బైక్‌ల పండుగ గురించి మీరెప్పుడైనా విన్నారా.. వీళ్లు ప్రతి ఏటా ఘనంగా బైక్‌ రైడర్లకు అవార్డులిస్తారు..

జూన్ 21 న ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిల్ దినోత్సవంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా బైక్‌ రైడింగ్‌ అన్నా, బైక్‌లు అన్నా ఇష్టపడని యువత ఉండరు. ఈ క్రమంలో ఎల్లోహాట్ రైడర్ క్లబ్ మరియు రెడీఅసిస్ట్ కంపెనీ సంయుక్తంగా బెంగళూరులో బుధవారం అవార్డు వేడుకను ఘనంగా నిర్వహించాయి.

YellowHat మరియు ReadyAssist ద్విచక్ర వాహనాన్ని సురక్షితంగా నడపడానికి రైడర్‌లలో అవగాహన కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా దేశంలో గణనీయమైన విజయాలు సాధించిన బైక్‌ రైడర్లకు అవార్డులు అందజేసి సత్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మోటార్‌సైకిల్ ప్రియులు ప్రతి ఏటా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

YellowHat-And-ReadyAssist-Event

బెంగళూరులో జరిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి 700 మందికి పైగా బైకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. ఈ అవార్డు వేడుకలో అనేక వినోద కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రాండ్ ఈవెంట్ మ్యూజిక్ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లను ఉంటాయి. అంతేకాకుండా DJ నైట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వివిధ ఉపకరణాల ప్రదర్శనను ఈ ఈవెంట్‌లో ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు భద్రతకు మొదటి ప్రాధాన్యత. యువతకు దీనిపై అవగాహన కల్పించేందుకు బైక్‌ల ద్వారా అడ్వెంచర్ షో నిర్వహిస్తారు.

YellowHat-And-ReadyAssist-Event

YellowHat మరియు ReadyAssist అవార్డు వేడుక ఆటోమొబైల్ రంగాల్లో విజయాలు కనబర్చిన వారిని సత్కరిస్తుంది. ముఖ్యంగా బెస్ట్ రైడర్స్, బెస్ట్ క్లబ్‌లు మరియు బెస్ట్ మెకానిక్‌లకు ఘన సత్కారం ఉంటుంది. అంతే విధంగా మరో గర్వించదగిన విషయమేమంటే YellowHat మరియు ReadyAssist ఒక సంవత్సరం పాటు మెకానిక్ నిపుణులకు చెందిన 36 మంది పిల్లల విద్యకు ఉయ్యే ఖర్చును భరిస్తుంది.

YellowHat మరియు ReadyAssist అవార్డు వేడుక వేదిక గురించిన వివరాలను పరిశీలిస్తే, బెంగళూరులోని కనకపుర రోడ్‌లోని BLR బ్రూయింగ్ కోలో జూన్ 21న ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైంది. అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 9.05 గంటలకు ముగింపు ప్రసంగం, 9.30 గంటల తర్వాత వివిధ కార్యక్రమాలు జరిగాయి.

YellowHat-And-ReadyAssist-Event

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎఫ్‌ఏడీఏ మాజీ ఛైర్మన్ నికుంజ్ పాటిల్, టాటా గ్రీన్ బ్యాటరీస్ సీఈఓ రామశంకర్ పాండే, మొబిలిటీ ఔట్‌లుక్ ఎడిటర్-ఇన్-చీఫ్ దీపాంగ్షు దేవ్ శర్మ, సింపుల్ ఎనర్జీ కో-ఫౌండర్ శ్రేస్ట్ మిశ్రా, హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ సింగ్ గిల్ హాజరయ్యారు.

YellowHat మరియు ReadyAssist ప్రపంచ మోటార్‌సైకిల్ దినోత్సవం గ్రాండ్‌గా జరపడమే కాకుండా ఇటువంటి ఈవెంట్‌ల ద్వారా రైడర్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ద్విచక్ర వాహన రంగంలో వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

YellowHat-And-ReadyAssist-Event

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 22, 2023, 9:19 [IST]
English summary
Yellowhat riders club and readyassist hosts prestigious awards event in banglore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+