Live Video యమహా బైక్‌పై స్టంట్స్.. ఆ క్షణంలో బ్రేకులు వేసినా ఫలితం లేకపోయింది..!!
జాతీయ రహదారులపై బైక్ రైడర్లు కొన్నిసార్లు ఎటువంటి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా ప్రయాణం చేస్తుంటారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడతారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రమాదాలకు కారణాలను తెలుసుకొనేందుకు పోలీసులు సహా ఇతర శాఖల అధికారులు రోడ్లపై సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు.
దాంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను కూడా పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు జరిమానా విధిస్తారు. అయినా కానీ కొందరు వాహనదారులు రూల్స్‌ను గాలికొదిలేస్తారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ముందు వెళ్తున్న మహీంద్రా బొలెరో పికప్ ట్రక్‌ను ఢీకొట్టారు.

ఈ వీడియో ఓ వ్లాగర్ హెల్మెట్ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను ప్రతీక్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. ఈ ఘటన ఎక్కుడ జరిగిందనే సమాచారం లేదు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి తొలుత ఈ వీడియోను షేర్ చేశారు.
యమహా MT 15 బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఎవరు కూడా హెల్మెట్ ధరించలేదు. అయితే కొంత దూరం నెమ్మదిగా డ్రైవింగ్ చేసిన యమహా బైక్ డ్రైవర్.. తర్వాత వేగంగా ఇష్టానుసారం బైక్ నడపడం వీడియోలో గమనించవచ్చు. ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం కూడా వీడియోలో గమనించవచ్చు. అలా కొంత దూరం చాలా విన్యాసాలు చేసుకుంటూ డ్రైవింగ్ చేశారు.

ఓ ప్రాంతానికి వచ్చేసరికి ట్రాఫిక్ కారణంగా రోడ్లపైనున్న వాహనాలు అన్నీ నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాయి. వ్లాగర్ బైక్‌ను ఓవర్‌టేక్ చేసిన యమహా బైక్ రైడర్.. ముందున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని కూడా ఓవర్‌టేక్ చేయాలని ప్రయత్నించాడు. అంతలోగా మహీంద్రా బొలెరో వాహనం వేగం తగ్గించుకుంది.
యమహా బైక్ డ్రైవర్ దానిని సరిగా గుర్తించలేదు. ఆఖరి నిమిషంలో గుర్తించి బ్రేకులు వేశాడు. అయినా ఫలితం లేకపోయింది. బైక్ నేరుగా వెళ్లి మహీంద్రా వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. యమహా MT 15 బైక్ ABS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల అకస్మాత్తుగా బ్రేకులు వేసిన బైక్ స్కిడ్ కాలేదు.
కానీ బైక్ రైడర్ మహీంద్రా బొలెరో వాహనం వెనుక ఉన్న మెటల్ డోర్‌కు ఢీకొట్టాడు. అదే బైక్ మీద ఉన్న అతని ఫ్రెండ్స్ కూడా ఎరిగి పడ్డారు. అయితే వీరికి ఎలాంటి గాయాలు అయ్యాయనే సమాచారం తెలియలేదు. యమహా బైక్ వెనుక ఎటువంటి వాహనాలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. లేకుంటే భారీగా గాయపడే అవకాశం ఉండేది.
రోడ్లపై ఎలా ప్రవర్తించకూడదు అనే విషయానికి ఈ ఘటన సరైన ఉదాహరణ. బైక్‌లు కేవలం ఇద్దరు ప్రయాణించేందుకు మాత్రమే ఉపయోగించాలి. మరియు సరైన భద్రతా నిబంధనలు పాటించాలి. అంటే హెల్మెట్ ధరించడం, తక్కువ వేగంతో డ్రైవింగ్ చేయాలి. అయితే ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లిందా. జరిమానాలు విధించారా లేదా అనే సమాచారం లేదు.
సాధారణంగా అధిక శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం, అధిక వేగంతో ప్రయాణం చేయడం కారణంగా జరుగుతుంటాయి. అయితే కొన్ని ఘటనల్లో చిన్న చిన్న గాయాలపై బయటపడినా.. మరికొన్ని చోట్ల తీవ్రంగా గాయపడడం సహా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల‌్మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








