ఎగిరే ఎలక్ట్రిక్ కారుకి గ్రీన్ సిగ్నల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆకాశంలో 177 కి.మీ ప్రయాణించవచ్చు!

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రోజు రోజుకు వేగంగా పెరిగిపోతుంది. పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. వీటి ఉత్పత్తిలోనూ భారీ మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సాంప్రదాయ ఇంధన వాహనాలకు ప్రాధాన్యం తగ్గి.. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న వినూత్న ఎలక్ట్రిక్ కారు వివరాలు మీకోసం..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లకు భిన్నంగా మేము ఈ కథనంలో చెప్పబోయే కారు వివరాలు మిమ్మల్నీ ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. త్వరలోనే మార్కెట్లోకి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. అవును మీరు విన్నది నిజమే ఎగిరే ఎలక్ట్రిక్ కారుకి అధికారికంగా లైసెన్స్ లభించింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. విజయవంతంగా దీనిని పరీక్షించిన తర్వాత సర్టిఫికేట్ కేటాయించారు.

Flying-Electric-Car

అమెరికాకు చెందిన ఆటోమోటివ్, ఏవియేషన్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ఎగిరే ఎలక్ట్రిక్ కారుని రూపొందించింది. దీనికి సంబంధించి యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి స్పెషల్ సర్టిఫికేషన్ పొందినట్లు ఏవియేషన్ లా సంస్థ ఏరో లా సెంటర్ తెలిపింది. దీంతో ఈ ఎగిరే కార్లు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్ మీదుగా త్వరలోనే ప్రయాణించగలవు.

ఈ తరహా వాహనానికి (ఎగిరే కారు) అమెరికాలో సర్టిఫికేట్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలెఫ్ ఏరోనాటిక్స్ అధికారిక ప్రకటన ప్రకారం, ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (తెేలికపాటి) (eVTOL) వాహనాల కోసం Federal Aviation Administration (FAA) పలు విధి విధానాలను రూపొందించింది. తేలికపాటి వాహనాల గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య పరస్పర చర్యలను నియంత్రించే నిబంధనలన్ని కూడా తీసుకువచ్చింది.

స్పెషల్ ఎయిర్వర్త్ నెస్ సర్టిఫికేట్ ద్వారా ప్రయాణించడానికి అనుమతించిన ప్రదేశాలల్లో అనుమతి లభించినట్లు అలెఫ్ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక బహుముఖ వాహనంగా కంపెనీ వివరించింది. దీనిని రహదారిలో కూడా నడపవచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎగరడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఈ వాహనం రోడ్డుపై 322 కిలోమీటర్లు మరియు 177 కిలోమీటర్లు ఎగిరే పరిధిని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

అలెఫ్ ఏరోనాటిక్స్ విషయానికొస్తే, ఈ సంస్థ కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా ఉంది మరియు ఆటోమోటివ్ మరియు ఏవియేషన్లో ప్రత్యేకత కలిగి ఉంది. వారు తయారు చేసిన కారు ప్రస్తుతం ఒకరిద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఎగిరే కారు యొక్క ప్రస్తుత ధర సుమారు 300,000 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.5 కోట్లు అన్నమాట.

అక్టోబర్ 2022 లోనే అలెఫ్ ఏరోనాటిక్స్ స్పోర్ట్స్ కార్ మోడల్ పాటు రెండు ఫంక్షనల్ టెక్నాలజీ కార్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది జనవరిలో 440కి పైగా వాహనాలను వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్లు ప్రీ-ఆర్డర్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం 2025 చివరి నాటికి ఈ ఎగిరే కార్లను వినియోగదారులకు డెలివరీ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని అలేఫ్ సీఈవో జిమ్ దుఖోవ్నీ తెలిపారు. ప్రీ-ఆర్డర్ల కోసం మార్కెట్ సామర్థ్యానికి తగినట్లుగా పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అధికారిక ధ్రువీకరణ లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్తేజంతో మరింత దూకుడుగా పనిచేసి మార్కెట్ లో నిలదొక్కుకుంటామని ఆయన హామి ఇచ్చారు.

సాధారణ పట్టణ లేదా గ్రామీణ రహదారిపై డ్రైవింగ్ చేయడానికి ఈ ఎగిరే కారును అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీనిని సాధారణ పార్కింగ్ స్థలంలో మరియు సాధారణ సైజు గ్యారేజీ లోపల పార్క్ చేయవచ్చు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్ పేర్కొంది. సాధారణ పట్టణ, గ్రామీణ రహదారులపై నడిచేలా దీన్ని రూపొందించారు.

2025 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రెండేళ్లలోనే మనిషి ఎగిరే కారులో ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారుగా రూపొందుకోవడంతో భారీగా డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు చాలా సంస్థలు వీటిని రూపొందిస్తున్నాయి. డ్రైవర్ రహిత కార్లపై కూడా పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కార్లు పుట్టుకొస్తూనే ఉంటాయనడానికి ఇదే సరైనా ఉదాహరణ.

More from DriveSpark

Article Published On: Friday, June 30, 2023, 12:13 [IST]
English summary
Worlds first flying electric car gets approved by us federal aviation administration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+