వారెవ్వా.. ఇలాంటి మహీంద్రా థార్ ఎప్పుడైనా చూసారా! (వీడియో)
ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ (Mahindra Thar).. ఇటీవల ఓ కొత్త రూపంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గతంలో మోడిఫైడ్ మహీంద్రా థార్ కార్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే వాటన్నింటికీ భిన్నంగా మరో మాడిఫైడ్ కారు తెరమీదకు వచ్చింది. ఇది పసుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి కలర్ మహీంద్రా థార్ కనిపించలేదు. మోడిఫైడ్ ఎల్లో మహీంద్రా థార్ డిజైన్ చాలా అద్భుతంగా ఉండటం ఇక్కడ చూడవచ్చు.

సాధారణ మహీంద్రా థార్ కారును పసుపు రంగులోకి మరియు కొన్ని అప్డేట్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. వీడియోలో గమనించినట్లయితే.. ఫ్రంట్ ఫాసియాలో జరిగిన కొన్ని మార్పులు. ముందు వైపు మధ్యలో ఎల్లో బార్‌తో కూడిన బ్లాక్ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో రెండు అడిషినల్ ఫాగ్ ల్యాంప్‌లను చూడవచ్చు. దాని పక్కన నిజమైన ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ అల్లాయ్ వీల్స్ కార్బన్ డిప్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చక్రాలకు మధ్యలో ఎల్లో ఇన్సర్ట్‌లను చూడవచ్చు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో అడిషినల్ డోర్ స్టెప్ కూడా గమనించవచ్చు. పైన హమ్మర్‌ను తలపించే లాంప్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద డిజైన్ చాలా కొత్తగా.. చూడటానికి ఆకర్షణీయంగా ఉంది.

మోడిఫైడ్ మహీంద్రా థార్ కారులో గమనించదగ్గది రూప్. ఇది సాఫ్ట్ టాప్ వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మొత్తం గ్లోసీ బ్లాక్‌లో పూర్తయిన మెటల్ హార్డ్ టాప్‌తో అప్‌గ్రేడ్ చేయబడినట్లు చూడవచ్చు. ఇందులో సన్‌రూఫ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. దీనికోసం కూడా ఎక్కువ డబ్బు వెచ్చించినట్లు తెలుస్తోంది. రియర్ ప్రొఫైల్‌లో కూడా చిన్న చిన్న మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. మోడిఫైడ్ మహీంద్రా ఎల్లో థార్ యాంబియంట్ లైటింగ్, సీట్ల మీద పసుపు రంగు స్టిచ్చింగ్ వంటి వాటితో పాటు గ్రాబ్ హ్యాండిల్స్, ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు ఎల్లో ఇన్సర్ట్‌లతో కూడిన లెదర్ రూఫ్ లైనర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. లోపల కూడా ఎల్లో కలర్ చాలా అద్భుతంగా ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ మోడిఫైడ్ మహీంద్రా కారులో ఇంజిన్ అప్డేట్స్ జరగలేదని తెలుస్తోంది. సాధారణ థార్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 2.0-లీటర్ టర్బో పెట్రోల్ (150 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్), 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ (130 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్). ఇక్కడ కనిపించే ఎల్లో మహీంద్రా ఏ ఇంజిన్ ఆప్షన్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








