మొదటిసారి బెంగళూరులో ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అతి పెద్ద విమానం.. దీని ప్రత్యేకలు ఏమిటో తెలుసా?
ఈ రోజుల్లో విమాన ప్రయాణం చాలా సాధారణం అయిపోయింది. అయితే ఇందులో కూడా మరింత లగ్జరీ కోరుకునే ప్రజలు చాలామందే ఉన్నారు. కావున లగ్జరీ విమానాలు కూడా ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద విమానం అయిన 'ఎయిర్‌బస్ ఏ380' బెంగళూరులోని కెంపెగౌడ ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టులో నిన్న (శుక్రవారం) మొదటి సారిగా ల్యాండ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కెంపెగౌడ ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టులో 'ఎయిర్‌బస్ ఏ380' అక్టోబర్ 14 న ల్యాండ్ అవుతుందని బిఎల్ఆర్ ఎయిర్‌పోర్ట్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఈ లగ్జరీ ఎయిర్‌బస్ ఏ380 శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి 10 గంటలకు ప్రారంభమైన ఈ విమానం బెంగళూరుకు మధ్యాహ్నం 3:40 గంటలకు చేరుకుంది.

నిజానికి 'ఎయిర్‌బస్ ఏ380' రెండు వారాలకు ముందే బెంగళూరులో ల్యాండ్ అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 14 న ల్యాండ్ అయ్యింది. బెంగళూరు ప్రయాణికులకు ఇదే తొలి విలాసవంతమైన విమాన అనుభవం అని చెప్పవచ్చు. అయితే ఇది అదే రోజు సాయంత్రం మళ్ళీ దుబాయ్ చేరుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో బెంగళూరు కాకుండా.. ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ మాత్రమే ఈ ఎయిర్‌బస్ ఏ380 ల్యాండ్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నాయి.

1985 లో ఎమిరేట్స్ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది, ఆ తరువాత 2006 నుండి బెంగుళూరు ప్రజలకు సేవలు అందిస్తోంది. ఎయిర్‌బస్ ఏ380 అనేది బోయింగ్ 777 కంటే కూడా 45 శాతం ఎక్కువ సీటింగ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. కావున ఎక్కువ మంది ఒకేసారి ఇందులో ప్రయాణించవచ్చు.

ఎయిర్‌బస్ ఏ380 విమానంలో ఎక్కువమంది ప్రయాణించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో ఆధునిక లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 72.7 మీటర్ల పొడవు ఉన్న ఈ విమానం మొత్తం రెండు అంతస్తులను కలిగి ఉంటుంది. ఈ విమానం మొత్తం బరువు సుమారు 510 టన్నుల నుంచి నుంచి 575 టన్నుల వరకు ఉంటుంది. ఇక ఎత్తు అయితే ఏకంగా 24.1 మీటర్ల వారు ఉంటుంది. మొత్తం మీద ఇది ప్రపంచంలోని ఎత్తైన విమానాల్లో ఒకటి.

ఎయిర్‌బస్ ఏ380 యొక్క టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులోని పైలట్ కోసం పేపర్ డాక్యుమెంట్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ లైబ్రరీ ఇవ్వబడింది. కావున దీని పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో లేటెస్ట్ వింగ్ మరియు ల్యాండింగ్ గేర్ డిజైన్ ఇవ్వబడింది, కావున ఇది ఇతర పెద్ద విమానాలకంటే కూడా ఎక్కువ శబ్దం చేస్తుంది.

సాధారణంగా ప్రపంచంలోని అత్యంత పెద్ద విమానాల్లో ఒకటైన 'ఎయిర్‌బస్ ఏ380' విమానంలో ఒకేసారి 500 మంది ప్రయాణికుల సులభంగా ప్రయాణించవచ్చు. కావున ఎక్కువమంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. లోపల కూడా చాలా వరకు లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఆధునిక సదుపాయాలను కూడా అందించారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, కావున చాలామంది లగ్జరీ జీవితాలను గడపటానికి ఇష్టపడతారు. అలంటి వారు లగ్జరీ కార్లు మరియు లగ్జరీ బైకులను మాత్రమే కాకుండా లగ్జరీ విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కావున అలంటి వారి కోసం ఇలాంటి ఆధునిక విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలాంటి విమానాలు దేశంలో అన్ని నగరాల్లోనూ అందుబాటులో లేదు. ఈ సదుపాయం కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది, ఈ జాబితాలో బెంగళూరు నగరం ఉండటం విశేషం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








