మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాహన కొనుగోలు దారులు ఎలక్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్ మరియు ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్కు వెలువడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

సాధారణంగా మంటలను ఆర్పే అగ్నిమాపక దళాల వాహనాల గురించి అందరికి తెలుసు, అవన్నీ ఇంధనంతో నడిచేవి. కాని ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఈ వాహనం ప్రత్యేకమైనది, అరిజోనాలోని టక్సన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇటీవల వోల్వో గ్రూప్ సహకారంతో సృష్టించిన ఈ ట్రక్ ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్.

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఈ ఫైర్ ట్రక్కును తొలిసారిగా 2019 లో ప్రవేశపెట్టారు, తరువాత దీనిని నిరంతరం టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్రక్ అగ్నిమాపక వాహనాలలో విప్లవాత్మక మార్పులు చేయగలదని కంపెనీ పేర్కొంది. దీనిని టెస్లా ఆఫ్ ఫైర్‌ట్రక్ అని కూడా పిలుస్తారు. ఈ ఎలక్ట్రిక్ ఫైర్‌ట్రక్ వోల్వో యొక్క పెంటా ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడింది.

MOST READ:మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అనేక ఆధునిక లక్షణాలు మరియు పరికరాలను కలిగి ఉంది. ఈ ట్రక్కులో సోనార్, కెమెరా మరియు డ్రోన్ కూడా ఉన్నాయి. ఈ ఫైర్‌ట్రక్ యొక్క రెండు ఇరుసులపై ఒక ఎలక్ట్రిక్ మోటారు వ్యవస్థాపించబడింది. దీనితో పాటు, ట్రక్కులో 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేయబడింది, ఇది అవసరమైనప్పుడు దాని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ ట్రక్ 50 kWh మరియు 100 KWh బ్యాటరీల ఎంపికతో వస్తుంది. ఈ ట్రక్ గరిష్టంగా 490 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్ 150 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉటుంది. అయితే ఇందులో ఉన్న 100 kWh బ్యాటరీ వెర్షన్, ఒక గంటలో 50 శాతం నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్‌లో అమలు చేయవచ్చు మరియు దాని బ్యాటరీ శక్తిని వివిధ అవసరాలకు అనుకూలంగా ఉపయోగించవచ్చు.

MOST TEAD:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

వోల్వో ఈ ట్రక్ యొక్క పికప్ చాలా ఎక్కువగా ఉంటుందని, కావున అత్యవసర సమయాల్లో ఆలస్యం చేయకుండా సంఘటన స్థలానికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది హై లోడింగ్ కెపాసిటీ మరియు కాంపాక్ట్ బాడీని కలిగి ఉంటుంది.

వోల్వో యొక్క ఫైర్‌ట్రక్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్‌లను ఇండిపెండెంట్ సస్పెన్షన్ మరియు హైడ్రోఫోబిక్ చాసిస్ తో కలిసి ఉంటుంది. ఇది అధిక స్థాయి భద్రతతో పాటు, మంచి డ్రైవింగ్ పనితీరును అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక విభాగాలు వారి ఇంధన ఖర్చులను తగ్గించటానికి సహాయపడుతుంది.

MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఈ ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్ అగ్ని వాహన విభాగ పరిశ్రమలో విప్లవాత్మకమైనదిగా, ఇది ఎలక్ట్రిక్ ట్రక్ కావున జీరో కార్బన్ ఉద్గారాలతో మరియు తక్కువ శబ్దం ఉత్పత్తి చేయడంతో పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉటుంది. ఏది ఏమైనా ఈ ఎలక్ట్రిక్ ఫైర్ ఆధునిక కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

Image Courtesy: azfamily powered by 3TV & CBS5AZ

Most Read Articles

English summary
World’s First Electric Fire Truck Developed By Volvo Showcased In Arizona. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X