ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న కారు వేలం పాటలో 11751595 లకు అమ్ముడుపోయింది.
జనరల్ నాలెడ్జ్ గురించి చదివేటప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పొడవైన, పొట్టిగా ఉన్న, విశాలమైన, అతి పెద్ద వంటి వాటితో చాలా విశాలే తెలుసుకుని ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న కారు గురించి ఎక్కడైనా విన్నారా ? అయితే ఈ కథనం మొత్తం చదవండి మీకే తెలుస్తుంది. ఇంత చిన్న కారు ధర ఎంతో తెలుసా ? ఏకంగా 176,000 అమెరికన్ డాలర్లుగా ఉంది. మన భారతీయ రుపాయల్లో అయితే దీని విలువ సుమారుగా 11751595 లుగా ఉంది.
ఇంత ఖరీదైనా ఈ బుల్లి కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రండి.

అమేలియా ఐలాండ్‌లో ఆర్ఎమ్ సోథ్‌బేస్ వారు నిర్వహించిన 1964 కు చెందిన అతి చిన్న పీల్ పి50 అనే కారు 176,000 అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

ఈ పీల్ పి50 కారు ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న కారుగా గిన్నిస్ రికార్డ్‌లు కూడా ఎక్కింది.

ఈ పీల్ పి50 కారులో 49సీసీ కెపాసిటి గల ఫ్యాన్ గాలితో చల్లబడే పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇది విడుదల చేయు 4 హార్స్‌పవర్ 3-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రానికి అందుతుంది.

దీని గరిష్ట వేగం ఎంతో తెలుసా ? గంటకు 61 కిలోమీటర్లు ఒక్కో సారి ఇది డ్రైవర్ యొక్క బరువు మీద ఆదారపడి ఉంటుంది.

దీని బాడీ మొత్తం తక్కువ బరువు వచ్చే విదంగా ఫైబర్ గ్లాస్ ద్వారా రూపొందించారు. ఒక్కరికే ఎంట్రీ ఉన్న ఇందులో అతి పెద్ద స్టీరింగ్ వీల్ మరియు పెడల్స్ కలవు.

ముందు వైపు చక్రం ప్రక్కవైపులగా ఇంజన్‌ను అమర్చారు మరియు వెనుక వైపున చక్రాలకు స్టీరింగ్ వీల్‌ను అమర్చి ఉంటారు తద్వారా కారు యొక్క దిశను నియంత్రించవచ్చు.

ముందు వైపు అతి పెద్ద సింగిల్ హెడ్ లైట్ మరియు, దీనికి ఇరువైపులా రెండు టర్న్ లైట్లను గమనించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న కారుగా రికార్డు సాధించాడానికి ముఖ్య కారణం దీని కొలతలు. పీల్ పి50 కారు పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 137 , 99.06 మరియు 127 సెంటీమీటర్లు దీని బరువు 56 కిలోలుగా ఉంది.

ఈ పీల్ పి50 అనే ప్రపంచ వ్యాప్తపు అతి చిన్న కార్లను 1963 మరియు 1964 మధ్యలో దాదాపుగా 47 వరకు తయారు చేసినట్లు తెలిసింది.

అప్పట్లో ఈ పీల్ పి50 కార్ల ధరలు ఎంత ఉండేవో తెలుసా ? ఒక్క పీల్ పి50 ధర 199 యూరోలుగా ఉండేది.

- వామ్మో ఇంత పెద్ద ట్రక్కా..?
- బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
- చూడ్డానికి తమాషాగానే ఉంటాయి చదవి చూడండి ఎంత అర్థవంతంగా ఉంటాయో


Click it and Unblock the Notifications








