అనర్హతతో ఒలంపిక్ పతకం కోల్పోయిన వినేష్ ఫోగట్ దగ్గర అన్ని కార్లు ఉన్నాయా?
ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచే అవకాశాన్ని రెజ్లర్ వినేష్ ఫోగట్ (Wrestler Vinesh Phogat) చివరి క్షణంలో కోల్పోయింది. ఆమె 100 గ్రాములు అధిక బరువుతో పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో యావత్ భారతావని తీవ్ర భంగపాటుకి గురైంది. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆమె అనర్హతపై మాట్లాడుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్త ఆమె ఉత్తమ ప్రదర్శనపై గర్విస్తోందని రాసుకొస్తున్నారు.
భారతదేశం నుంచి చాలా మంది అథ్లెట్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. వారిలో రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు. ఈమె రెజ్లింగ్‌లో పోటీలలో ఉత్తమ ప్రదర్శనను కనబర్చింది. తన మార్ప్ ఫైట్‌తో సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో కచ్చితంగా గోల్డ్ మెడల్‌తో తిరిగొస్తుందున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

ఫైనల్స్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఇది భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన నిబంధనలు, అవకాశాల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. రూల్స్ ప్రకారం ఆమె అనర్హత సాధించినట్లు ఒలంపిక్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై యావత్ భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
దీనిపై ఇప్పటికే వినేష్ ఫోగట్ అప్పీల్ చేసింది. ఈ సందర్భంలో వినేష్ భోగట్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీని గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంలో మనం కూడా ఆమెకు సంబంధించిన కారు వివరాలను మనం ఇక్కడ చూడబోతున్నాం.

వినేష్ ఫోగట్ చాలా ఏళ్లుగా భారత్ తరఫున రెజ్లర్‌గా పలు పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల్లో ఆమె పతకాలు కూడా సాధించింది. అయితే ఆమెకు కార్లంటే ఇష్టం అని తెలిసింది. తన గ్యారేజీలో ఆమె వివిధ కార్లను కలిగి ఉంది. ఆమె కార్ల వివరాలు ఈ కథనంలో..
ఆమె వద్ద టయోటా ఫార్చ్యూనర్ కారు ఉంది. భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ కార్లలో ఇది ఒకటిగా ఉంది. ఈ కారు భారతదేశంలోని బిజినెస్‌మ్యాన్స్, ఇతర సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు ఎక్కువగా వీటిని వినియోగిస్తారు. ఈ కారు కలిగిన రాజకీయ నాయకులకే అత్యంత కీలకమైన పదవులు దక్కుతాయనే టాక్ కూడా కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే చూడటానికి ఇది భారీ ఆకారంలో ఉంటుంది.

భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్ ధర రూ. 33.43 లక్షల నుంచి రూ. 51.44 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ధర వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు స్టాండర్డ్ మరియు GR-S అనే రెండు విభిన్న వేరియంట్స్‌లో అందించబడుతుంది. దీని నిర్వహణ వ్యయం కూడా కాస్త ఎక్కువే అని చెప్పాలి. అందువల్ల కాస్త సంపనుల్లు మాత్రమే ఈ కార్లను కొనుగోలు చేస్తారు.
తర్వాత ఫోగట్ వద్ద టయోటా ఇన్నోవా కారు ఉంది. సాధారణంగా ఈ కారును విమానాశ్రయాలకు వెళ్లడం మరియు ఇంటికి తిరిగి రావడం ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఉపయోగిస్తారని తెలిసింది. ఇది ఎక్కువ స్పేస్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇందులో భారీగా వస్తువులను తీసుకువెళ్లగలదు. ప్రధానంగా అథ్లెట్లు ఎక్కువ వస్తువులను తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్లు వారికి ఉపయోగకరంగా ఉంటాయి.
అందుకే వినేష్ ఫోగట్ ఈ కారును ఉపయోగిస్తున్నారని తెలిసింది. చాలా మంది ప్రజలు ఈ కారును ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా లగేజీని తీసుకువెళ్లడమే కాకుండా ఎక్కువ మందిని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది. మార్కెట్‌లోనూ వీటి వినియోగం ఎక్కువే అని చెప్పాలి. ఇన్నోవా లగ్జరీ ఫీచర్లతో అందుబాటులో ఉండటంతో వీటిని కొనేందుకు ప్రజలకు ఆసక్తి చూపిస్తారు.
ఆ తర్వాత ఆమె Mercedes-Benz GLE SUVని కలిగి ఉంది. ఇది వినేష్ ఫోగట్‌కి ఇష్టమైన కారు అని తెలిసింది. ఈ కారును భారత మార్కెట్లో రూ.1.15 కోట్ల ధర వద్ద విక్రయిస్తున్నారు. ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఈ కారును ఉపయోగిస్తుంది. ఆమె ప్రధానంగా పండుగలు మరియు అవార్డు వేడుకలు వంటి కార్యక్రమాలకు ఈ కారులో హాజరవుతుంది. ఇది భారీ టెక్నికల్ ఫీచర్లతో పాటు లగ్జరీ సౌకర్యాలతో లోడ్ చేయబడింది.


Click it and Unblock the Notifications








