వండర్ ప్రపంచంలోనే పొట్టి ఇండికా కారు.. ఎలా తయారు చేశారో తెలుసా..?
క్రియేటివిటినీ కనబర్చడం, సృష్టించడంలో మన భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక రంగంలో అసాధారణమైన సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆశ్చర్యానికి గురిచేయడం మనోళ్లోకి కొట్టిన పిండి. బేసిక్ గా కారు అంటే సులభంగా నలుగురు ప్రయాణించేలా ఉంటుంది. కానీ ఓ కారును ఊహించని విధంగా కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొని ప్రయాణించేలా తయారు చేసి వాహ్ వా అని పించేలా తయారు చేశారు.
టాటా ఇండికా V2 హ్యాచ్ బ్యాక్ కారుకు భారతదేశంలో చాలా క్రేజ్ ఉంది. దీనిని సామాన్యుడి కారుగా కూడా పిలుస్తారు. మంచి ఇంజన్ తో పాటు మైలేజ్, చిన్న చిన్న రోడ్లు కలిగిన గ్రామాలకు సైతం ఈ కారుపై అలవోకగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కూర్చొని వెళ్లేలా తయారు చేసిన ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వసీం క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంతకీ ఆ కారులో ఉన్నస్పెషాలిటీ ఏంటంటే..

వీళ్ల ఆలోచనకు సలాం..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ కారును తయారు చేశారు. దాని తయారు చేసిన విధానం అందుబాటులో లేకపోయినప్పటికి ప్రపంచంలోనే అతిచిన్న కారుగా మార్చిన అనంతరం చూపించిన వీడియో హల్ చల్ చేస్తుంది. ఈ కారు పొడవు కేవలం 8 ఫీట్ల మాత్రమే సాధారణ కారు కంటే 3.5 ఫీట్లు ఈ కారు తక్కువగా ఉంటుంది.
పూర్తిగా తొలగించిన వెనక డోర్..
ఈ కారులో వెనుక డోర్ ను పూర్తిగా తొలగించారు. వెనుక భాగంలోనీ కారు పిల్లర్ కు వెల్డింగ్ చేసి చిన్నదిగా చేశారు. దీంతో కారు పొడవును తగ్గించారు. కస్టమర్ డిమాండ్ కు అనుగుణంగా కారు బానెట్ ను రూపొందించారు. కారును చిన్నగా చేసేందుకు ఇంజన్ లో ఎలాంటి మార్పులు లేకుండా దీనిని తయారు చేశారు.

కారు వెనక భాగాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అదే విధంగా కారు పై భాగంలో కస్టమ్ ఫాబ్రికేటెడ్ రియర్ స్పాయిలర్, రూఫ్ రెయిల్ లు అమర్చారు. అధునాతన కారుగా కనబడేందుకు వీటిని అమర్చారని చెప్పవచ్చు. పూర్తి కారు తయారు చేసిన అనంతరం దానికి డెంటిగ్ తో పాటు వివిధ రకాల రంగులు అద్ది అద్దంలా మెరిసేలా తయారు చేశారు.

డ్యూయల్ టోన్ కలర్ లో కారు పెయింట్ చేయబడింది. సిల్వర్ కలర్ తో పాటు కింది భాగంలో మాట్ బ్లాక్ లో పెయింట్ చేసి రెడీ చేశారు. పూర్తిగా పెయింట్ చేయబడిన అనంతరం దీనిని పూర్తి అసెంబుల్ చేయబడిన కారుగా చూడవచ్చు. రెండు హెడ్ లైట్లు సరికొత్త గా అమర్చారు.

మెచ్చుకోక తప్పదు..
చివరగా కారు రెడీ అయ్యాక దీనిని రోడ్డుపై తిప్పుతూ యూట్యూబర్ వివరిస్తాడు. మొత్తానికి ఈ సరికొత్త కారు జనాలను ఆకట్టుకుంటుదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియోను చూశాక కారు తయారీదారు క్రియేటివిటి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ లో ఇలాంటి కార్లు మరిన్నీ చూడవచ్చని యూట్యూబర్ తెలియజేశారు.
ఈ చిన్న కారు బాగానే ఉన్నా అనుమతులు జారీ అవ్వడం ఆశ్చర్యమే. ఏదో పరిపాటిగా దీనిని వాడుకోవడం తప్పా పూర్తి స్థాయిలో రోడ్డుపై ఉపయోగించడం కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా చేయడమే కాకుండా ప్రపంచంలోనే అతి చిన్న కారుగా రికార్డు నెలకొల్పిన వారిని అభినందించాల్సిందే. ఇంతకు మీకు ఈ కారు నచ్చిందా? నిజంగా కారు బాగున్నట్లైతే కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications








