయారు చేశారు. ఈ ఇంజన్‌లో ప్రతి భాగాన్ని ఆయన చేతుల్తోనే తయారు చేశారు. ఈ ఇంజన్‌లో మొత్తం 261 విడిభాగాలు, 222 స్క్రూలు ఉన్నాయి. దీనిని తయారు చేయడానికి 1200 గంటలు శ్రమించినట్లు పాటెలో తెలిపారు. స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడిని ఉపయోగించిన ఈ ఇంజన్ విడిభాగాలను (స్క్రూలు మినహా) చేతుల్తో తయారు చేశామని ఆయన తెలిపారు. ఈ చిన్న వి12 ఇంజన్ కంప్రెష్డ్ ఎయిర్‌తో పనిచేస్తుంది. మరి ఈ బుజ్జి ఇంజన్‌పై ఓ లుక్కేసొద్దాం రండి.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్



Click it and Unblock the Notifications








