ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ట్రక్‌ను కొనుగోలు చేసిన మలేషియా సుల్తాన్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మ్యాక్ ట్రక్‌ను కొనుగో చేయాలని మలేషియా సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ జోహార్ ఆ దేశ అధికారులకు ఆజ్ఞాపించాడు.
ఈ విలాసవంతమైన మరియు అన్ని సౌకర్యాలు గల ట్రక్ ను ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ట్రక్ కూడా ఇదే. ఈ ట్రక్‌కు సంభందించిన ఆసక్తికరమైన సమాచారం కోసం క్రింది స్లయిడర్లో చూడవచ్చు.

మ్యాక్ ట్రక్
అమెరికాకు చెందిన ట్రక్ మరియు బస్సులను తయారుచేసే సంస్థ, చూడటానికి ఎంతో సాంప్రదాయంగా కనబడే ఈ ట్రక్‌ను తయారు చేసింది. మ్యాక్ సోదరులు ఈ సంస్థను 1900 సంవత్సరంలో నెలకొల్పారు ఇప్పుడు వోల్వో గ్రూప్ పర్యవేక్షణలో దీని కార్యకలాపాలు సాగిస్తోంది.

ఆస్ట్రేలియా ముద్ర
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగినన ఒక వేడుకలో ఈ వాహనాన్ని ప్రదర్శించారు. మలేషియా సుల్తాన్ బ్రిస్బేన్ నగర పరిశీలనకు వెళ్ళినప్పుడు ఈ మ్యాక్ ట్రక్ చూసి మనసు పారేసుకన్నాడంట అందుకే దీనిని కొనుగోలు చేయమని వారి అధికారులను ఆజ్ఞాపించాడు.

అధునాతనమైన ఫీచర్లు
ఇది పెద్ద ట్రక్ మాత్రమే కాదు ఇందులో ఉన్న ఫీచర్లు కూడా పెద్దవే. ఒక సారి చూడండి.
- లెథర్ సీట్లు
- కొత్త కొత్త పరికరాలతో ఉన్న కిచెన్
- ఫ్లాట్ స్క్రీన్ గల రెండు పెద్ద టి.వి లు ఉన్నాయి.
- దీని వెనుకవైపున అతి పెద్ద గొడుగు ఉంది దీనికి పెద్ద పెద్ద పార్టీలు జరుపుకోవచ్చు.

గోల్డెన్ టైగర్
ఇక్కడ ఉన్న పులి బొమ్మ పూర్తిగా బంగారంతో తయారు చేయబడినది. ఇది చిన్న బొమ్మ మాత్రమే కాదు. ఇది ఈ మలేషియా మహారాజు స్టేటస్ కు ఏ మాత్ర తీసిపోదు.

ఆకర్షణీయమైన రంగులో
ఇది నీలి రంగులో ఉంటుంది. మరియు వీరి జెండా రంగుల స్పూర్తితో ఇందులో నీలం, తెలుప మరియు ఎరుపు రంగులు వచ్చే విధంగా దీనిని రూపొందించారు.

భద్రత
ఈ అతి పెద్ద మ్యాక్ ట్రక్ లో భద్రత పరంగా ఆరు సిసిటివి కెమెరాలను అమర్చారు.

ఇంజన్
ఈ సూపర్ లైనర్ ట్రక్ యొక్క ఇంజన్: ఇందులో 16-లీటర్ల టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఈ ఇంజమన్‌లో 6 సిలిండర్లు కలవు.

ధర విలువ
ఇది ప్రపంచంలో ఉన్న అన్ని ట్రక్కుల్లోకెల్లా అత్యంత విలువైనది. దీని ధర సుమారుగా మిలియన్ డాలర్ల పైమాటే అని అంచనా.

ఆస్ట్రేలియా నుండి మలేషియాకు
ఈ మ్యాక్ ట్రక్ ను ఆస్ట్రేలియా నుండి మలేషియాకు షిప్‌లో తరలించారు. అయితే వచ్చే నెలకి మలేషియా మహరాజు సుల్తాన్ జోహార్ చేతికి చేరుందని అంచనా.

నెరవేరనున్న సుల్తాన్ కోరిక
ఈ మ్యాక్ ట్రక్‌ను పొందలానే సుల్తాన్ కోరిక అతి త్వరలోనే తీరనుంది. అందుకు సుల్తాన్ ఆస్ట్రేలియాలో ఈ ట్రక్‌ను వీరికి అందిస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇలాగే ఎన్నో ఆశ్చర్యకరమై విషయాలు మీ కోసం
విమానాన్ని తయారు చేసిన ఒక సాధారణ పల్లెకు చెందిన శాస్ర్తవేత్త !!
ISIS తీవ్రవాదుల నిర్మూలనకు రష్యా అధ్యక్షడు పుతిన్ పన్నిన పథకం


Click it and Unblock the Notifications








