యమహా 'ఆహ్ ఏ మే' ప్రాజెక్ట్.. అసలేంటీ ప్రాజెక్ట్..?
సంగీత పరికరాలు తయారు చేసే కంపెనీ మోటార్‌సైకిళ్లు డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది..? పోనీ మోటార్‌సైకిళ్లు తయారు చేసే కంపెనీ సంగీత పరికరాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా..! అలాంటి ఓ వినూత్న ప్రాజెక్టును జపనీస్ కంపెనీ యమహా చేపట్టింది.
యమహా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు అనేక వ్యాపారాలున్నాయి. ఈ వ్యాపారాల్లో మోటార్‌సైకిల్స్, మ్యూజికల్ ఎక్విప్‌మెంట్స్ తయారీ కూడా ఓ భాగం. యమహా బుర్రలో ఓ విచిత్ర ఆలోచన పుట్టింది. అదే క్రాస్ డిజైనింగ్ కాన్సెప్ట్. ఈ ప్రాజెక్టుకు యమహ 'ఆహ్ ఏ మే' (AH A MAY) అనే పేరును పెట్టింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా.. యమహా మ్యూజికల్ ఎక్విప్‌మెంట్ డిజైన్ డివిజన్ ఓ మోటార్‌సైకిల్ మరియు ఎలక్ట్రిక్ సైకిల్‌ను డిజైన్ చేయగా, యమహా మోటార్ విభాగం డ్రమ్స్ కిట్ మరియు మరింబా కిట్‌ను డిజైన్ చేసింది. మరి ఈ క్రాస్ డిజైనింగ్ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..!

తర్వాతి స్లైడ్‌లలో యమహా ఆహ్ ఏ మే ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి.

మోటార్‌సైకిల్
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్యూచరిస్టిక్ మోటార్‌సైకిల్‌ను 'రూట్' [√ (Root)] నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. దీని సీట్‌ను గుర్రపు రూపచిత్రం నుంచి స్ఫూర్తి పొంది సీట్ నుంచి ఫ్యూయెల్ ట్యాంక్ వరకూ ఫ్లోటింగ్‌లో డిజైన్ చేశారు.

ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ సైకిల్
ఈ ఫొటోలో కనిపిస్తున్న సైకిల్‌ను '0±0' (Zero plus or minus Zero) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇదొక ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెట్ సైకిల్. ఈ స్టాండ్‌లో ఉంచి సైకిల్‌ను పెడలింగ్ చేసినట్లయితే, విద్యుత్తు ఉత్పత్తి బ్యాటరీలు చార్జ్ అవుతాయి. ఈ బ్యాటరీ పవర్‌ను ఇంటి అవసరానికి లేదా సంగీత పరికరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

డ్రమ్స్
ఈ డ్రమ్స్ కిట్‌ను రైజిన్ (గాడ్ ఆఫ్ థండర్) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఈ డ్రమ్ సెట్ గోళాకారంలో గ్లోబ్ మాదిరిగా ఉంటుంది.

మారింబా
ఈ మారింబా సెట్‌ను ఫుజిన్ (గాడ్ ఆఫ్ ది విండ్) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. ఇది వృత్తాకారంలో ఉంటుంది. దీని మధ్యలో ఉండే సీటు మోటార్‌సైకిళ్లకు ఉపయోగించే టూ-సీట్ మాదిరిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








