2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

భారతదేశంలో 18 సంవత్సరాలకంటే తక్కువ వయసు వున్న పిల్లలు చూపించే అసాధారణ ప్రతిభకు ప్రతి సంవత్సరం బాల్ పురస్కార్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో మోటర్‌స్పోర్ట్ అథ్లెట్ విభాగంలో యస్ ఆరాధ్య అనే బాలుడు ఈ బాల్ పురస్కార్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. దీని గురించి మరింత తెలుసుకుందాం!

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుల విజేతలతో యస్ ఆరాధ్య ఒకరుగా ఉన్నారు. 17 ఏళ్ల వయసు కలిగిన యస్ ఆరాధ్య భారతదేశంలో మోటర్‌స్పోర్ట్ అథ్లెట్‌ విభాగంలో బాల్ పురస్కార్ అవార్డు పొందిన మొట్ట మొదటి వ్యక్తి. ఇంత గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డుని పొందటం అనేది మోటర్‌స్పోర్ట్ విభాగానికే ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

బాల్ పురస్కార్ అవార్డుని పొందటం వల్ల ఈ క్రీడ జాతీయ వేదికపై అధికారిక గుర్తింపు పొందడం ప్రారంభించింది. గత సంవత్సరం మోటర్‌ స్పోర్ట్ విభాగంలో మొట్ట మొదటి అర్జున అవార్డుని గెలుచుకున్న వ్యక్తిగా గౌరవ్ గిల్ పేరు పొందాడు.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

18 సవంత్సరాలలోపు పిల్లలకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు. అసాధారణ ప్రతిభకు ఇచ్చే "జాతీయ చైల్డ్ అవార్డ్" పేరునే గత సంవత్సరం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్' గా పేరు మార్చారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డులను భారత ప్రభుత్వమే అందజేస్తుంది. సామాజిక సేవ, కళలు మరియు క్రీడలు వంటి రంగాలలో వారికి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

2020 బాల్ పురస్కార్ అవార్డుని అందుకున్న యస్ ఆరాధ్య 2012 లో జెకె టైర్ నేషనల్ గో-కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన రేసింగ్ కెరీర్‌ను ప్రారంభించి తరువాత, 2017 లో ఫార్ములా రేసింగ్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. 2012 మరియు 2017 మధ్యకాలంలో కొన్ని జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. కొన్ని అంతర్జాతీయ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

2015 లో స్పెయిన్, బెల్జియం మరియు ఫ్రాన్స్‌లలో జరిగిన సిఐకె ఎఫ్ఐఏ అకాడమీ ట్రోఫీ కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు. 2017 లో పోర్చుగల్‌లో జరిగిన రోటాక్స్ వరల్డ్ ఫైనల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎంఎస్‌సిఐ) అతన్ని ఎంపిక చేసింది.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

గత సంవత్సరం ఆరాధ్య సౌత్ ఈస్ట్ ఆసియా ఛాంపియన్‌షిప్ వరకు వెళ్ళాడు మరియు తన తొలి సీజన్‌ను మొత్తం 9 వ స్థానంలో పూర్తి చేశాడు. అతను 2019 MRF MMSC FMSCI ఇండియన్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లోని ఫార్ములా 1600 క్లాస్ లో నాలుగు పోడియం ఫినిషింగ్‌లను ఎంచుకున్నాడు, ఇందులో రేసు విజయంతో సహా. అతను ఎక్స్ 1 రేసింగ్ లీగ్ ప్రారంభ సీజన్లో అతి పిన్న వయస్కులైన పోటీదారులలో ఒకడుగా నిలిచాడు. అతి చిన్న వయసులోనే ఇంతటి అసాధారణ ప్రతిభాను చూపడం వల్ల బాల్ పురస్కార్ అవార్డుని కైవసం చేసుకున్నాడు.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

బాల్ పురస్కార్ అవార్డు అందుకున్న తరువాత ఆరాధ్య ఈ విధంగా మాటాడాడు. ఇంతటి గొప్ప పురస్కారానికి నన్ను అర్హుడిగా భావించినదుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ఈ అవార్డు చాలా మంది మోటర్‌స్పోర్ట్ రైడర్లలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అన్నారు.

2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత యస్ ఆరాధ్య

గత కొన్ని సంవత్సరాలుగా నేను గ్రిడ్‌లో విజయాన్ని సాధించినప్పటికీ, ఈ అవార్డు మాత్రం ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేను సాధించిన విజయం మాత్రమే కాదు, ఈ పురస్కారం ఇతర యువ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తుంది మరియు వారు తమను తాము మరింతగా డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే వారి సాధన ఏదో ఒకరోజు గుర్తించబడుతుందని వారు ఇప్పుడు తెలుసుకుంటారు, అని ఆరాధ్య అన్నారు.

Most Read Articles

English summary
Yash Aradhya wins 2020 Pradhan Mantri Rashtriya Bal Puraskar award. Read in Telugu.
Story first published: Thursday, January 23, 2020, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X