ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

ఈ ఫొటోలలో కనిపిస్తున్నది ఆషామాషా విమానం కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, దీని పేరు 'స్ట్రాటోలాంచ్'. ఈ విమానాన్ని అమెరికాకు చెందిన స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ తయారు చేసింది. దీని ఆకారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది, రెండు విమానాలను కలిపి తయారు చేసినట్లుగా ఉంటుంది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

స్ట్రాటోలాంచ్ విమానం ఇటీవలే తన రెండవ టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన స్ట్రాటోలోంచ్, తన రెండన టెస్ట్ ఫ్లైట్‌లో సుమారు 2.5 గంటల పాటు ఆకాశంలో ఎగిరింది. దక్షిణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి మీదుగా ఈ విమానాన్ని పరీక్షించారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

ఈ సమయంలో అది సుమారు 14,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. పక్కపక్కనే ఎగురుతున్న రెండు భారీ బోయింగ్ జెట్‌లను పోలి ఉండే ఈ అతిపెద్ద విమానం మొత్తం ఆరు బోయింగ్ ఇంజన్లతో పనిచేస్తుంది. ఈ విమానం రెక్కల పొడవు 117 మీటర్లు ఉంటుంది.

MOST READ:కరోనా నివారణ కోసం ఫస్ట్ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ క్యాంప్ స్టార్ట్ చేసిన BMC

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

మరి ఇంత భారీ విమానాన్ని ఎందుకోసం తయారు చేశారనే కదా మీ సందేహం. అమెరికా ఈ స్ట్రాటోలాంచ్ విమానాన్ని బాగా ఎత్తైన ప్రదేశాల నుండి రాకెట్లు మరియు అంతరిక్ష వాహనాలను గగనతలంలోకి ప్రవేశపెట్టడం ఉపయోగించనుంది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

ఈ విమానం రెండవ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడం గురించి స్ట్రాటోలాంచ్ సిస్టమ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేనియల్ ఆర్ మిల్మాన్ వ్యాఖ్యానిస్తూ, "హైపర్‌సోనిక్ మార్కెట్లో ప్రపంచ నాయకుడిగా మన దేశం యొక్క సామర్థ్యాన్ని స్ట్రాటోలాంచ్ అభివృద్ధి చేస్తోంది. ప్రపంచంలోని ప్రధాన హైపర్‌సోనిక్ విమాన పరీక్ష సేవలను అందించే మా వాగ్దానానికి ఈ రోజు మా విమానం మరో అడుగు దగ్గరగా ఉంది" అని అన్నారు.

MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్‌తో అక్రమాలకు చెక్..

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

వాస్తవానికి అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేయటం ఇదే మొదటిసారి కాదు. అమెరికాలో 1941లో, 700 మంది అమెరికన్ సైనికులను యుద్ధానికి తీసుకెళ్లేందుకు ఓ భారీ విమానాన్ని నిర్మించాల్సిందిగా బిలియనీర్ వ్యవస్థాపకుడు హోవార్డ్ హ్యూస్‌ను అమెరికా ప్రభుత్వం నియమించింది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

అప్పుడు హ్యూస్ "స్ప్రూస్ గూస్" అనే ఓ భారీ విమానాన్ని సృష్టించారు. ఆ విమానం యొక్క రెక్కల పొడవు 97.5 మీటర్లు. స్ప్రూస్ గూస్ అనే మారుపేరుతో ఉన్న హ్యూస్ ఎయిర్‌క్రాఫ్ట్ హెచ్ -4 హెర్క్యులస్ విమానం "ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ఎగిరే పడవ" గా మిగిలిపోయింది.

MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

ఫ్లైట్‌గ్లోబల్ ప్రకారం, ఇది 1947లో ఈ విమానాన్ని ఒకే ఒక్కసారి మాత్రమే విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు ఈ విమానాన్ని ప్రజల సందర్శనార్ధం ఒరెగాన్‌లోని మెక్‌మిన్విల్లేలో మ్యూజియంలో ఉంచారు. చెక్కతో మరియు ఎనిమిది భారీ ప్రొపెల్లర్ ఇంజన్‌లతో తయారు చేసిన స్ప్రూస్ గూస్ విమానం ఆరు బోయింగ్ 747-400 ఇంజన్‌లతో సమానైన శక్తిని మరియు పనితీరును అందిస్తుంది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

స్ట్రాటోలోంచ్ సిస్టమ్ ఈ టెస్ట్ ఫ్లైట్‌ను ట్వీట్ చేయడం ద్వారా ఈ విమానం యొక్క టెస్టింగ్ వీడియోని కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్ కాంపోజిట్ విమానం అని కంపెనీ పేర్కొంది. ఈ విమానం చాలా పెద్దది మరియు ధృడంగా ఉంటుంది. ఇది ఇతర వాహనాలను అత్యంత ఎత్తుకు తీసుకెళ్లి, అక్కడి నుండి అంతరిక్షంలోకి పంపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

అప్పటి హ్యూస్ స్ప్రూస్ గూస్ విమానం ఒక సాధారణ అమెరికన్ ఫుట్‌బాల్ మైదానం పొడవుకు దగ్గరగా ఉండేది. అయితే, ఇప్పుడు కొత్తగా రూపొందించిన స్ట్రాటోలాంచ్ విమానం కొలతలు హ్యూస్ స్ప్రూస్ గూస్ విమానం కొలతలను మించిపోయాయి.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

స్ట్రాటోలోంచ్ సంస్థను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ 2011లో ప్రారంభించారు. ఉపగ్రహాలను ప్రయోగించే సహాయంతో అధిక స్ట్రాటో ఆవరణ వేదికను నిర్మించడమే ఈ కంపెనీ లక్ష్యం. అంటే, సాధారణంగా నేలపై నుండి ఎగిరే రాకెట్లను, ఈ విమానం ద్వారా ఆకాశంలోకి తీసుకెళ్లి అక్కడి నుండి చుక్కల్లోకి పంపాలని చూస్తున్నారన్నమాట.

Most Read Articles

English summary
World's Largest Airplane Stratolaunch Successfully Completes Second Test Flight. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X