భారత్‌లో ల్యాండింగ్ కానున్న ప్రపంచంలో కెల్లా తొలి సోలార్ ప్లేన్
సౌర శక్తితో నడిచే ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సౌర విమానం 'సోలార్ ఇంపల్స్' (Solar Impulse)ను దాని రూపకర్తలు ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ సౌర విమానంతో ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టారు.
సోలార్ ఇంపల్స్ గడచిన సోమవారం నాడు అబుదాబీ నుంచి తన ప్రపంచ ప్రయాణం మొదలు పెట్టింది. చుక్క ఇంధనం అవసరం లేకుండా సుమారు 35,000 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించే ఈ విమానానికి తొలి పైలట్‌గా సోలార్ ఇంపల్స్ సీఈవో బోర్ష్‌బర్గ్, రెండవ పైలట్‌గా సంస్థ సహ వ్యవస్థాపకుడు పికార్డ్ వ్యవహరిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి నుంచి టేకాఫ్ ఎయిన ఈ సోలార్ విమానం ఒమన్‌లోని మస్కట్‌లో తొలి స్టాప్ చేసిన తర్వాత తిరిగి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ల్యాండ్ కానుంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సోలార్ ఇంపల్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విమానం ఐదు నెలల్లో 25 రోజుల పాటు ఎగరుతుంది. జూలై చివర నాటికి ఈ విమానం తిరిగి అబుదాబికి చేరుకుంటుంది.

సోలార్ ఇంపల్స్ విమానంలో ఒకే సీటు ఉంటుంది. దీని మొత్తం బరువు 2,300 కిలోలు మాత్రమే. ఖాళీ బోయింగ్ (1.80 లక్షల కిలోలు)తో పోల్చుకుంటే ఇది నామమాత్రమే.

సోలార్ ఇంపల్స్ విమానపు రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దీని ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు. బోయింగ్ 747 విమానంతో పోల్చుకుంటే ఈ సోలార్ విమానం రెక్కలే పెద్దవి.

సోలార్ ఇంపల్స్ పూర్తిగా సౌరశక్తితోనే నడుస్తుంది. రెండు రెక్కలపై సోలార్ ప్యానెళ్లను అమర్చబడి ఉంటాయి. ఈ రెక్కలపై మొత్తం 17,248 సోలార్ సెల్స్ ఉంటాయి.

ఈ సోలార్ ప్యానెళ్లు సౌరశక్తిని గ్రహించి, దానిని విద్యుచ్ఛక్తిగా మార్చి దానిని లిథియం పాలిమర్ బ్యాటరీలలో స్టోర్ చేస్తాయి. ఈ సోలార్ పవర్‌తో విమానంలో ఉండే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్‌ను తిప్పుతాయి.

సోలార్ ఇంపల్స్‌ను కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేయటం వలన చాలా తేలికగా ఉంటుంది. దీని ప్రస్తుతం గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు మాత్రమే.

సోలార్ ఇంపల్స్ పగటిపూట సముద్రంపై 8,500 మీటర్లు, రాత్రిపూట 1,500 మీటర్ల ఎత్తులో ఎగరగలదు.

పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మీదుగా సాగే ప్రయాణం ఎక్కడా ఆగకుండా ఐదు రాత్రులు, ఐదు పగళ్లూ సాగనుంది. ఈ ఐదు రోజులూ పైలట్ ఒక్కరే ఉంటారు.

సోలార్ ఇంపల్స్ విమానంలో పైలట్ వెనక్కి వాలడం తప్ప సీట్లోంచి లేచేందుకు వీలుండదు. పైలట్ కాలకృత్యాలను తీర్చుకునేందుకు వీలుగా ఈ సీటును రూపొందించారు.

సోలార్ ఇంపల్స్ కాక్‌పిట్‌లో ఎయిర్ కండిషనింగ్/హీటర్ సిస్టమ్ ఉండదు కాబట్టి పైలట్‌కు ఉక్కపోత, చలి తప్పదు. పైలట్ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, ఇతర సమాచారం నిరంతరం కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది.

సోలార్ ఇంపల్స్ అబుదాబీ నుంచి మస్కట్, ఒమన్, భారత్, చైనా, మయన్మార్, హవాయి, ఫీనిక్స్, అరిజోనా, న్యూయార్క్, మొరాకోల మీదుగా ప్రయాణించి తిరిగి అబుదాబీకి చేరుకుని ప్రపంచయాత్రను ముగించనుంది.


Click it and Unblock the Notifications








