Car Lifting రోడ్డుకు అడ్డంగా కారు పార్కింగ్.. ఎత్తి పక్కన బెట్టిన వ్యక్తి 'వీడియో వైరల్'
ప్రస్తుతం ఏదైనా వింత సంఘటన జరిగినప్పుడు క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు చూడని సంఘటనలు, క్రేజీ విషయాలను ఇట్టే తెలుసుకుంటున్నాం. రోడ్లపై కొందరు చేసే సాహసాలు ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓవ్యక్తి చేసిన పని చూస్తే విపరీతంగా నవ్వుతారు.
భారతదేశంలో చాలా వరకు మన రోడ్లు ఇరుకుగా ఉంటాయి. చిన్న చిన్న గల్లీల్లో కారు లేదా ఇతర ఏదైనా వాహనానాలపై తిరగాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి. దేశంలో పేరొందిన పట్టణాల్లో తీవ్రమైన పార్కింగ్ కొరత ఉంది. కొందరు డబ్బులు చెల్లించి పార్కింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండరు. దీంతో ఇతరులు అసౌకర్యానికి గురవుతారు. ఈ సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

నడిరోడ్డుపై పార్కింగ్..
దేశంలో కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కారు సరిగ్గా నడపే వారు కూడా తొందరలో ఇష్టం వచ్చినట్లు పార్క్ చేసి వెళ్లిపోతారు. మరికొంత మంది తమ వాహనాలను నిర్ణీత స్థలంలో పార్కింగ్ చేయకుండా రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో పలుమార్లు పాదచారులు, ఇతర ద్విచక్ర వాహనాలు, కార్ల డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు వైరల్‌గా మారిన ఓ వీడియో అలాంటి సంఘటనకు సంబంధించినదే.
అది ఒక ఇరుకైన రోడ్డు. ఇదే దారిలో ఒక వ్యక్తి టాటా హ్యారియర్ నడుపుపుకుంటు వస్తున్నాడు. అయితే ఎదురుగా రోడ్డుపై మారుతి సుజుకి వ్యాగన్ఆర్ నడిరోడ్డుపై పార్క్ చేసి ఉంది. అది గమనించిన హ్యారియర్ డ్రైవర్ అసహనానికి గురయ్యాడు. వెంటనే పార్క్ కారు దిగి అతని చేసిన చర్య ఆశ్చర్యం వేస్తుంది. చాలా అలవోకగా కారును ఎత్తిన తీరు వీడియోలో చూడవచ్చు.
'బలభీమ'
వెంటనే దానిని లోపలికి జరిపి రహదారి క్లియర్ చేసిన తరువాత, అతను మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. హారియర్ కారులో ఉన్న తోటి ప్రయాణీకులే ఈ వీడియోను పూర్తిగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్ క్రియేట్ చేస్తున్న 'బలభీమ' వీడియోపై నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'నిన్న నేను యాక్టివా స్కూటర్‌తో ఈ స్టంట్ చేశాను' అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.
అయితే కొందరు టాటా హారియర్ యజమానితో పోలిస్తే, 'మారుతి కారు నిర్మాణ నాణ్యత తక్కువగా ఉందని.. మరొకరు 'పంజాబీ పవర్' అని ప్రశంసలు గుప్పించారు. 'మా పూణేలో కూడా ఇలాంటి శక్తి ఉన్న వ్యక్తి కావాలి' అని మరొకరు వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న ఈ వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే 322,061 లైక్‌లను సాధించింది.
ట్రాఫిక్ నియమాలు పాటించండి..
ఈ ఘటన ఏ రాష్ట్రంలో జరిగిందన్న దానిపై వీడియోలో ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు.. అయితే, కారును పైకి ఎత్తిన వ్యక్తిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇంకెవరైనా ఉంటే వాహనాన్ని రివర్స్ చేసి వెనక్కి వెళ్లిపోయేవారు అయితే లేకుంటే పార్క్ చేసిన కారు యజమానితో లేదా పార్కింగ్ మెయింటెనెన్స్ సిబ్బందితో గొడవకు దిగేవాడు. వాగన్ఆర్ కారును పక్కకు తరలించి తనంతట తానుగా వెళ్లిపోయాడు సిక్కు డ్రైవర్ కి నెటిజన్లు నీరాజనం పాడుతున్నారు.
మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, అస్తవ్యస్తంగా పార్క్ చేసిన కారును ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసులకు షేర్ చేయండి. దీంతో వారు సంబంధిత కారు యజమానికి నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. అప్పడు మీ సమస్యతో పాటు ఇతర వ్యక్తుల సమస్యలను కూడా పరిష్కరించిన వారిగా నిలుస్తారు.
దేశంలోని పలు నగరాల్లోని రహదారులపై తక్కువ మొత్తంలో స్థలం ఉంది. ఇలా పార్కింగ్ చేసి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించే సంఘటనలు రోజు చూస్తూనే ఉంటాం. వీడియోలోని రోడ్డు ప్రధాన రహదారి లేకపోవడం మనం గమనించవచ్చు. మెయిన్ రోడ్డులో ఇలాంటి సంఘటనలు జరిగితే అత్యవసర వాహనాలు చిక్కులు ఎదుర్కునే పరిస్థితి వస్తుంది. సాధారణంగా నిర్ణీత ప్రదేశంలో పార్కింగ్ చేయడం మంచి డ్రైవర్ లక్షణంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమించకుండా ట్రాఫిక్ నియమాలు పాటించండి.


Click it and Unblock the Notifications








