ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమమైన పది అంతర్జాతీయ విమానాశ్రయాలు
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సౌకర్యాల రూపకల్పన విమానాలకే పరిమితం కాలేదు. విమానాలు దిగే విమానాశ్రయాలలో కూడా ఉన్నాయి. కొన్ని గంటలు పాటు ప్రయాణించి అలసిపోయి విమానం నుండి దిగిన వారికి విమానాశ్రయం ఎడారిలా కాకుండా అదో స్వర్గంలా ఉండాలి. అందుకోసం వారికి కావాల్సిన సకల సౌకర్యాలు ఉండాలి.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ అన్నింటిలో కూడా అత్భుతమైన సౌకర్యాలు ఉండవు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 130 లక్షల మంది విమాన ప్రయాణికుల ద్వారా ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల పరంగా నిర్వహించిన సర్వే ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పది ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నట్లు స్కైట్రాక్స్ అనే సంస్థ వెల్లడించింది. టాప్-10 ఉత్తమ విమానాశ్రయాలు క్రింది కథనంలో ఇవ్వబడ్డాయి.

సింగపూర్- షాంఘై
ప్రపంచ వ్యాప్తంగా వసతుల కల్పనలో బాగా పేరుగాంచిన విమానాశ్రయం ఇది. ఇందులో మూడు అతి పెద్ద టెర్మినల్స్ కలవు. ప్రతి ఏడాది కూడా దాదాపుగా 660 లక్షల మంది విమాన ప్రయాణికులు ఈ విమానాశ్రయం కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలవడం ఇది నాలుగవ సారి.

వినోద సౌకర్యాలు
సౌకర్యాల కల్పన పరంగా షాంఘై విమానాశ్రయం ప్రయాణికుల మనస్సు దోచుకుందని చెప్పవచ్చు. మొదటి టెర్మినల్‌లో వ్యాయామ శాల, స్మిమ్మింగ్ పూల్ మరియు హోటల్స్ అదేవిధంగా రెండవ టెర్మినల్‌లో సినిమాహాలు మరియు పార్కు కలవు. అన్నింటి కన్నా ప్రయాణికులు స్విమ్మింగ్ పూల్‌కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఇంచియోన్- దక్షిణ కొరియా
వసతుల కల్పన పరంగా ప్రయాణికుల ఇచ్చిన సమాధానం ప్రకారం దక్షిణ కొరియాలోని ఇంచియోన్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా అంతర్జాతీయంగా అత్యంత రద్దీతో కూడుకున్నటాప్-10 వాటిలో కూడా ఈ ఎయిర్ పోర్ట్ స్థానం సంపాదించుకుంది.

మనిచ్- జర్మనీ
టాప్-10 జాబితాలో మూడవ స్థానంలో ఉన్న ఈ మనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం జర్మనీలో కలదు. 1992 మే 17 న ఈ ఎయిర్ పోర్ట్ సేవలు ప్రారంభించింది. గత ఏడాదిలో ఈ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా 40,981,522 మంది ప్రయాణికుల ప్రయాణించారు. ఇది దాదాపుగా 3,900 ఎకరాల విస్తీర్ణంలో కలదు.

టోక్యో విమానాశ్రయం- జపాన్
టోక్యో లేదా హెనెడా విమానాశ్రయంగా పిలువబడే ఇది ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ స్థానంలో స్థానం సంపాదించుకుంది. ఈ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం 2014 ఏడాదిలో దాదాపుగా 72,826,862 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసియాలో మూడవ మరియు ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ అతి పెద్ద రద్దీ గల విమానాశ్రంగా ఇది పేరుగాంచింది

హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఇది 1998 జూలై 6 నుండి సేవలందిస్తోంది. ఇందులో 3,800 మీటర్లు పొడవు గల రెండు రన్‌వే లు కలవు. ఈ ఎయిర్ పోర్ట్ గుండా గత ఏడాదిలో దాదాపుగా 68,488,000 మంది ప్రయాణం చేస్తున్నారు.

నగోయా చుబు సెంట్రాయర్- జపాన్
ఆరవ స్థానంలో ఉన్న ఈ నగోయా విమానాశ్రయం జపాన్ మధ్య భూబాగంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండ రైలు, బస్సు మరియు బోటు వంటి రవాణా సాధనాలను అందించారు. ఇందులో చక్కటి ఫీచర్లు అందించారు. ఎయిర్ పోర్ట్‌లోని మూడవ భవంతిలో ప్రయాణికుల కోసం మరియు ప్రాంతీయ ప్రజలకు పన్ను రహిత సరుకులు లభిస్తాయి.

జురిచ్ -స్విట్జర్లాండ్
ప్రతి ఏడాది కూడా ఈ విమానాశ్రయం ఎమిదివ స్థానంలో ఉండేది. అయితే ఈ ఏడాది ఇది ఏడవ స్థానంలో ఉంది. ఈ ఎయిర్ పోర్ట్ లోపల టోమేటిక్ మెట్రో సిస్టమ్ కలదు. ఇది అధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా స్విట్జర్లాండ్ పర్యాటక ప్రాంతం కావడం ఈ ఎయిర్‌పోర్ట్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది.

హిత్రోయ్ విమానాశ్రయం- లండన్
హిత్రోయ్ విమానాశ్రయం గత ఏడాది ఇదే జాబితాలో 10 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఎనిమిదవ స్థానానికి పురోగమించింది. ఈ విమానాశ్రయానికి ఏడాదికి దాదాపుగా 694 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంది. ఇందులో ఐదు టెర్మినళ్లు కలవు మరియు దీనికి భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ కూడా కలదు.

కన్సాయ్- జపాన్
టాప్-10 బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా మొత్తం మూడు జపాన్ విమానాశ్రయాలు చోటు దక్కించుకున్నాయి. కన్సాయ్ ఎయిర్ పర్ట్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఈ విమానాశ్రయాన్ని 1994లో ప్రారంభించారు.

హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం- దోహా
ఖతార్ రాజదాని దోహాలో గల హమద్ ఎయిర్ పోర్ట్ టాప్-10 జాబితాలో 10 వ స్థానంలో నిలిచింది. ఇది 2014 లో ప్రారంభం అయ్యింది. అతి తక్కువ కాలంలోనే టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇందులో రెండు కిలోమీటర్లు పొడవున్న రెండు రన్‌వేలు కలవు. ఇది ఏడాదికి 29 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అంతే కాకుండా ప్రయాణికులకు విలాసవంతమైన వసతులు కల్పిస్తోంది.

- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
- ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం
- వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!


Click it and Unblock the Notifications








