ఎక్స్‌ప్లోర్ఎయిర్ పారావెలో ఫ్లయింగ్ బైస్కిల్
ఇటీవలే మనం ఎగిరే సైకిల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అలాంటిదే మరొక ఎగిరే సైకిల్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దీని 'ఎక్స్‌ప్లోర్ఎయిర్ పారావెలో'. ఇది మామూలు సైకిల్ మాదిరిగానే ఉండి, సైకిల్‌కు వెనుక వైపున రెండు చక్రాలు కలిగిన ట్రాలీని అమర్చబడి ఉంటుంది. ఈ ట్రాలీకి ఓ పెద్ద ఫ్యాన్ జతచేయబడి ఉంటుంది.
సాధారణంగా దీనిని మామూలు సైకిల్ మాదిరిగా రోడ్డుపై తొక్కుకుంటూ వెళ్లవచ్చు. రోడ్డుపై ఎదైనా అవాంతరం ఎదురైతే, వెనుక వైపు ట్రాలీకు జతచేయబడి ఉండే బ్యాగులో ఉండే ప్యారాగ్లైడర్‌ని ట్రాలీకి లింక్ చేసి, ఫ్యాన్‌ను ఆన్ చేసుకొని గాలిలో ఎగిరిపోవచ్చు. గాలిలోకి సులువుగా ఎగిరేందుకు గాను దీనిని లైట్‌వెయిట్ మెటీరియల్‌తో తయారు చేశారు.
ఒక్కసారి గాలిలోకి ఎగిరిన తర్వాత ఈ ఫ్యాన్ సాయంతో గంటకు 40 కి.మీ. వేగంతో ముందుకు సాగిపోవచ్చు. భూమి నుంచి 4000 అడుగులో ఎత్తు వరకూ ఈ ప్యారావెలో సాయంతో గాలిలో ప్రయాణించవ్చచు. గాలిలో 3 గంటల వరకూ పనిచేస్తుంది. ఈ మొత్తం సెటప్‌ను విడగొట్టి ఇంటిలో భద్రపరచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఫండింగ్ చేసే వారి కోసం దీని రూపకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇది ప్రొడక్షన్ దశకు చేరుకుంటే అడ్వెంచర్, ఎక్స్‌ప్లోరర్ కమ్యూనిటీలో ఇది అత్యంత పాపులర్ కావటం విశేషం.
మరి ఈ ఫ్లయింగ్ ప్యారావెలోను మనం కూడా చూసేద్దామా.. (చివరి స్లైడ్‌లో వీడియోని తిలకించవచ్చు).










Click it and Unblock the Notifications








