ప్రపంచ వ్యాప్తంగా 2016 సంవత్సరానికి అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్
విమాన ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కాని కొంత మంది కేవలం విమాన ప్రయాణం ప్రమాదకరం అని భయపడి వినియోగించుకోడం మానేస్తున్నారు. ఒక రకంగా చూస్తే వీరి అనుమానం కూడా నిజమే అనిపిస్తుంది. నిగిలోకి ఎగిరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు చెప్పలేం మన సురక్షితంగా క్రిందకు దిగుతాం అని.
Also Read: భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఆజ్యంపోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విశయాలు
విమాన ప్రయాణాలు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పవచ్చు. కాని ప్రమాదాలు రేటు కూడా బాగా పెరిగాయి. అందులో ఎత్తులో వెలుతున్న విమానం ఉన్నట్లుండి కుప్పకూలడం, కనిపించకుండా పోవడం, రన్ వే లను ఢీ కొట్టడం ఇలా రకరకాల ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం మనం విని ఉంటాం.
Also Read: చెన్నైలో ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు పోర్షే కార్ల వేలం: ప్రారంభ ధర రూ. 5 లక్షలు
అందుకే ఎయిర్‌లైన్స్ రేటింగ్ సంస్థ 2016 సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ ను ప్రకటించింది. ఆ ఎయిర్ లైన్స్ గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

20. ఎయిర్ న్యూజిల్యాండ్ లిమిటెడ్
న్యూజిల్యాండ్ దేశాకి చెందిన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ న్యూజిల్యాండ్. ఇది 108 డొమెస్టిక్ విమానాలను 51 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం 16 దేశాలకు వీటి సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఇది అక్‍లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ఎయిర్ న్యూజిలాండ్ ఎయిర్ వేస్ సంస్థ టాప్-20 సేఫ్ ఎయర్‌లైన్స్ లో చోటు సంపాదించింది.

19.అలస్కా ఎయిర్‌లైన్స్
ఇది అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్, దీనిని 1932 లో మెక్ గీ ఎయిర్‌వేస్ అనే పేరుతో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది అలస్కా ఎయిర్ లైన్స్ పేరుతో వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ సంస్థ 147 విమానాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 104 గమ్యస్థానాలకు సేవలును అందిస్తోంది. సురక్షితమైన విమానయాన సేవల అందిస్తున్న వాటిలో ఇది 19 స్థానంలో నిలిచింది.

18.ఆల్ నిప్పోన్ ఎయిర్‌వేస్
ఇది జపాన్ ఆధారిత ఎయిర్ లైన్స్ సంస్థ. ఈ ఆల్ నిప్పోన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ దాదాపుగా 203 విమానాలను దేశీయంగా మరియు అంతర్జాతీయంగా దాదాపుగా 78 దేశాలకు సేవలను అందిస్తోంది. ప్రస్తుత ఇది జపాన్ లోని టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. జపాన్ కు చెందిన ఈ ఎయిర్ లైన్స్ సంస్థ 18 స్థానంలో నిలిచింది.

17. అమెరికన్ ఎయిర్‌లైన్స్
అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థను 1926 ఎప్రిల్ 15 న చికాగోలో స్థాుపించారు. దీనికున్న విమానాల పరంగా మరియు ఆదాయం పరంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థలలో స్థానం సాధించింది. ప్రస్తుతం ఈ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ దాదాపుగా 953 విమానాలను డొమెస్టి మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.

16. క్యాథి పసిఫిక్ ఎయిర్‌వేస్
ఈ ఎయిర్ వేస్‌ను సెప్టెంబర్ 24, 1946 న ఆస్ట్రేలియాకు చెందిన వారు సిడ్నిలో ప్రారంభించారు. ఆ తరువాత ఇందులో ఎక్కువగా షేర్లను కలిగి ఉన్న చైనా వ్యక్తి దీనిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది హాంక్ కాంగ్ కేంద్రగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ క్యాథి పసిఫిక్ ఎయిర్ వేస్ సంస్థ దాదాపుగా 187 విమానాలతో దాదాపుగా 177 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.

15. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్
ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సంస్థ దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దీనిని దుబాయ్ ప్రభుత్వం 1985 లో అక్టోబర్ 25 న స్థాపించింది. ఈ సంస్థ దాదాపుగా 245 విమానాలను 78 దేశాలలో 164 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.

14. ఎథిహాద్ ఎయిర్ వేస్
ఎథిహాద్ ఎయిర్ వేస్ సంస్థను 2003 లో స్థాపించారు. ఈ సంస్థ అబు దాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఎథిహాద్ ఎయిర్ వేస్ సంస్థ దాదాపుగా 119 విమానాలను 90 గమ్యస్థానాలకు నడుపుతోంది.

13. ఇవిఎ ఎయిర్
ఇవిఎ ఎయిర్ వేస్ పేరుతో 1989 లో స్థాపింపించబడిన ఈ సంస్థ ప్రస్తుతం తైవాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోండది. ఇది దాదాపుగా 63 విమానాలను కలిగి ఉంది. ఇందులో కార్గో మరియు ప్యాసింజర్ విమానాలు కలవు. ప్రస్తుతం ఇవిఎ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 74 గమ్యస్థానాలకు తమ సేవలు అందిస్తోంది.

12. ఫిన్ ఎయిర్‌వేస్
ఫిన్‌లాండ్ కేంద్రంగా కార్య కలాపాలు సాగిస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థ ఫిన్ ఎయిర్‌వేస్. దీనిని నవంబర్ 1, 1923 లో స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా అతి పురాతన ఎయిర్ లైన్స్‌లో ఐదవ స్థానంలో ఇది కలదు. ఫిన్ ఎయిర్ సంస్థలో ఫిన్‌లాండ్ ప్రభుత్వం దాదాపుగా 55.8 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 72 విమానాలను 88 గమ్యస్థానాలకు విమాన సర్వీసులను అందిస్తోంది.

11. హవాయన్ ఎయిర్ లైన్స్
ప్రస్తుతం హవాయన్ ఎయిర్ లైన్స్ గా పిలువబడే ఈ సంస్థ జనవరి 30, 1929లో ఇంటర్ ఐల్యాండ్ ఎయిర్ వేస్ గా ప్రారంభించబడింది. అమెరికా ఆధారిత ఎయిర్ వేస్ సంస్థ హవాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇది 28 గమ్యస్థానాలకు 52 విమానాల ద్వారా సేవలు అందిస్తోంది.

10.జపాన్ ఎయిర్‌లైన్స్
జపాన్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 25, 1951 న స్థాపించబడింది. నిప్పోన్ ఎయిర్ వేస్ తరువాత జపాన్ వారి రెండవ అతి పెద్ద ఎయిర్ వేస్, జపాన్ ఎయిర్‌లైన్స్. ప్రస్తుతం టోక్యో కేంద్రంగా పని చేస్తోంది. ఇది దాదాపుగా 167 విమానాలను ప్రపంచ వ్యాప్తంగా 92 గమ్యస్థానాలకు నడుపుతోంది.

09. కెఎల్‌ఎమ్
ఈ కెఎల్‌ఎమ్ ఎయిర్‌లైన్స్ నెదరాల్డ్స్ దేశానికి చెందిన సంస్థ. రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ గా పిలవబడే ఈ కెఎల్‌ఎమ్ సంస్థ ను అక్బోబర్ 7, 1919 లో ప్రారభించారు. ప్రస్తుతం ఇది 96 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ దాదాపుగా 116 విమానాల ద్వారా 138 గమ్యస్థానాలకు సర్వీసులను అందిస్తోంది.

08.లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్
యూరప్‌లో అతి పెద్ద ఎయిర్ లైన్స్ గా పేరుగాంచిన ఈ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ని 1953 స్థాపించారు. ఈ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దాదాపుగా 266 విమానాలను 220 గమ్యస్థానాలకు సర్వీసలను అందిస్తోంది.

07. స్కాండియానా ఎయిర్‌లైన్స్ సిస్టమ్
స్కాండియానా ఎయిర్‌లైన్స్ సిస్టమ్ ఆగష్ట్ 1, 1946 లో స్థాపించారు. ఇది స్వీడెన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థ. ప్రస్తుతం ఇది 139 విమానాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 104 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు.

06.సింగపూర్ ఎయిర్‌లైన్స్
ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ గా పిలవబడే ఈ సంస్థను మే 1, 1947 లో అంటే 68 సంవత్సరాల క్రితం మలాయన్ ఎయిర్‌వేస్ గా స్థాపించబడింది. క్రమేనా ఈ మలాయన్ ఎయిర్‌వేస్ కాస్త సింగపూర్ ఎయిర్‌లైన్స్‌గా రూపాంతరం చెందబడింది. సింగపూర్ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ 109 విమానాలను ప్రపంచ వ్యాప్తంగా 64 గమ్యస్థానాలకు సర్వీసును అందిస్తోంది.

05. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్
స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ 2002 లో స్థాపించబడింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును పొందిన సంస్థ ఇది. స్విట్జర్లాండ్ కేంద్రంగా ఇది కార్యకలాపాలను సాగిస్తోంది. ఇది ప్రస్తుతం 83 విమానాలతో 48 దేశాలలో ఉన్న 106 గమ్యస్థానాలకు సర్వీసులను అందిస్తోంది.

04. యునైటెడ్ ఎయిర్‌లైన్స్
ఈ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను ఎప్రిల్ 6, 1926 లో వార్నే లైన్స్‌గా స్థాపించారు. ఆ తరువాత ఇది యునైటెడ్ ఎయిర్‌లైన్స్ గా మార్పు చెందబడింది. చికాగో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నఈ సంస్థ 718 విమానాలను ప్రపంచ వ్యాప్తంగా గల 375 గమ్యస్థానాలకు సర్వీసులని అందిస్తోంది.

03. వర్జిన్ అట్లాంటిక్
వర్జిన్ అట్లాంటిక్ బ్రిటిష్‌కు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ. దీనిని జూన్ 22, 1984 లో స్థాపించారు. 40 విమానాలతో 31 గమ్యస్థానాల మధ్య సేవలు అందిస్తోంది. అతి తక్కువ విమానాలు ఉన్నప్పటికీ సురక్షితమైన సేవలు అందిస్తున్న వాటిలో ఇది ఒకటి అని ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది.

02. వర్జిన్ ఆస్ట్రేలియా
వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్ లైన్స్ సంస్థ ఆగష్టు 31, 2000 సంవత్సరం నుండి విమానయాన సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్స్ సంస్థ దాదాపుగా 110 విమానాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 50 గమ్యస్థానాలకు సేవలను అందిస్తోంది.

01. క్వాంటాస్ ఎయిర్‌లైన్స్
క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 16, 1920 స్థాపించబడింది. ప్రపంచ వ్యాప్తంగా పురాతన ఎయిర్‌లైన్స్‌లో మూడవ స్థానంలో ఉంది ఈ క్వాంటాస్. ఆస్ట్రేలియాకు చెందిన దీనిని ఫ్లైయింగ్ కంగారూ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది 131 విమానాలతో ప్రపంచ వ్యాప్తంగా 85 ప్రదేశాలకు సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








