ఇండికేటర్‌ వినియోగించకుండా రోడ్డు క్రాసింగ్ చేస్తున్నారా.. ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు..!

గతంలో పోలిస్తే మెట్రో నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు చాలా వరకు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో చాలా ప్రదేశాల్లో హైవేలు, ఫ్లైఓవర్‌లు సహా ఇతర వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. అయితే రోడ్ల భద్రతా నిబంధనల అమలు విషయంలో ఇతర దేశాల కంటే మనం చాలా వెనుకబడ్డాం.

రోడ్లపైన నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, అనుమతి ఇచ్చిన దాని కంటే వేగంగా డ్రైవింగ్‌ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఓ వ్యక్తి రద్దీ రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. గచ్చిబౌలి రోడ్డుపై ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో రికార్డయింది.

yamaha r15 bike rider careless road crossing

ఈ వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన జులై నెలలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏ రోజున జరిగిందో పోలీసులు వెల్లడించలేదు.

గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ రోడ్డు రద్దీగా ఉంది. యమహా R15 బైక్‌ రైడర్‌ లేన్‌ మారేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. వెనుక వచ్చే వాహనాలను చూసి ఒక్కసారిగా పక్కకు తిరిగాడు. అయితే ఆ సమయంలో ఎటువంటి ఇండికేటర్‌ వినియోగించలేదు. బైక్ రైడర్‌ లేన్‌ మారేందుకు ప్రయత్నిస్తున్నాడని వెనుక వస్తున్న కార్లు, ఆటో డ్రైవర్లు గమనించారు. తమ వాహనాల వేగం తగ్గించారు.

yamaha r15 bike rider careless road crossing

అయితే ఓ స్కూటీ డ్రైవర్‌ మాత్రం యమహా R15 బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి పడిపోయాయి. వెనుక వచ్చిన కొందరు వాహనదారులు వీరికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటన సమయంలో యమహా బైక్‌, స్కూటీ డ్రైవర్‌ హెల్మెట్లు ధరించి ఉన్నారు. ఫలితంగా పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

యమహా R15 బైక్‌ డ్రైవర్‌ లేన్‌ మారేందుకు లేదా ఇతర రోడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఇది సరైన పద్దతి కాదు. జంక్షన్‌, యూ టర్న్‌ తీసుకొని ఇతర రోడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు. ఇలా చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది.

సాధారణంగా లేన్‌ లేదా రోడ్లు మారాల్సి వచ్చినప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలి. యూటర్న్‌ ఉన్న చోట లేదా అత్యవసరంగా మారాల్సి వచ్చినప్పుడు సరైన ఇండికేటర్‌ వినియోగించాలి. అటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ. ఈ తాజా ఘటనలో రైడర్లకు గాయాలకు కాకపోయినా.. వారి వాహనాలకు కొద్దిగా డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది.

సాధారణంగా అధిక శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం, అధిక వేగంతో ప్రయాణం చేయడం కారణంగా జరుగుతుంటాయి. అయితే కొన్ని ఘటనల్లో చిన్న చిన్న గాయాలపై బయటపడినా.. మరికొన్ని చోట్ల తీవ్రంగా గాయపడడం సహా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అందువల్ల రోడ్లపైన ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 2, 2023, 18:59 [IST]
English summary
Yamaha r15 bike rider careless road crossing causes accident in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+