ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాహనాలు [మీరు ఆశ్చర్యపోతారు]

ప్రపంచంలో కెల్లా అతిచిన్న వస్తువులకు అలాగే అతిపెద్ద వస్తువులకు మంచి క్రేజ్ ఉంటుంది. ఉదాహరణకు, బహుశా ఓ సాధారణ కారు ప్రపంచం దృష్టిని ఆకర్షించకపోవచ్చు. కానీ అదే కారు ప్రపంచంలో కెల్లా అతిచిన్నది లేదా అతిపెద్దది అయితే మాత్రం ఖచ్ఛితంగా యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. దాని విశిష్టతే (పరిమాణం) ఇందుకు ప్రధాన కారణం.

ఇది కూడా చదవండి: టాప్ 25 బ్యూటిఫుల్ ట్రైన్ రూట్స్

ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో ప్రపంచంలో అతిపెద్ద/భారీ వాహనాల గురించి తెలుసుకుందాం రండి. మరి ఆలస్యమెందుకు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ ఫొటో ఫీచర్‌ను ఓసారి తిరగేయండి మరి..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాహనాలు

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

బెలాజ్ 75710

బెలాజ్ 75710

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డంప్ ట్రక్

* తయారు చేసినది: బెలారష్యన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంపెనీ (బెలాజ్)

ఇదొక మైనింగ్ డంప్ ట్రక్. ప్రపచంలో కెల్లా అతిపెద్ద మరియు భారీ డంప్ ట్రక్‌గా ఇది గిన్నిస్ రికార్డును సృష్టించనుంది. బెలాజ్ 75710 మైనింగ్ డంప్ ట్రక్కు 27 అడుగుల పొడవును, 810 టన్నుల బరువును కలిగి, 8 భారీ చక్రాలను కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారిగా 450 టన్నుల బరును తీసుకెళ్లగలదు. ఇందులో రెండు 16-సిలిండర్ టర్బోచార్జ్‌‌డ్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ప్రతి ఇంజన్ గరిష్టంగా 2300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

బెలాజ్ 75710 గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ఈ ట్రక్కును సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. 2015లో వీటిని మార్కెట్లోకి తీసుకువస్తామని బెలాజ్ పేర్కొంది. ఈ ట్రక్కుకు సంబంధించిన మరిన్ని ఫొటోలు, వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్

* తయారు చేసినది: ఎయిర్‌బస్

ఎయిర్‌బస్ ఏ380 విమానాన్ని తొలిసారిగా 2007లో ప్రారంభించారు. జంబో విమానంగా పిలిచే 747-400 కన్నా ఇది పెద్దది కావటంతో దీనిని సూపర్‌జంబో విమానంగా సంబోధించేవారు. వాస్తవానికి 747 విమానాల కన్నా ఏ380 విమానం 1.5 రెట్లు ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. 5000 చ.అ. పైగా ఫ్లోర్ స్పేస్ కలిగిన ఈ విమానంలో 525 నుంచి 800 మంది ప్రయాణీకుల వరకు కూర్చోవచ్చు (సీట్ లేవుట్‌ను బట్టి).

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా 125 ఎయిర్‌బస్ ఏ380 విమానాలున్నాయి (ఒక్క ఎమిరేట్స్ సంస్థ వద్దే 45 ఎయిర్‌బస్ ఏ380 విమానాలున్నాయి). అయికే, కొన్నేళ్లలో ఈ సంఖ్య 400కు చేరుకునే అవకాశం ఉంది. ఒక్కో ఎయిర్‌బస్ ఏ380 విమానం ఖరీదు దాదాపు రూ.2,500 కోట్లకు పైమాటే. ఎయిర్‌బస్ ఏ380 విమానాలను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఆర్‌డబ్ల్యూఈ బ్యాగ్గర్ 288 ఎక్స్‌కావేటర్

ఆర్‌డబ్ల్యూఈ బ్యాగ్గర్ 288 ఎక్స్‌కావేటర్

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నేలను దున్నే వాహనం

* తయారు చేసినది: క్రుప్ (జర్మనీ)

బ్యాగ్గర్ 288 ఎక్స్‌కావేటర్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ల్యాండ్ వెహికల్. దీనిని జర్మనీకి చెందిన క్రుప్ అనే సంస్థ తయరు చేసింది. ప్రస్తుతం అతిపెద్ద యుటిలిటీ కంపెనీ ఆర్‌డబ్ల్యూఈ ఏజి ఈ వాహనాన్ని స్వంతం చేసుకొని, ఆపరేట్ చేస్తోంది. మట్టిని తొలగించాలన్నా, కొండల్ని పిండి చేయాలన్నా బ్యాగ్గర్ 288 ఎక్స్‌కావేటర్‌కు చిటికెలో పని.బ్యాగ్గర్ 288 ఎక్స్‌కావేటర్ 311 అడుగుల ఎత్తును, 705 అడుగులు పొడవును మరియు 45,500 టన్నుల బరువును (ఇంచు మించు టైనానిక్ షిప్ అంత బరువును) కలిగి ఉంటుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇదొక బకెట్ వీల్ ఎక్స్‌కావేటర్. జర్మనీలోని ఓపెన్-పిట్ కోల్ మైన్లలో (అంటే భూఉపరితలంపై ఉండే కోల్ మైన్లలో) పనిచేసేందుకు ఈ వాహనాన్ని నిర్మించారు.
ఎమ్ఎస్ వయాసిస్ ఆఫ్ ది సీస్

ఎమ్ఎస్ వయాసిస్ ఆఫ్ ది సీస్

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ప్యాసింజర్ షిప్

* యజమాని: రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్

ఎమ్ఎస్ వయాసిస్ ఆఫ్ ది సీస్ ఒక వయాసిస్-క్లాస్ క్రూయిజ్ షిప్, దీని ఓనర్ రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్. అక్టోబర్ 2009లో ఈ షిప్పును ప్రారంభించారు. ఈ షిప్ ఏకంగా 6000 మంది ప్రయాణీకులతో ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ఆ సమయంలో ఇది ఫ్రీడం-క్లాస్ క్రూయిజ్ షిప్స్‌ను (ఇది కూడా రాయర్ కరేబియన్‌కు చెందినదే) అధిగమించి, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్‌గా నిలిచింది.

దీని మొత్తం బరువు 2,25,282 టన్నులు. ఇందులో 5400 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు (ఫుల్ లోడ్ కెపాసిటీ 6360 ప్రయాణీకులు). దీని మొత్తం పొడవు 1181 అడుగులు. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

నాక్ నెవిస్ సూపర్ ట్యాంకర్ (సీవైజ్ గెయింట్)

నాక్ నెవిస్ సూపర్ ట్యాంకర్ (సీవైజ్ గెయింట్)

* ప్రపంచంలో కెల్లా అతిపొడవైన షిప్

* తయారు చేసినది: సుమిటోమో హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్

దీని మొదటి పేరు సీవైజ్ గెయింట్ ఆ తర్వాత దీనిని హ్యాపీ గెయింట్, జాహ్రే వికింగ్, నాక్ నెవిస్, ఆప్పోమా అని పిలిచేవారు. కాగా.. ప్రస్తుతం దీనిని మోంట్ అని పిలుస్తున్నారు. ఇదొక యూఎల్‍‌సిసి సూపర్‌ట్యాంకర్. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన షిప్. అంతేకాదు అత్యంత భారీ షిప్ కూడా. దీని మొత్తం బరువు 6,57,019 టన్నులు.ఈ షిప్పును 1974లో ఆర్డర్ చేస్తే 1979లో డెలివరీ చేశారు. ఇది తయారైన చాలా కాలం వరకు దీనికి పేరు పెట్టలేదు. 1016 అనే నెంబర్‌తో దీనిని గుర్తించేవారు. దీని చివరి ప్రయాణం 2009లో జరిగింది. ఇండియన్ షిప్ బ్రేకర్స్‌కు విక్రయించిన తర్వాత దీనికి మోంట్ అని పేరు మార్చారు. దీని జీవతకాలం ముగియటంతో 2009లో ఈ షిప్పును నిర్వీర్యం చేశారు.
రష్యన్ టైఫూన్-క్లాస్ సబ్‌మెరైన్

రష్యన్ టైఫూన్-క్లాస్ సబ్‌మెరైన్

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సబ్‌మెరైన్

* తయారు చేసినది: సోవియట్ నేవీ

దీనిని ప్రాజెక్ట్ 941 లేదా అకులా (షార్క్ అని అర్థం) అనిపిలుస్తారు, దీని నాటో రిపోర్టింగ్ పేరు టైఫూన్. ఇదొక న్యూక్లియర్-పవర్డ్ బల్లిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ టైప్. దీనిని సోవియెట్ నేవీ 1980లో అభివృద్ధి చేసింది. మొత్తం 48,000 టన్నుల బరువు కలిగి ఉండే ఈ సబ్‌మెరైన్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సబ్‌మెరైన్. ఇందులో సిబ్బంది సముద్ర గర్భంలో నెలల తరబడి నివసించేందుకు సరిపడా సౌకర్యాలుంటాయి.

తొలుత రష్యా ఈ పురాతన సబ్‌మెరైన్‌ను ఆధునికీకరించాలని యోచించినప్పటికీ, దీనికయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని మార్చ్ 2012లో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. దీనిని మోడ్రనైజేషన్ చేసే ఖర్చుతో రెండు బోరీ-క్లాస్ సబ్‌మెరైన్లను తయారు చేయవచ్చట.

అమెరికన్ మినిట్జ్ క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్

అమెరికన్ మినిట్జ్ క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద యుధ్ద నౌక

* తయారు చేసినది: న్యూపోర్ట్ న్యూస్ షిప్‌బిల్డింగ్ కంపెనీ

ఇదొక యుద్ధ నౌక. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన ఈ నౌకపై 10 న్యూక్లియర్ పవర్డ్ యుద్ధ విమానాలను తరలించే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు, ఈ విమానాలన్నీ కూడా ఇదే షిప్‌పై ల్యాండింగ్-టేకాఫ్ కూడా అవుతాయి. దీని మొత్తం 1092 అడుగులు (333 మీటర్లు), మొత్తం లోడ్ సామర్థ్యం లక్ష టన్నులు. ఇందులోని 10 క్యారియర్లను వర్జీనియాలోని న్యూపోర్ట్ న్యూస్ షిప్‌బిల్డింగ్ కంపెనీ తయారు చేసింది. ఇరాన్‌లోని ఆపరేషన్ ఈగల్ క్లా, గల్ఫ్ వార్ వంటి అనే వివాదాల్లో కూడా ఇది పాలుపంచుకుంది.

మిల్-వి12 (ఎమ్ఐ-12)

మిల్-వి12 (ఎమ్ఐ-12)

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద హెలికాఫ్టర్

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద హెలికాఫ్టర్ మిల్ వి-12 (నాటో రిపోర్టింగ్ నేమ్ హోమర్)కు ఎజడెలియే 65 అనే ప్రాజెక్ట్ నెంబర్ ఇచ్చారు. దీని ప్రొడక్షన్ నేమ్ (ఎమ్ఐ-12). ఈ హెలికాఫ్టర్ నిర్మాణం కోసం 1959లోనే మిల్ ఓకెబిలో అధ్యయనం ప్రారంభమైంది. ఆ తర్వాత 1961లో జికెఏటి (గోసుడార్స్టెవిన్నీ కోమిటెట్ పో అవిట్సోనీ టెక్నిక్ - ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ స్టేట్ కమిటీ) ఇందుకు ఆమోదం తెలిపింది.

ఈ హెలికాఫ్టర్ 20 నుంచి 25 టన్నుల బరువును మోయగలదు.

ఆంటోనోవ్ యాన్-225 మ్రియా

ఆంటోనోవ్ యాన్-225 మ్రియా

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్

* తయారు చేసినది: ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో (సోవియెట్ యూనియన్)

ఆంటోనోవ్ యాన్-225 మ్రియా (నాటో రిపోర్టింగ్ నేమ్ 'కొస్సాక్') ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఫిక్స్డ్ వింగ్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్. దీనిని సోవియెట్ యూనియన్‌కు చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో 1980లో డిజైన్ చేసింది. ఇది 6 టర్బో ఫ్యాన్ ఇంజన్లతో పనిచేస్తుంది. ఇది అతిపొడవైన, అతిభారీ విమానం. ఇది గరిష్టంగా 650 టన్నుల బరువుతో టేకాఫ్ కాగలదు. వాస్తవానికి బురాన్ స్పేస్‌ప్లేన్‌ను రవాణా చేసేందుకు ఆంటోనోవ్ యాన్-225 మ్రియాను తయారు చేశారు. తొలి ఆంటోనోవ్ యాన్-225ను 1988లో పూర్తి చేశారు. ఇప్పటికీ ఇది నిర్వహణలో ఉంది.

క్రాలర్ ట్రాన్స్‌పోర్టర్

క్రాలర్ ట్రాన్స్‌పోర్టర్

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రాలర్ ట్రాన్స్‌పోర్టర్

* తయారు చేసినది: నాసా

క్రాలర్ ట్రాన్స్‌పోర్టర్స్ అనేవి ఓ జత ట్రాక్డ్ వెహికల్స్. నాసా వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌‌ (విఓబి)లో తయారైన సేప్‌స్‌క్రాఫ్ట్స్‌ను తరలించేందుకు వీటిని ఉపయోగిస్తారు. వాస్తవానికి వీటిని అపోలో, స్కైల్యాబ్ మపియు అపోలో-సోయుజ్ ప్రోగ్రామ్స్ సమయంలో సాటర్న్ ఐబి, సాటర్న్ వి రాకెట్లను రవాణా చేసేందుకు ఉపయోగించారు. ఆ తర్వాత వీటిని 1981 నుంచి 2011 వరకు స్పేస్ షటిల్స్ రవాణా చేసేందుకు ఉపయోగించారు. ఈ క్రాలర్ ట్రాన్స్‌పోర్టర్లు వాహనాలను మొబైల్ లాంచర్ ప్లాట్‌ఫామ్‌పై తీసుకువచ్చేందుకు సహకరిస్తాయి.

ఫొటో మూలం: వికీ మీడియా

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాహనాలు

ఈ కథనం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తున్నాము. ఇది మీకు నచ్చినట్లయితే, మీ మిత్రులతో దీనిని షేర్ చేయగలరు.

ఫొటో మూలం

More from DriveSpark

Article Published On: Monday, April 28, 2014, 17:50 [IST]
English summary
Do you think only planes and ships are the largest in the world? We've found some gargantuan examples that straddle the line between engineering marvel and disaster, representing the biggest vehicles traversing the planet today. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+