కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి 'యాషిక ఆనంద్'; పరిస్థితి విషమం

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం లెక్కకు మించిన మరణాలు జరుగుతున్నాయని, నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మితిమీరిన వేగం. మనం ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలు చూస్తూనే ఉంటాము. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రముఖ సినీ నటి 'యాషిక ఆనంద్' ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలిసింది.

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటి యాషిక ఆనంద్

నివేదికల ప్రకారం, తెలుగు చిత్రసీమలో 'విజయ్ దేవర కొండ' నటించిన నోటా సినిమాలో నటించిన నటి 'యాషిక ఆనంద్' కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. 'యాషిక ఆనంద్' బిగ్‌బాస్ ఫేమ్ నటి కూడా. ఈ సంఘటన మహాబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో తెల్లవారుజామున 1 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మహాబలిపురం నుంచి చెన్నై వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ సంఘటన సమయంలో కార్లో మొత్తం నలుగురు ఉన్నట్లు తెలిసింది. ఇందులో 'యాషిక ఆనంద్' ఫ్రెండ్ 'వల్లిశెట్టి భవానీ' కూడా ఉన్నారు. ఈమె ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్లు కూడా తెలిసింది. ఈ సంఘటనలో హైదరాబాద్ కి చెందిన 'వల్లిశెట్టి భవానీ' అక్కడికక్కడే తుది శ్వాస విడిచినట్లు తెలిసింది.

ఈ సంఘటనకు ప్రధాన కారణం మితిమీరిన వేగం అని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు కూడా పోలీసుల ప్రాధమిక పరీక్షలో తెలిపారు. ఫ్రెండ్స్ తో కలిసి అతి వేగంతో వస్తున్నప్పుడు రోడ్డుపై ఉన్న డివైడర్ ని ఢీ కొట్టడం వల్ల 'యాషిక ఆనంద్' బృందం ఉన్న కారు పక్కన ఉన్న గొయ్యిలో పడింది.

కారు ప్రమాదానికి గురయ్యిన వెంటనే అక్కడున్న స్థానికులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కారులో ఉన్న నలుగురిలో ఒకరు మరణించగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని హాస్పిటల్ లో చేర్చారు. 'యాషిక ఆనంద్' పరిస్థితి కొంత కఠినంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.

నటి యాషికా ప్రస్తుతం తమిళ సినీరంగంలో ముందుకు వెళ్తోంది. అంతే కాకుండా పలు రియాలిటీ షోల్లో కూడా పాల్గొని పాపులర్ అయ్యింది. ఢిల్లీలో పుట్టిన చెన్నైలో సెటిల్ అయ్యింది. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ నటి 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది.

2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న యాషికా అభిమానులు తెగ అందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలనీ ప్రార్థనలు కూడా చేస్తున్నారు.

Most Read Articles

English summary
Yashika Aannand Accident Drunk Driving. Read in Telugu.
Story first published: Sunday, July 25, 2021, 14:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X